జట్టు సమతుల్యం కోసమే మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాను: గైక్వాడ్
స్పిన్నర్లను ప్రశంసించిన చెన్నై కెప్టెన్, ముంబై అరంగ్రేట ఆటగాడు విఘ్నేశ్ కు మంచి భవిష్యత్ ఉందన్న ముంబై కెప్టెన్;
By : The Federal
Update: 2025-03-24 05:07 GMT
తన బ్యాటింగ్ ఆర్డర్ మారడం వలన జట్టుకు సమతుల్యం తీసుకువస్తుందని చెన్నై కెప్టెన్ రుతురాత్ గైక్వాడ్ అన్నారు. అందుకే తాను ఓపెనింగ్ నుంచి మూడో స్థానానికి మారానని చెప్పారు.
ముంబాయి ఇండియన్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా రాహుల్ త్రిపాఠి బరిలోకి దిగాడు. అతను రచిన్ రవీంద్ర తో కలిసి ఇన్నింగ్స్ ను ప్రారంభించాడు. అంతకుముందు చాలాకాలం చెన్నై ఒపెనర్ గా రుతురాజ్ ఉన్నాడు.
మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన రుతరాజ్ దూకుడైన బ్యాటింగ్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ తో పాటు, రచిన్ కూడా అర్థ సెంచరీలు సాధించాడు. దీనితో తొలి మ్యాచ్ లో ముంబై పై నాలుగు వికెట్ల తేడాతో సీఎస్కే విజయం సాధించింది.
‘‘మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకోవడం జట్టు అవసరాల కోసం తీసుకున్న నిర్ణయం. ఇది జట్టుకు మరింత సమతుల్యం ఇస్తుంది. నా స్థానాన్ని నేను మార్చుకోవడం నిజంగా సంతోషంగా ఉంది’’ అని మ్యాచ్ అనంతరం గైక్వాడ్ అన్నారు.
సీఎస్కే అరంగ్రేట ఆటగాడు నూర్ అహ్మాద్ నేతృత్వంలోని స్పిన్నర్ల ప్రదర్శనను కెప్టెన్ ప్రశంసించారు. ఈ మ్యాచ్ లో అహ్మద్ నాలుగు వికెట్లు తీసి ముంబై జోరు పుంజుకోకుండా చూశారు. జడేజా కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో ఒక్కో పరుగు రాబట్టడానికి ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ తీవ్రంగా కష్టపడ్డారు.
‘‘ స్పిన్నర్లు సరిగ్గా లైన్ అండ్ లెన్త్ తో బౌలింగ్ వేశారు. చెపాక్ లో ముగ్గురు స్పిన్నర్లు కలిసి బౌలింగ్ చేయడం మాకు నిజంగా ఉత్సాహంగా ఉంది. ఖలీల్ అనుభవజ్ఞుడు. నూర్ ఒక ఎక్స్ ఫ్యాక్టర్. అందుకే మేము అతన్ని జట్టులో రావాలని కోరుకున్నాం. వీరికి అశ్విన్ కూడా తోడయ్యాడు.’’ అని చెప్పారు.
మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని గురించి చెబుతూ.. ‘‘ మాజీ కెప్టెన్ ఈ సంవత్సరం మరింత ఫిట్ గా ఉన్నాడు. అతను ఇంకా యువకుడిగా కనిపిస్తున్నాడు. ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఐపీఎల్ అరంగ్రేట ఆటగాడు విఘ్నేష్ పుత్తూర్ కు మంచి భవిష్యత్ ఉందని అంచనా వేశాడు. విఘ్నేశ్ విజృంభణతో ఆతిథ్య చెన్నై కూడా షేక్ కు గురైంది. ఈ అరంగ్రేట ఆటగాడు మూడు వికెట్లు తీశాడు.
‘‘మేము 15-20 పరుగులు తక్కువగా సాధించాము. కానీ మా బ్యాట్స్ మెన్లు చూపించిన పోరాటం ప్రశంసనీయం. ఎంఐ దానికే ప్రసిద్ది చెందింది. యువకులకు అవకాశం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. స్కౌట్స్ లో పది నెలలు ఇలా చేస్తారు. ఇప్పుడు చూస్తున్న ఆ ఆటగాడు(విఘ్నేష్) దాని ఉత్పత్తే’’ అని చెప్పాడు.
‘‘ఆట తీవ్రంగా సాగినట్లయితే నేను అతని కోటాను ఆపేస్తాను. విఘ్నేష్ కు 18 ఓవర్ ఇవ్వడానికి పెద్ద కష్టం కాదు. ఇక్కడ మంచు లేదు. కానీ జిడ్డుగా ఉంది. రెండో ఇన్నింగ్స్ లో రుతురాజ్ బ్యాటింగ్ చేసిన విధానం ఆటను మా నుంచి దూరం చేసింది’’ అని సూర్యకుమార్ అన్నారు.