నరాలు తెగే ఉత్కంఠ, లక్నోపై ఢిల్లీ గెలుపు

ఐపీఎల్‌-18 సీజన్‌లో ఢిల్లీ బోణీ కొట్టింది. విశాఖపట్నంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో నరాలు తెగే ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఒక వికెట్‌ తేడాతో విజయం సాధించింది.;

Update: 2025-03-24 18:11 GMT
టాటా ఐపీఎల్-2025 నాలుగో మ్యాచ్ విశాఖ డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఏసీఏ, వీడీసీఏ స్టేడియంలో జ‌రిగింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, లక్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన ఈ మ్య‌చ్ తొలుత ఢిల్లీ క్యాపిట‌ల్స్ టాస్ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. రాత్రి 7.30 గంట‌ల‌కు ప్రారంభ‌మైన ఈ మ్యాచ్ లో లక్నో జ‌ట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఓపెన‌ర్లుగా మిచెల్ మార్ష్‌, ఏడెన్ మ‌ర్క‌ర‌మ్‌లు బ‌రిలోకి వ‌చ్చారు. వ‌చ్చీ వ‌స్తుండ‌గానే ఫోర్లు, సిక్స్‌ల‌తో విరుచుకుపడ్డారు. స్కోరు 46 వ‌ద్ద మ‌ర్క్‌ర‌మ్ (15) విప్ర‌జ్ బౌలింగ్‌లో ఔట‌వ్వ‌డంతో ల‌క్నో తొలి వికెట్‌ను కోల్పోయింది. . మ‌రోవైపు మార్ష్ 21 బంతుల్లోనే మార్ష్ త‌న అర్థ సెంచ‌రీని పూర్తి చేశాడు. మార్ష‌కు ఇది ఐపీఎల్‌లో నాలుగో అర్థ సెంచ‌రీ. మార్ష్ 36 బంతుల్లో 72 పరుగులు చేసి ముఖేష్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. అప్ప‌టికి ల‌క్నో స్కోరు 133 ప‌రుగులు. మ‌ర్క్‌ర‌మ్ స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన నిక‌నోల‌స్‌ పూర‌న్ చెల‌రేగిపోయాడు. పూర‌న్ 17 ప‌రుగుల వ‌ద్ద శ‌ర్మ క్యాచ్ వ‌దిలేయ‌డంతో సిక్స్‌లు, ఫోర్ల‌తో మ‌రింత‌గా రెచ్చిపోయాడు. ఆయ‌న 24 బంతుల్లోనే అర్థ సెంచ‌రీ సాధించాడు. 13వ ఓవ‌ర్లో ఏకంగా ఆయ‌న 28 ప‌రుగులు తీశాడు. ఇలా త‌న విధ్వంస‌క‌ర బ్యాటింగ్‌తో పూర‌న్
30 బంతుల్లో 75 ప‌రుగులు అల‌వోక‌గా చేశాడు. ఆనంత‌రం స్టార్క్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత డేవిడ్ మిల్ల‌ర్ 19 బంతుల్లో 27 ప‌రుగులు సాధించి స్కోరు పెర‌గ‌డానికి దోహ‌ద‌ప‌డ్డాడు. ల‌క్నో జ‌ట్టులో కెప్టెన్‌ రిష‌బ్ పంత్‌, శార్దూల్‌, బిష్ణోయ్‌లు ప‌రుగులేమీ చేయ‌కుండానే డ‌కౌట్ అయ్యారు. దీంతో తొలుత ఈ జ‌ట్టు 250 ప‌రుగులు చేస్తుందేమోన‌న్న అనుకున్నారంతా. కానీ బ‌డోని 4, షాబాజ్ 9 ర‌న్స్ మాత్ర‌మే చేసి ఔట‌వ‌డంతో ప‌రుగుల వేగం మంద‌గించింది. ఆఖ‌ర్లో మిల్ల‌ర్ రెండు వ‌రుస సిక్స‌ర్లు బాద‌డంతో మొత్తం 20 ఓవ‌ర్ల‌లో ల‌క్నో జ‌ట్టు 8 వికెట్ల న‌ష్టానికి 209 ప‌రుగులు చేసి ప్ర‌త్య‌ర్థి ఢిల్లీ జ‌ట్టుకు 210 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఇచ్చింది. ల‌క్నో జ‌ట్టులో న‌లుగురు ఆట‌గాళ్లు ప‌రుగుల సునామీని స్రుష్టించారు. అభిమానుల‌కు ఆనందాన్ని పంచారు.
210 ప‌రుగుల ల క్ష్యంతో బ‌రిలోకి ఢిల్లీ..
