ఐపీఎల్: ఆకాశమే హద్దుగా చెలరేగిన ఇషాన్, భారీ స్కోర్ సాధించిన హైదరాబాద్

ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ సాధించిన ఆరేంజ్ ఆర్మీ;

Update: 2025-03-23 12:41 GMT
ఇషాన్ కిషన్

ఐపీఎల్ 2025 లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 106 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఇది ఇషాన్ కు తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. కిషన్ కు తోడుగా ట్రావిస్ హెడ్ కూడా దూకుడుగా ఆడి అర్థ సెంచరీ సాధించడంతో సన్ రైజర్స్ ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోర్(286/6) సాధించింది. కేవలం ఒక్క పరుగుతోనే టోర్నిలో అత్యధిక స్కోర్ చరిత్రను కోల్పోయింది

హెడ్ ఆఫ్ సెంచరీ..
హెడ్ 31 బంతుల్లో 67 పరుగులు సాధించాడు. ఇందులో తొమ్మిది ఫోర్లు, మూడు భారీ సిక్స్ లు ఉన్నాయి. ఇషాన్ కిషన్ తన బ్యాటింగ్ లో పదకొండు ఫోర్లు, ఆరు సిక్స్ లు బాదేశాడు.
హైదరాబాద్ ఈ ఐపీఎల్ సీజన్ లో తొలి 250 కు పైగా పరుగులు నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో అర్థ సెంచరీ సాధించడంతో టీ20 కెరీర్ లో నాలుగు వేల పరుగులు సాధించిన జాబితాలో చేరాడు. హెన్రీచ్ క్లాసెన్ ఐపీఎల్ లో వేయి పరుగులు సాధించిన జాబితాలో చేరాడు.
ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ నాలుగు ఓవర్ల కోటాలో 76 పరుగులు ఇచ్చాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును తన పేరు మీద లిఖించుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు మోహిత్ శర్మ పేరు మీద ఉంది. ఈ బౌలర్ ఇంతకుముందు తన నాలుగు ఓవర్ల కోటాలో 73 పరుగులు ఇచ్చాడు.
పరాగ్ కెప్టెన్సీ..
అంతకుముందు ఆర్ఆర్ తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తద్వారా ఐపీఎల్ లో అతి పిన్న వయస్కులైన కెప్టెన్లలో ఒకడిగా నిలిచాడు. అతను 23 సంవత్సరాల వయస్సులో కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు.
రాజస్థాన్ రాయల్స్ తొలి ఐపీఎల్ టైటిల్ సాధించగా, ఎస్ఆర్ హెచ్ 2016 లో తొలి టైటిల్ సాధించింది. అంతకుముందు కేన్ విలియమ్స్ నేతృత్వంలో ఫైనల్ చేరిన ఓడిపోయింది. అలాగే గత సంవత్సరం కూడా ఫైనల్ చేరినప్పటికీ కోల్ కత చేతిలో ఓటమి చెందింది.
శనివారం కోల్ కతలో జరిగిన ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచ్ లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూర్ ఏడు వికెట్ల తేడాతో ఢిపెండిగ్ ఛాంపియన్ కోల్ కతను ఓడించింది.
ప్లేయింగ్ ఎలెవన్..
సన్ రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహార్, పాట్ కమిన్స్, సిమర్జీత్ సింగ్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ
ఇంపాక్ట్ సబ్ లు: సచిన్ బేబీ, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, ఆడమ్ జంపా, వియాన్ ముల్డర్
రాజస్థాన్ రాయల్స్: యశస్వీ జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రాన్ హెట్ మేయర్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్ పాండే, సందీప్ శర్మ, ఫజల్ హక్ ఫారుఖీ.
ఇంపాక్ట్ సబ్: సంజూ శాంసన్, కునాల్ సింగ్ రాథోడ్, ఆకాల్ మధ్వల్, కుమార్ కార్తికేయ, క్వేనా మఫాకా
Tags:    

Similar News