ఈ క్రికెట్ ఏందీ.. ఇన్ని కోట్ల మంది చూసుడేంది స్వామీ!
కోల్ కతా మ్యాచ్ 40.9 కోట్ల మంది, హైదరాబాద్ మ్యాచ్ 30.1 కోట్ల మంది, చెన్నై మ్యాచ్ 27.1 కోట్ల మంది చూశారు. ICC ఛాంపియన్ షిప్ 89.2 కోట్ల మంది చూశారు.;
By : The Federal
Update: 2025-03-23 17:30 GMT
కోల్ కతా మ్యాచ్ 40.9 కోట్ల మంది, హైదరాబాద్ మ్యాచ్ 29 కోట్ల మంది, చెన్నై మ్యాచ్ 27.1 కోటల మంది చూశారని లైవ్ క్రికెట్ స్కోర్ డేటా చెబుతోంది. ICC ఛాంపియన్ షిప్ 89.2 కోట్ల మంది చూశారు. దీన్నిబట్టి చూస్తుంటే జనమంతా పనీ పాటా లేకుండా అచ్చంగా క్రికెట్టే చూస్తున్నారా? అనిపించవచ్చు గాని ఇదే నిజం. ఐపీఎల్ మ్యాజిక్‌కి ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు కేరింతలు కొడుతున్నారు. అంతర్జాతీయంగా క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణకు ఈ వీక్షకుల సంఖ్య ఓ నిదర్శనం.
ఇండియాలో క్రికెట్ అంటే పండుగనాలేమో.. మొన్న ఐసీసీ ఛాంపియన్ షిప్.. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025. ఈ సీజన్‌కి వీక్షకుల నుండి విపరీతమైన స్పందన లభిస్తోంది. టీవీలు, మొబైల్‌లు, డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ – అన్ని వేదికలపై కోట్లాది మంది ప్రేక్షకులు తమ ఇష్టమైన జట్ల ఆటతీరును ఆసక్తిగా తిలకిస్తున్నారు.
మార్చి 23 ఆదివారం హైదరాబాద్ లో మధ్యాహ్న 3.30 గంటల నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరిగిన రసవత్తర పోరును 29.2 కోట్ల మంది చూసినట్టు జియో హాట్ స్టోర్ పేర్కొంది. ఇది కేవలం స్టార్ స్ట్రీమింగ్ మాత్రమే. రాత్రి 7.30 నుంచి చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరిగిన మ్యాచ్‌ను రాత్రి 9 గంటల ప్రాంతంలో 13.6 కోట్ల మంది వీక్షించడం విశేషం. బహుశా మ్యాచ్ ముగిసే నాటికి ఈ సంఖ్య ఇంకా భారీగానే ఉండవచ్చు. నిన్నటి కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌కి కూడా భారీ వ్యూయర్‌షిప్ వచ్చినట్టు సమాచారం.
మార్చి 22, శనివారం ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మ్యాచ్ ని 40.9 కోట్ల మందికి పైగా చూసినట్టు live cricket score data ప్రకటించింది.
ఇది మాత్రమే కాకుండా, ఇటీవల జరిగిన ఐసీసీ ఛాంపియన్‌షిప్ – 2025 ఫైనల్ మ్యాచ్‌ను దాదాపు 89 కోట్ల మంది వీక్షించడం క్రికెట్‌కి ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి ఆదరణ ఉందో స్పష్టం చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో జరిగే మ్యాచ్‌లకే కాదు, దేశవాళీ లీగ్‌లకూ ఇంతటి ఆదరణ లభించడం భారత క్రికెట్ బ్రాండ్‌కు మరింత ప్రతిష్టను తీసుకొచ్చినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రతి బంతికి క్షణక్షణాన మారే ఉత్కంఠ, స్టార్ ఆటగాళ్ల ప్రదర్శన, యువ ఆటగాళ్ల అవకాశాలు – ఇవన్నీ ఐపీఎల్‌ను కేవలం లీగ్‌గా కాకుండా, అభిమానులకు ఒక పండుగగా మార్చాయి. టెక్నాలజీ అభివృద్ధి, డిజిటల్ యాక్సెస్ వల్ల ప్రపంచంలోని కోట్లాది మంది ఈ క్రికెట్ మేళాను ఏ మూలనుండైనా ఆస్వాదించగలగడం కూడా ఈ విజయానికి ఒక ప్రధాన కారణం.
ఈ ట్రెండ్‌పై ప్రముఖ క్రికెట్ విశ్లేషకుడు రమణ తాతయ్య స్పందిస్తూ, "ఐపీఎల్ ఇప్పుడు కేవలం దేశవాళీ లీగ్ మాత్రమే కాదు, ఇది గ్లోబల్ ఈవెంట్. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులని ఆకర్షించగల మేటి కంటెంట్ ఇది. మ్యాచ్ క్వాలిటీ, ఉత్కంఠ భరితమైన ఫినిష్‌లు, యువ ఆటగాళ్ల ప్రతిభ – ఇవన్నీ కలిసి దీనిని ప్రేక్షకుల హృదయాలలో స్థిరంగా నిలిపేశాయి."
మరో స్పోర్ట్స్ స్టాటిస్టిక్స్ విశ్లేషకుడు స్వాతి ముక్కం మాట్లాడుతూ, "89 కోట్ల మంది ఐసీసీ ఫైనల్ చూడడం అనేది అత్యంత ప్రాధాన్యమైన విషయం. ఇది కేవలం భారత్‌లోని క్రికెట్ పాపులారిటీకి గుర్తింపు కాదు, క్రికెట్ ఓ గ్లోబల్ ఎంటర్టైన్‌మెంట్ ఫార్మాట్‌గా మారుతున్నదనే దానికి నిదర్శనం."
