కేకేఆర్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ రీ షెడ్యూల్ జరగదు: గంగూలీ

వచ్చే నెల ఆరును కోల్ కత వేదికగా జరగనున్న మ్యాచ్, కానీ అదే రోజు శ్రీరామనవమి, 20 వేల ర్యాలీలు తీయనున్నట్లు ప్రకటించిన హిందూ సంస్థలు, బీజేపీ;

Update: 2025-03-23 05:50 GMT
సౌరవ్ గంగూలీ

వచ్చే నెల ఏప్రిల్ ఆరున కోల్ కతలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగబోయే కేకేఆర్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ ను గౌహతికి తరలిస్తారని వస్తున్న వార్తలను మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఖండించారు.

ఆ రోజు శ్రీరామ నవమి కావడంతో కోటీ మందితో బెంగాల్ అంతటా ర్యాలీలు తీయడానికి బీజేపీ సహ ఇతర హిందూ సంస్థలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల నుంచి సరైన భద్రత లభించడం కష్ఖం అవుతుందని ఐపీఎల్ పాలకమండలి భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని గంగూలీ తోసిపుచ్చారు. బీసీసీఐ నుంచి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడాన్ని ఆయన గుర్తు చేశారు.

‘‘ ఏం జరుగుతుందో వేచి చూడండి. నిన్న కోల్ కత పోలీసులు పెట్టిన పోస్ట్ చూశారా? మ్యాచ్ వేదిక మారుతుందని నేను అయితే అనుకోవడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో నేను ఢిల్లీ క్యాపిటల్స్ కు మద్దతు ఇస్తున్నా’’ అని ఓ కంపెనీ బ్రాండ్ కార్యక్రమంలో చెప్పారు.
ఇదే విషయంపై బోర్డు అపెక్స్ సమావేశంలో మాట్లాడిన బీసీసీఐ అధికారి ఒకరు సరైన భద్రతా ఏర్పాట్లతో ప్రణాళిక ప్రకారం మ్యాచ్ కొనసాగేలా కోల్ కత పోలీసులతో చర్చలు కొనసాగుతున్నాయని ధృవీకరించారు. ‘‘అందరి భద్రతను నిర్ధారించడానికి కోల్ కత పోలీసులు మ్యాచ్ కోసం దాని విస్తరణ వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. ’’ అని ఆ అధికారి చెప్పారు.
పోలీసులు ఏం చెప్పారంటే..
మ్యాచ్ రీ షెడ్యూల్ చేసే తప్పుడు నివేదికలను నమ్మవద్దని కోల్ కత పోలీసులు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీన్ని చూసే గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ఏప్రిల్ 6న జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రీ షెడ్యూల్ కు సంబంధించి కొన్ని తప్పుదారి ప్రకటించే పోస్టులు ప్రచారంలో ఉన్నాయి. కోల్ కత పోలీసులు అందరి పౌరుల భద్రతను కాపాడడానికి దృఢంగా కట్టుబడి ఉన్నారు. ప్రజా భద్రతకు సంబంధించి అత్యంత ప్రాధాన్యతనిస్తాము. కోల్ కత పోలీసులు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు’’ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
భద్రతా కారణాల దృష్ట్యా ఈ మ్యాచ్ ను గౌహతికి తరలించవచ్చని ఇంతకుముందు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, గంగూలీ అన్నయ్య స్నేహాశీష్ గంగూలీ సూచించిన రెండు రోజుల తరువాత బీసీసీఐ మాజీ చీఫ్ వ్యాఖ్యలు వెలువడ్డాయి.
‘‘మ్యాచ్ ను తిరిగి షెడ్యూల్ చేయమని బీసీసీఐకి తెలియజేసాము. కానీ కోల్ కతలో ప్రత్యామ్నాయా మార్గాలు లేవు. అందుకే మ్యాచ్ ను గౌహతికి మార్చాలని అనుకుంటున్నాము’’ అని స్నేహశీష్ చెప్పారు.
శ్రీరామనవమి నాడు కోల్ కత పోలీసులు తగినంత భద్రత కల్పించలేరని వాదనలు వినిపిస్తున్నాయి. ‘‘పోలీసు రక్షణ లేకపోతే మ్యాచ్ చూడటానికి వచ్చే 65 వేల మంది ప్రేక్షకులకు భద్రత కల్పించడం కష్టం అవుతుంది ’’ అని ఆయన చెప్పారు.
నవమి నాడు పశ్చిమబెంగాల్ అంతటా దాదాపు 20 వేలకు పైగా ఊరేగింపులు నిర్వహిస్తామని బీజేపీ నాయకుడు సువేందు అధికారి ఇంతకుముందే ప్రకటించారు. దీనితో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే షెడ్యూల్ కు అనుగుణంగా ర్యాలీలు ఉండాలని ఇప్పటికే పాలక టీఎంసీ ప్రకటించింది. ఇక్కడ రాజకీయ ఘర్షణలకు ఆస్కారం ఉండే అవకాశం ఉండటంతో పోలీసులు భారీగా భద్రతా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఒక వేళ ఈ మ్యాచ్ ను రీ షెడ్యూల్ చేయాల్సి వస్తే అది మొత్త ఐపీఎల్ మ్యాచ్ లపై ప్రభావం చూపే అవకాశం ఉంది.


Tags:    

Similar News