లక్నో జ‌ట్టు విసిరిన 210 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించ‌డానికి ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు బ‌రిలోకి దిగింది. అయితే ఆరంభంలోనే ఢిల్లీ జ‌ట్టుకు పెద్ద దెబ్బ త‌గిలింది. మొద‌టి ఓవ‌ర్ తొలి రెండు బంతుల‌కే మెక్ గుర్క్‌ ను ఒక ప‌రుగుకే శార్దూల్ ఠాకూర్ ఔట్ చేశాడు. స్కోరు 2 వ‌ద్ద తొలి వికెట్ ప‌డింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన అభిషేక్‌ పారెల్ ను కూడా శార్దూల్ ఔట్ చేశాడు. ఇలా తొలి ఓవ‌ర్ లోనే రెండు ప‌రుగుల వ‌ద్ద రెండు వికెట్ల‌ను కోల్పోయి చిక్కుల్లో ప‌డింది.
రెండో ఓవ‌ర్ లో సిద్ధార్థ్ బౌలింగ్‌లోస‌మీర్ రిజ్వీ ఔట్ అవ‌డంతో మొత్తం ప‌ది బంతుల్లో మూడు వికెట్లు కోల్పోయింది. ఆ త‌ర్వాత క్రీజ్‌లోకి వ‌చ్చిన అక్ష‌ర్ ప‌టేల్, డూప్లెసిస్‌లు వ‌ర‌స ఫోర్లు, సిక్స్‌ల‌తో దూకుడు ప్ర‌ద‌ర్శించారు. కానీ కాసేప‌టికే దూకుడు మీదున్న అక్స‌ర్ ప‌టేల్ (11 బంతుల్లో 22 ప‌రుగులు) ను దిగ్డేష్ ఔట్ చేశాడు. దీంతో ఢిల్లీ 50 ప‌రుగుల‌కే నాలుగు కీల‌క వికెట్ల‌ను కోల్పోయింది. కాసేప‌టికే బిష్ణోయ్ బౌలింగ్‌లో డూప్లెసిస్ 29 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. వరుస‌గా వికెట్లు కోల్పోతున్నా అశుతోష్‌, ..  చెల‌రేగుతూ ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డుతూ ఢిల్లీ స్కోరును పరుగులు పెట్టించారు. ఈ ద‌శ‌లో ఓట‌మి నుంచి విజ‌యం దిశ‌గా వెళ్తుంద‌ని పించింది. అయితే ఢిల్లీ జ‌ట్టులో ఓక్కో వికెట్‌ను తీస్తూ ల‌క్నో బౌల‌ర్లు ద‌డ పుట్టించారు. 171 స్కోరు వ‌ద్ద మిచెల్ స్టార్క్‌ను (ఎనిమిదో వికెట్‌) బిష్ణోయ్ పెవిలియ‌న్ దారి ప‌ట్టించాడు. దీంతో ఢిల్లీ ఆశ‌లు మ‌ళ్లీ స‌న్న‌గిల్లాయి. ఆ ద‌శ‌లో ఆశుతోష్ ఫోర్లు, సిక్స‌ర్ల‌ను బాదుతూ ఢిల్లీ స్కోరును ముందుకు పోనిస్తూ ఆశ‌ల‌ను మ‌ళ్లీ చిగురింప చేశాడు. 18 ఓవ‌ర్లు పూర్తి అయ్యే సరికి ఢిల్లీ స్కోరు 188/8 ఉంది. విజ‌యానికి మ‌రో 22 పరుగులుంద‌న‌గా ఆశుతోష్ దూకుడును కొన‌సాగిస్తూ అంద‌రిలోనూ న‌రాలు తెగే ఉత్కంఠ‌ను పెంచాడు. ఆ స‌మ‌యంలో కుల‌దీప్ ర‌నౌట్ అయ్యాడు. అప్ప‌టికి స్కోరు 192/9 ఉంది. తొమ్మిది బంతుల్లో 18 ప‌రుగులు కావ‌ల‌సి ఉంది. అశుతోష్ శ‌ర్మ 28 బంతుల్లో 50 ప‌రుగులు చేశాడు. ఆ ఊపులో మ‌రో సిక్స్‌ను బాది విజ‌యానికి ప‌ది ప‌రుగుల చేరువ‌కు ఢిల్లీ జ‌ట్టును తీసుకెళ్లాడు. మ‌ళ్లీ ఫోర్ కొట్టాడు. దీంతో ఆరు బంతుల్లో ఆరు ప‌రుగులు చేయాలి. మ‌రో ఐదు బంతులు మిగిలి ఉండ‌గా ఆశుతోష్ అద్భుత సిక్స‌ర్‌తో ఢిల్లీ క్యాపిట‌ల్‌ను అద్వితీయ విజ‌యాన్ని అందించాడు. 31 బంతుల్లో 66 ప‌రుగులు చేశాడు.
ఇదే క‌దా ఐపీఎల్ అంటే.. అన్న‌ట్టుగా వైజాగ్ మ్యాచ్ జ‌రిగింది. వైజాగ్ స్టేడియం మొత్తం కేరింత‌ల‌తో హోరెత్తిపోయింది.
లక్నో స్కోర్ః 209/8
మ‌ర్క్‌ర‌మ్ః 15 (13)
ఎం మార్ష్ 72 (36)
పూర‌న్ 75 (30)
పంత్ 0 (6)
డి.మిల్ల‌ర్ 27 (19) నాటౌట్‌
బ‌డోని 4 (5)
శార్దూల్ 0 (2)
షాబాజ్ 9 (8)
బిష్ణోయ్ 0 (2)
దిగ్వేష్ 0 (0) (నాటౌట్
ఎక్స్‌ట్రాలుః 7
---------------------------------
ఢిల్లీ స్కోర్ః 211/9
మెక్‌గుర్క్ 1 (2)
డెప్లెక్సీ 29 (18)
పారెల్ 0 (2)
రిజ్వీ 4 (4)
అక్స‌ర్ 22 (11)
స్ట‌బ్స్‌ 34 (22)
ఆశుతోష్ 66(31) (నాటౌట్‌)
విప్ర‌జ్ 39 (15)
స్టార్క్‌ 2 (5)
కుల‌దీప్‌ 5 (5)
మోహిత్ 1 (5)
Tags:    

Similar News