ఎన్ని దేశాల జనాభాతో సమానం..
ఇన్ని కోట్ల మంది చూడడం అంటే ఎన్ని దేశాల జనాభాతో సమానమో ఇప్పుడు చూద్దాం..
ఐసీసీ ఛాంపియన్‌షిప్ 2025 ఫైనల్ – 89 కోట్ల మంది వీక్షకులంటే 7 దేశాల జనాభాతో సమానం.
2024 అంచనాల ప్రకారం..
బంగ్లాదేశ్ – సుమారు 17 కోట్లు
రష్యా – సుమారు 14.4 కోట్లు
జపాన్ – సుమారు 12.5 కోట్లు
ఫిలిప్పీన్స్ – సుమారు 11.5 కోట్లు
ఇథియోపియా – సుమారు 12.7 కోట్లు
వియత్నాం – సుమారు 10 కోట్లు
ఇన్నీ దేశాల జనాభా కలిపితే దాదాపు 89 కోట్ల సమానం.
ఇక ఐపీఎల్ మ్యాచ్ ల వీక్షకులు ఎంతమందంటే...
మార్చి 22న కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో కేకేఆర్ (KKR) vs ఆర్సీబీ (RCB) మధ్య జరిగిన మ్యాచ్‌ను సుమారు 40.9 కోట్ల మంది (409 మిలియన్లు) వీక్షించారని అంచనా.
ఈ సంఖ్యను దేశాల జనాభాతో పోల్చితే:
కొన్ని దేశాల జనాభాలు (2024 అంచనా ప్రకారం):
అమెరికా సుమారు 34 కోట్లు, బ్రెజిల్ 21.5 కోట్లు, రష్యా 14.5 కోట్లు, మెక్సికో 13 కోట్లు. కానీ ఈ మ్యాచ్ చూసిన వారు 40.9 కోట్లు అంటే యునైటెడ్ స్టేట్స్ మొత్తం జనాభా కంటే ఎక్కువ. ఇండోనేషియా + బంగ్లాదేశ్ జనాభా కలిపితే ఎంతో అంత. లేదంటే పాకిస్తాన్, బ్రెజిల్, మెక్సికో- ఈ మూడు దేశాల జనాభాలకు సమానం. 12 నుంచి 15 దేశాల జనాభా కలిపినంత.
అంటే ఓ మ్యాచును చూసిన వీక్షకుల సంఖ్య కొన్ని దేశాల జనాభాను మించి ఉంది. ఇది ఐపీఎల్ పాపులారిటీకి గొప్ప ఉదాహరణ.
ఒకవేళ ఏదైనా ఓ ఖండం జనాభాతో పోల్చాల్సివస్తే...
ఖండాల జనాభా (2024 అంచనా):
ఆసియా 480 కోట్లు
ఆఫ్రికా 150 కోట్లు
యూరప్ 75 కోట్లు
ఉత్తర అమెరికా 60 కోట్లు
దక్షిణ అమెరికా 44 కోట్లు
ఆస్ట్రేలియా (ఓషీనియా) 4.5 కోట్లు
అంటార్క్టికా 1,000 (శాశ్వత నివాసం లేదు)
కాబట్టి 40.9 కోట్ల వీక్షకులు అంటే ఆస్ట్రేలియా ఖండం (ఓషీనియా) మొత్తం జనాభాకు 9 రెట్లు ఎక్కువ! దక్షిణ అమెరికా మొత్తం జనాభాకు దగ్గరగా ఉంది (దక్షిణ అమెరికా – 44 కోట్ల మందికి సమానం). యూరప్ జనాభాలో దాదాపు 55%, ఉత్తర అమెరికా జనాభాలో దాదాపు 68% మందితో సమానం.ఈ వీక్షకుల సంఖ్యను "దక్షిణ అమెరికా" ఖండం జనాభాతో పోల్చవచ్చు.
ఇక మార్చి 23న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ల విషయానికి వస్తే..
SRH vs RR మ్యాచ్ వీక్షకులు – 29.2 కోట్ల మంది. ఈ సంఖ్య పాకిస్తాన్ (సుమారు 24 కోట్లు), నైజీరియా (సుమారు 22 కోట్లు), బ్రెజిల్ (సుమారు 21 కోట్లు) దేశాల జనాభా కంటే ఈ మ్యాచ్ ను చూసిన వారి సంఖ్యే ఎక్కువ కావడం గమనార్హం.
CSK vs MI మ్యాచ్ ని ౩౦.5 కోట్ల మంది చూశారు.
ఇది ఈ దేశాల జనాభాలకు సమానం:
జర్మనీ – సుమారు 8.5 కోట్ల
ఫ్రాన్స్ – సుమారు 6.8 కోట్ల
యూకే – సుమారు 6.7 కోట్ల
అంటే, ఒక్క మ్యాచ్‌ను యూరోప్‌లోని పెద్ద దేశాల జనాభాకంటే ఎక్కువ మంది చూశారు. చివరి బంతిని ధోనీ కొడితే ఆ కిక్కే వేరబ్బా.. అన్నట్టుగా ఇంకో నాలుగు పరుగులు కావాల్సిన తరుణంలో ధోనీ క్రీజ్ లోకి వచ్చారు. ప్రేక్షకుల తాకిడి ఒక్కసారిగా ౩౦.5కోట్లకు చేరింది