ఉప్పల్లో ఉప్పెన : సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతం

ఐపీఎల్ హయ్యెస్ట్ స్కోరు రికార్డు 287 (ఐపీఎల్ 2024) పరుగులకు కేవలం ఒక్క రన్ దూరంలో ఆగిపోయింది.;

Update: 2025-03-23 13:38 GMT

ఆదివారం(23.3.25) సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో

టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ ఇయాన్ పరాగ్ బౌలింగ్ ఎన్నుకున్నాడు.

ఆఫ్గనిస్తాన్ బౌలర్ ఫరూకీ వేసిన రెండో బంతిని బౌండరీ పంపించిన అభిషేక్ శర్మ నాలుగో బంతిని, ప్రేక్షకుల్లోకి పంపాడు. మొత్తానికి మొదటి ఓవర్ లోనే పది పరుగులు సాధించి, తన అభిమతాన్ని ఆర్ఆర్ బౌలర్లకు తెలియపరిచాడు. ఇంతవరకు మూడుసార్లు 200 పైగా పరుగులు చేసిన మొదటి జట్టు అయిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు, ఈ స్పీడ్ చూస్తుంటే మరోసారి 300 పైగా పరుగులు సాధిస్తుందని అనిపించింది. రెండవ ఓవర్లో హెడ్ సిక్సర్ కొట్టి తాను కూడా సిద్ధమని తెలియజేశాడు .

బౌలర్లను ఎడాపెడా బాదిన ట్రావిస్ హెడ్

అలా ఫోర్ ల, సిక్సర్ల వరద పారింది. మూడు ఓవర్ల లో 45 పరుగులు చేశారంటే అర్థం చేసుకోవచ్చు. అప్పుడు బౌలింగ్ కి దిగిన శ్రీలంక బౌలర్ తీక్షణ అభిషేక్ శర్మను అవుట్ చేశాడు. అయినా హెడ్ పరుగుల వరద పారించడం మొదలుపెట్టాడు. నాలుగో ఓవర్ లోనే స్కోరు 50 పరుగులు దాటింది. ఇక లాభం లేదని కెప్టెన్ పరాగ్ ఆర్చర్ ను బౌలింగ్ కి పంపాడు. హెడ్ మొదటి బంతిని ఫోర్ కొట్టి , రెండో బంతిని సిక్స్ గా మలిచాడు.

ఆర్చర్ వేసిన తన మొదటి ఓవర్లో, 23 పరుగులు చేశాడు హెడ్. శర్మ స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఇశాంత్ కిషన్ కూడా చెలరేగిపోయాడు.మొదటి పవర్ ప్లే తర్వాత ఎస్ ఆర్ హెచ్ జట్టు స్కోర్ 94 పరుగులు!

సెంచరీ తో ఇరగదీసిన ఇషాంత్ శర్మ

అప్పుడు కెప్టెన్ పరాగ్ సందీప్ శర్మాను బౌలింగ్ లోకి దింపాడు. ఇషాంత్ కిషన్ మొదటి బంతి కి బౌండరీ కొట్టాడు. పరుగుల వరద పారిస్తున్న హెడ్ 8 ఓవర్లో తన అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అందుకు కేవలం 21 బంతులు మాత్రమే తీసుకున్నాడు!ఉప్పల్ స్టేడియంలో ఉప్పెన సృష్టించాడు. చివరకు 31 బంతుల్లో 67 పరుగులు చేసి హెడ్ శాంతించాడు.దేశ్ పాండే బౌలింగ్లో హెట్ మేయర్ కు క్యాచ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పటికే బౌలర్లను ఎడాపెడా

బాది అలకలోల్లం సృష్టించాడు. పది ఓవర్లలో జట్టు స్కోరు 136 పరుగులు.

ఇక బ్యాటింగ్కు వచ్చిన నితీష్ రెడ్డి కూడా బంతిని బాదడమే పనిగా పెట్టుకుని వచ్చాడు జట్టు స్కోరు 300 దాటడం ఖాయం అనిపించింది.

