300 పరుగులు దాటుతుందా?
ఈసారి హైదరాబాద్ జట్టు రికార్డు సృష్టిస్తుందా లేదా..;
సాధారణంగా రెండు జట్లు మ్యాచ్ ఆడుతుంటే ఎవరు గెలుస్తారు అన్న దానిమీద అభిమానులు, విశ్లేషకులు చర్చ చేస్తారు. కానీ ఈసారి మాత్రం హైదరాబాద్ జట్టు 300 పరుగులు చేసి రికార్డు సృష్టిస్తుందా లేదా అన్న దాని మీదనే ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. విశ్లేషణలు కూడా ఆ స్థాయిలోనే ఉన్నాయి. . పైగా సన్రైజర్స్ తో ఆడుతున్న జట్టు ఒక మ్యాచ్ ఓడిపోయి ఉండడమే కాకుండా, అంత బలమైన జట్టు కూడా కాదు.
ఈరోజు సాయంత్రం 7:30 కి హైదరాబాదులో తన సొంత ఉప్పల్ స్టేడియంలో, మొదటి మ్యాచ్లో ఉప్పెన సృష్టించిన తర్వాత బలహీనమైన లక్నో సూపర్ జెంట్స్ జట్టుతో ఆడుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలుస్తుందా లేదా అన్న విషయం మీద రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర అభిమాన ప్రేక్షకుల కు ఆసక్తి ఉండడం లో ఆశ్చర్యమేమీ లేదు . ఈసారి 300 దాటుతుందా లేదా అన్నదానిమీదనే సర్వత్ర ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పుడు ఐపీఎల్ ఆడుతున్న 10 జట్లలో, బలమైన బ్యాటింగ్ జట్టుగా హైదరాబాద్ తయారయింది. ఇప్పటికి 4 సార్లు 250 పైగా పరుగులు చేసిన జట్టు హైదరాబాదే.
ఇంతవరకు లక్నో సూపర్ జెంట్స్ తో 4 మ్యాచులు ఆడిన సన్రైజర్స్ హైదరాబాద్ 1 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. జట్టు చేసిన అత్యధిక స్కోరు 182 మాత్రమే. అయినా హైదరాబాద్ జట్టు గెలుస్తుంది అన్నదాంట్లో చాలామందికి అనుమానం లేదు.
అరి వీర భయంకర బ్యాట్స్మెన్లు
హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ బలంగా ఉంది. , నికొలాస్ పూరన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వంటి వారిని ఆపడం కష్టం. ఎటువంటి బౌలర్ను అయినా ఎడాపెడా బాదే బ్యాటింగ్ హైదరాబాద్ సొంతం. బౌలింగ్ లో కూడా హైదరాబాద్ జట్టు కన్నా లక్నో సూపర్ జెంట్స్ జట్టు కొంచెం వీక్ గానే ఉంది.రవి బిష్నోయి,శార్దుల్ ఠాకూర్ లాంటి ఇద్దరు బౌలర్లు మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో పాడినవారు. కొంతవరకు తమ బౌలింగ్ తో జట్టును గెలిపించగల సామర్థ్యం ఉన్నవారు. బ్యాటింగ్ పరంగా చూసిన ఇషాంత్ కిషన్, హెడ్, అభిషేక్ శర్మ లాంటి బ్యాట్స్మెన్లు ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు, బ్యాటింగ్ పరంగా ఎటువంటి బౌలింగ్ జట్టుకైనా సరే ప్రమాదకరమే. లక్నో సూపర్ జెంట్స్ ఏ విధంగా చూసినా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కన్నా కొంచెం తక్కువే.
