కోహ్లి సరసన చేరిన రియాన్ పరాగ్

ఐపీఎల్ చరిత్రలో నాలుగో అత్యంత పిన్న వయస్కుడైన కెప్టెన్ గా బాధ్యతలు;

Update: 2025-03-23 12:07 GMT

సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా రియాన్ పరాగ్ వ్యవహరించడంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత పిన్న వయస్సులో కెప్టెన్ గా పనిచేసిన ఆటగాళ్ల సరసన అతను చేరినట్లు అయింది. సంజూ శాంసన్ వేలు గాయం నుంచి కోలుకోకపోవడంతో పరాగ్ మొదటి మ్యాచ్ లకు నాయకత్వం వహిస్తున్నాడు.

నాలుగో అతిచిన్న వయస్కుడైన కెప్టెన్..
తన ఐపీఎల్ కెప్టెన్సీ అరంగ్రేటంలోనే పరాగ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పరాగ్ 17 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు రాజస్థాన్ రాయల్స్ టీంలో చేరాడు.
ఇంతకుముందు రియాన్ అస్సాం క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ప్రస్తుతం అతని వయస్సు కేవలం 23 సంవత్సరాల 133 రోజులు మాత్రమే. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, సురేష్ రైనా తరువాత కెప్టెన్ అయిన నాలుగో అతి పిన్న వయస్కుడు అతనే.
2011 లో 22 సంవత్సరాల 187 రోజుల వయస్సులో కోహ్లి ఆర్సీబీకి కెప్టెన్ పగ్గాలు తీసుకున్నాడు. ఆ మ్యాచ్ లో తన ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్ కావడం విశేషం.
స్మిత్, రైనా..
2012 లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో పుణే వారియర్స్ ఇండియా జట్టుకు ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అప్పుడు అతని వయస్సు 22 సంవత్సరాల 344 రోజులు.
ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రైనా 23 సంవత్సరాల 112 రోజుల వయస్సులో నాయకత్వం వహించాడు. ఆ మ్యాచ్ లో ధోని గాయం కారణంగా అందుబాటులో లేకపోవడంతో రైనా సారథిగా వ్యవహరించాడు.
ఈ సంవత్సరం ఐపీఎల్ లో 10 జట్లు ఉన్నాయి. మొత్తం 65 రోజుల పాటు 13 వేదికలలో 74 మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఐపీఎల్ 2025 లో తొమ్మిది మంది భారత కెప్టెన్లు, ఒక విదేశీ కెప్టెన్ ఉన్నారు. ఎస్ఆర్ హెచ్ కు ఆస్ట్రేలియ కెప్టెన్ కమిన్స్ నాయకత్వం వహిస్తున్నాడు.
ఐపీఎల్ మే 25న కోల్ కతలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగే ఫైనల్ తో ముగుస్తుంది. మార్చి 22న జరిగిన తొలి మ్యాచ్ లో ఆర్సీబీ, ఢిపెండింగ్ ఛాంపియన్ కోల్ కత నైట్ రైడర్స్ ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.
ఐపీఎల్ లో 5 గురు అతి పిన్న వయస్కులైన కెప్టెన్లు..
విరాట్ కోహ్లి 22 సంవత్సరాల 187 రోజులు- ఆర్సీబీ వర్సెస్ ఆర్ఆర్- 2011
స్టీవ్ స్మిత్ 22 సంవత్సరాల 344 రోజులు- పీడబ్ల్యూఐ వర్సెస్ ఆర్సీబీ- 2012
సురేష్ రైనా 23 సంవత్సరాల 112 రోజులు- సీఎస్కే వర్సెస్ డీడీ 2010
రియాన్ పరాగ్, 23 సంవత్సరాల 133 రోజులు - ఎస్ఆర్ హెచ్ వర్సెస్ ఆర్ఆర్
శ్రేయాస్ అయ్యర్, 23 సంవత్సరాల 142 రోజులు- డీడీ వర్సెస్ కేకేఆర్ 2018
Tags:    

Similar News