IPL 2025: తొలి మ్యాచ్‌లో ఆర్‌సిబి 7 వికెట్ల తేడాతో విజయం

ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీలు సాధించి, మొదటి వికెట్‌కు 8.3 ఓవర్లలో 95 పరుగులు జోడించారు;

Update: 2025-03-22 18:04 GMT

ఆరంభంలోనే అదరగొట్టిన రాయల్ చాలెంజర్స్.

కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో శనివారం నాడు జరిగిన  మొదటి మ్యాచ్ లో ఏడు వికెట్ల తేడాతో సునాయాస విజయం.

కేకేఆర్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో 22 బంతులు మిగిలి ఉండగానే, మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చాలెంజర్స్ జట్టు విజయం సాధించింది. హోరాహోరి పోరును ఊహించిన ప్రేక్షకులు కొంచెం నిరాశ పడినప్పటికీ, కోహ్లీ తన బ్యాటింగ్ తోప్రేక్షకులను అలరించాడు.

34 సార్లు కేకేఆర్ జట్టుతో ఆడిన రాయల్ చాలెంజర్స్, 14 సార్లు మాత్రమే గెలిచింది. అయితే అందులో 11 మ్యాచ్లు రెండోసారి బ్యాటింగ్ చేస్తూ గెలిచింది. అది దృష్టిలో పెట్టుకునే కాబోలు టాస్ గెలిచిన చాలెంజర్స్ కెప్టెన్ పట్టిదార్, కేకేఆర్ ను బ్యాటింగ్ చేయమని ఆహ్వానించాడు. మరోసారి ఏడు వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ గెలిచి. మొదటి సారి కప్పు గెలిచే దిశగా మొదటి అడుగు వేసింది.


 కేకేఆర్ స్కోరు

టాస్ ఓడిపోయిన కేకేఆర్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ డీకాక్ పెద్దగా స్కోర్ చేయకుండా అవుట్ అయిపోయాడు. అప్పుడు బ్యాటింగ్కు వచ్చిన అజింక్య రహానే 31 బంతుల్లో 56 పరుగులు చేశాడు. అతనికి తోడుగా సునీల్ నరైన్ కూడా దాటిగా ఆడుతూ 44 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత కేకేఆర్ స్కోర్ మందగించింది. కేవలం రఘువంశీ మాత్రమే 30 పరుగులు చేయగలిగాడు రింగు సింగ్ 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. కేకేఆర్ బ్యాట్స్మెన్ కోల్కత్తా ప్రేక్షకులను అభిమానులను నిరాశ పరిచారు మొదటి బంతికే ఫోర్ కొట్టి ఊరించిన రస్సెల్ సుయాష్ శర్మ బౌలింగ్లో క్లీన్ బోల్డ్ అయ్యాడు. దాని తర్వాత వచ్చిన వారు ఎవరూ పెద్దగా స్కోర్ చేయలేదు దాంతో 20 ఓవర్లకి 174 పరుగులు చేయగలిగింది. ఒకరకంగా అది మర్యాదపూర్వకమైన స్కోరే. ఓవర్ కి 8.75 లక్ష్యాన్ని రాయల్ చాలెంజర్స్ ఇచ్చింది కేకేఆర్. రాయల్ చాలెంజ్ బౌలర్స్ లో అనూహ్యంగా కృణాల్ పాండే మూడు వికెట్లు తీశాడు. అది ఎవరు ఊహించలేదు. కేకేఆర్ జట్టు దాటిగానే మొదలుపెట్టినప్పటికీ, చాలెంజర్స్ బౌలింగ్ ని తేలిగ్గా తీసుకున్నారు