అంత బలంగా లేని లక్నో సూపర్ జెంట్స్ బౌలింగ్
బౌలింగ్ లో కూడా హైదరాబాద్ జట్టు కన్నా లక్నో సూపర్ జెంట్స్ జట్టు కొంచెం వీక్ గానే ఉంది. హైదరాబాద్ బౌలింగ్లో కూడా లక్నో సూపర్ జెంట్స్ కన్నా కొంచెం మెరుగ్గా ఉంది కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్వయంగా మంచి బౌలర్. మహమ్మద్ షమీ అంతర్జాతీయ స్థాయిలో ఈమధ్య బాగా రాణించాడు, ఆడం జంపా లాంటి లెగ్ స్పిన్నర్ ఉన్నాడు.రాహుల్ చాహర్ కూడా లెగ్ స్పిన్నరే.రవి బిష్నోయి,శార్దుల్ ఠాకూర్ లాంటి ఇద్దరు బౌలర్లు మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో పాడినవారు. కొంతవరకు తమ బౌలింగ్ తో జట్టును గెలిపించగల సామర్థ్యం ఉన్నవారు. పైగా ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియం పిన్ గా సహకరించే పిచ్ గా పేరు పడింది. అటువంటి సందర్భంలో రవి బిష్నోయి,శార్దుల్ ఠాకూర్ లపైన లక్నో సూపర్ జెంట్స్ ఆధారపడాల్సి వస్తుంది. స్పిన్ పిచ్, పైగా సన్రైజర్స్ హైదరాబాద్ కి సొంత మైదానం, ఇంతకుముందు మొదటి మ్యాచ్ ను ఓడిపోయిన నేపథ్యం. ఇవన్నీ కలిస్తే లక్నో సూపర్ జీన్స్ కు చాలా కఠినమైన మ్యాచ్ ఇది. పైగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆడం జంపా, రాహుల్ చాహర్ లాంటి లెగ్స్పిన్నర్లు ఉన్నారు. బౌలింగ్కు అనువైన పిచ్ అంటే అది కచ్చితంగా లెగ్ స్పిన్నర్లకు స్వర్గం లాంటిది. ఆఫ్ స్పిన్నర్లకు అంతగా సహకరించదు. హైదరాబాద్ జట్టు బౌలింగ్ కూడా పటిష్టంగానే ఉంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తోపాటు మహమ్మద్ షమి, సిమర్జీత్ సింగ్,ఆడం జంపా మంచి బౌలర్లే.
పట్టు లేని పంత్
లక్నో సూపర్ జెంట్స్ 27 కోట్లు పెట్టి కొనుక్కున్న రిషబ్ పంత్, రాజస్థాన్ రాయల్స్ లో జరిగిన మొదటి మ్యాచ్ లో జట్టును గెలిపించలేకపోయాడు. ఆటగాడిగా విఫలమైన పంత్, కెప్టెన్ గా కూడా విఫలమయ్యాడు. ప్రముఖ ఓపెనింగ్ డాషింగ్ బ్యాట్స్మెన్, సెహ్వాగ్ మాటల్లో చెప్పాలంటే " రిషబ్ పంత్ నిర్లక్ష్యం వల్లనే ఢిల్లీ క్యాపిటల్స్ లో జట్టును గెలిపించలేకపోయాడు. నాయకుడిగా విఫలమయ్యాడు. స్వయంగా కూడా ఒక స్టంపింగ్ ఛాన్స్ ను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. బౌలింగ్ ఎవరితో చేయించాలన్న సంగతి విస్మరించాడు. మ్యాచ్ పై పంత్ కు పట్టు లేకుండా పోయింది"
పంత్ నాయకత్వం ఇప్పుడు పరీక్షకు గురవుతుంది. ఎందుకంటే ఎక్కువ ధర పలకడమే కాకుండా, జట్టుకు నాయకత్వం వహించే బాధ్యత ఉండటం వల్ల, రిషబ్ పంత్ కొంత ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఉంది. పంత్ వికెట్ కీపర్ గా కూడా గత మ్యాచ్లో, అది కీలక సమయంలో ఫెయిల్ అయినందువల్ల, మరింత ఒత్తిడికి గురి అయ్యే అవకాశం ఉంది. గత మ్యాచ్లో బ్యాటింగ్ పరంగా కూడా ప్రదర్శన అంత బాగాలేదు. కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా, బ్యాట్స్మెన్ గా రిషబ్ పంత్ ప్రదర్శన మొదటి మ్యాచ్ తో పాటు, ఇంతకు ముందు జరిగిన ఇతర ఐపీఎల్ మ్యాచ్లలో కూడా, అంత బాగాలేదు.
ఏదేమైనప్పటికీ మంచి ఊపు మీద ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును, సొంత స్టేడియంలో, ప్రేక్షక అభిమానుల మధ్య ఓడించడం అన్నది కొంచెం కష్టమైన విషయమే. అందరి అంచనాల ప్రకారం ఈ మ్యాచ్లో గెలిచేది, సన్రైజర్స్ హైదరాబాదే, కాకపోతే 300 పరుగులు దాటి రికార్డ్స్ సృష్టిస్తుందా లేదా అన్నదానిపైనే సర్వత్ర ఆసక్తి నెలకొని ఉంది.