ఆర్చర్ వేసిన 13వ ఓవర్ లో తన రెండో సిక్సర్ కి 25 బంతుల్లో 6 బౌండరీలు, రెండు సిక్సర్లతో 51 పరుగులు పూర్తి చేసుకున్నాడు ఇషాన్ కిషన్. 13 ఓవర్లకి 178 పరుగులు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఫరూకీ వేసిన 14వ ఓవర్లో మొదటి బంతిని ప్రేక్షకుల్లోకి పంపించాడు ఇషాంత్ కిషన్. స్టేడియంలో ప్రేక్షకులను కూడా కంగారు పెట్టాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టు సంగతి సరేసరి.

రాజస్థాన్ రాయల్ బౌలర్ తో ఆడుకున్న క్లాస్సేన్

14 ఓవర్లలో 196 పరుగులు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. 15 ఓవర్లో జట్టు స్కోరు 200 దాటింది. రాజస్థాన్ రాయల్ బౌలర్సు బంతి ఎక్కడ వేయాలో తెలీక ఎక్కువ వైడ్ లు వేయడం మొదలుపెట్టారు. చివరకు నితీష్ రెడ్డి హెలికాప్టర్ షాట్ ఆడబోయి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటికే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కావలసినంత డామేజ్ చేసి వెళ్ళాడు. 15 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఇషాంత్ కిషన్ తన పని తాను చేసుకుంటూ వెళ్ళాడు. ఈ ఓవర్తో ఈ తీక్షణ తన బౌలింగ్లో నాలుగు ఓవర్లకి 52 పరుగులు ఇచ్చాడు.

తర్వాత బ్యాటింగ్కు వచ్చిన క్లాసన్ కూడా బౌండరీ తోనే మొదలుపెట్టాడు. మొదటిసారి రాజస్థాన్ రాయల్స్ జట్టు టైం అవుట్ ను కోరుకుంది. ఎందుకంటే ఈ పరుగుల వరదను తట్టుకోలేక.

టైం అవుట్ తర్వాత కూడా రాజస్థాన్ రాయల్ జట్టుకి స్వాంతన లభించలేదు. ఈ దశలో బ్యాట్ కు తగిలిన ప్రతి బంతి బౌండరీ కి గాని, బౌండరీ దాటి గాని వెళ్లే పరిస్థితి కనబడింది. స్కోరు 18 ఓవర్ లో 250 పరుగులు దాటింది. ఆర్చర్ తన నాలుగో ఓవర్ తర్వాత బౌలింగ్లో 76 పరుగులు ఇచ్చాడు

19 ఓవర్లో క్లాసన్ అవుట్ కావడంతో కొంత ఊపిరి పీల్చుకుంది రాజస్థాన్ రాయల్స్ జట్టు. 19 ఓవర్లో వరసగా రెండు సిక్సర్లు కొట్టాడు ఇషాంత్ కిషన్. తర్వాత బంతికి రెండు పరుగులు చేసి, ఈ సీజన్ కి మొదటి శతకాన్ని సాధించినవాడు అయ్యాడు. దీనికి కేవలం 45 బంతులు మాత్రమే తీసుకున్నాడు. తర్వాత బంతికి మళ్ళీ ఒక సిక్సర్ కొట్టాడు. తర్వాతి ఓవర్లో అనికేత్ ఒక సిక్స్ కొట్టి తర్వాత అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాట్స్మెన్ అభినవ మొదటి బంతి కె అవుట్ అయ్యాడు

చివరి బంతికి ఇషాంత్ కిషన్ ఒక బౌండరీ సాధించాడు. చివరికి సన్రైజర్స్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. 2024 సీజన్లో 287 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ గెలవాలంటే రాజస్థాన్ రాయల్ జట్టు 287 పరుగులు చేయాలి.

స్కోర్ వివరాలు

ఎస్ ఆర్ హెచ్ బ్యాటింగ్:


286/6 వికెట్లకి (20 ఓవర్లు)

హెడ్ 67 (31 బంతులు, 9 ఫోర్లు, 3 సిక్సర్లు)

ఇషాంత్ కిషన్ 106 (47 బంతులు, 11 ఫోర్లు, 6 సిక్సర్లు)

క్లాసన్ 56 (31 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్సర్)

రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్


తీక్షణ 2 వికెట్లు (4 ఓవర్లు)

దేశ్ పాండే,3 వికెట్లు (4 ఓవర్లు)

సందీప్ శర్మ 1 వికెట్ (4 ఓవర్లు)

Tags:    

Similar News