తనంటే ఏంటో చూపించిన కింగ్ కోహ్లీ

175 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ మొదలు పెట్టిన రాయల్ చాలెంజర్స్ జట్టు మొదటి ఆరు ఓవర్లలో అంటే పవర్ ప్లే ముగిసేటప్పటికీ 80 పరుగులు చేసింది. ధాటిగా మొదలుపెట్టిన సాల్ట్ 31 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు. కేకేఆర్ బౌలర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో 56 పరుగులు చేసి సాల్ట్ అవుట్ అయ్యాడు. 95 పరుగుల దగ్గర మొదటి వికెట్ సాల్ట్ రూపంలో పడింది. తర్వాత వచ్చిన రాయల్ చాలెంజర్స్ ప్రముఖ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ తనదైన శైలిలో ఆడుతూ అర్థ సెంచరీ చేశాడు. 118 పరుగుల దగ్గర ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన పడికల్ అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన కెప్టెన్ పటిదార్ వేగంగా 34 పరుగులు చేసి పెవిలియన్ దారి పెట్టాడు. 26 బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన స్థితికి రాయల్ చాలెంజర్స్ చేరుకుంది. 16 ఓవర్లలో స్కోరు 167 పరుగులు చేరుకుంది దశలో లివింగ్స్టన్ ఒక సిక్స్ కొట్టాడు. మళ్లీ తర్వాతి ఓవర్లో ఒక బౌండరీ చేయడంతో రాయల్ చాలెంజర్స్ విజయం సాధించింది.

రాణించిన ఇరుజట్ల స్పిన్నర్లు

కోల్కత్తా లోని ఈడెన్ గార్డెన్స్, స్పిన్ కు సహకరిస్తుందని పేరు పడింది. ఈ మ్యాచ్ లో మొత్తం 11 వికెట్లు పడగా ఆరు వికెట్లు స్పిన్ బౌలర్లు తీసుకున్నారు. కేకేఆర్ ప్రముఖ బౌలర్ వరుణ్ చక్రవర్తి నిరాశపరిచాడు. ఐసీసీ చాంపియన్ ట్రోఫీలో బాగా బౌలింగ్ చేసిన చక్రవర్తి ఈ మ్యాచ్ లో అంతా ప్రభావం చూపలేకపోయాడు. మొదట్లో బాగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు 200 పైగా పరుగులు సాధిస్తుందనిపించినప్పుడు, త్వరగా రెండు వికెట్లు కోల్పోయి 200 దరిదాపులోకి రాలేకపోయింది. దాంతో రాయల్ చాలెంజర్స్ పని కొంచెం సులువు అయింది. కోహ్లీ మరోసారి తనను అందరూ కింగ్ కోహ్లీ అని ఎందుకంటారు రుజువు చేశాడు. 36 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 59 పరుగులు చేసి అజయంగా నిలిచాడు. జట్టుని గెలిపించాడు.

స్కోర్ వివరాలు

కేకేఆర్ బ్యాటింగ్:

174/8 వికెట్లకి (20 ఓవర్లు)

నరేన్ 44 (26 బంతులు, 5 ఫోర్లు, 3 సిక్సర్లు)

అజింక్య రహానే 56 (31 బంతులు, 6 ఫోర్లు, 4 సిక్సర్లు)

రాయల్ చాలెంజర్స్ బౌలింగ్

క్రూనాల్ పాండ్యా, 3 వికెట్లు (4 ఓవర్లు)

హేజల్ వుడ్,2 వికెట్లు (4 ఓవర్లు)

రాయల్ చాలెంజర్స్ బ్యాటింగ్:

177/3 వికెట్లకి (16.2 ఓవర్లు)

సాల్ట్ (56 పరుగులు, 31 బంతులు,9 ఫోర్లు, 2 సిక్సర్లు)

విరాట్ కోహ్లీ 59 (36 బంతులు, 4 ఫోర్లు,3 సిక్సర్లు)

కేకేఆర్ బౌలింగ్

వరుణ్ చక్రవర్తి, 1 వికెట్లు (4 ఓవర్లు)

సునీల్ నరేన్,1 వికెట్ (4 ఓవర్లు)

వైభవ్ అరోరా 1 వికెట్ (3 ఓవర్లు)

Tags:    

Similar News