ఐపీఎల్: ‘‘పాంటింగ్ ఇచ్చిన ధైర్యంతోనే వైశాఖ్ రాణించాడు’’

సంతోషం వ్యక్తం చేసిన వైశాఖ్ తండ్రి విజయ్ కుమార్;

Update: 2025-03-26 13:26 GMT
వైశాఖ్ విజయ్ కుమార్

అపరమేయ. సీ

నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. పంజాబ్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది బెంగళూర్ బౌలర్ వైశాఖ్ విజయ్ కుమార్. దీనిపై ఆయన తండ్రి విజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.

ప్రియాంశ్ ఆర్య స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన వైశాక్ బ్యాకెండ్ లో బౌలింగ్ చేసి మూడు కీలక వికెట్లు తీయడమే కాకుండా గుజరాత్ బ్యాట్స్ మెన్ జోరుకు బ్రేక్ వేశాడు. దీనితో ప్రత్యర్థి 232 వద్దే ఆగిపోయింది.
వైశాఖ్ తండ్రి ఏం చెప్పాడు..
13 ఓవర్ తరువాత ఈ బెంగళూర్ కుర్రాడు మైదానంలోకి అడగుపెట్టాడు. ఆ సమయంలో జీటీ 42 బంతుల్లో 92 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి. వైశాక్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 15 ఓవర్ వేయడానికి గ్రౌండ్ లోకి తెచ్చాడు. మొదటి ఓవర్ లో కేవలం ఐదు పరుగులే ఇచ్చి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాడు.
తిరిగి 17 ఓవర్ లో తిరిగి బౌలింగ్ కు దిగి అద్బుతంగా ముగించాడు. ఈ ఓవర్ లో కూడా తిరిగి ఐదు పరుగులే ఇచ్చాడు. మూడో ఓవర్ లో 18 పరుగులు ఇచ్చాడు. ఇక చివరి ఓవర్ లో 26 పరుగులను విజయవంతంగా ఢిపెండ్ చేశాడు.
ఇందులో విజయ్ కుమార్ ఆప్ స్టంప్ కు దూరంగా బంతులు వేయడం ఆపలేదు. దీనితో బ్యాట్స్ మెన్ పరుగులు సాధించడం కష్టమైంది. ముఖ్యంగా రూథర్ పోర్డ్ పెద్ద షాట్లు ఆడలేకపోయాడు.
వైశాఖ్ తన మూడు ఓవర్లలో 0/28 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తన కుమారుడు తొలి మ్యాచ్ లో అద్బుతమైన బౌలింగ్ చేసి గెలుపులో కీలకపాత్ర పోషించడంతో ఆయన తండ్రి ఆనందం వ్యక్తం చేశారు.
‘‘అహ్మాదాబాద్ లో గుజరాత్ టైటాన్స్ పై పంజాబ్ కింగ్స్ విజయంలో వైశాఖ్ కీలకపాత్ర పోషించాడు. నేను సంతోషంగా ఉన్నాను. క్వాడ్రిసెప్స్ గాయం తరువాత ఇది అతని మొదటి ఆట, కానీ మొదటి మ్యాచ్ లో బాగా బౌలింగ్ చేశాడు. నాకు చాలా గర్వంగా ఉంది. మిగిలిన మ్యాచ్ లో ఇలాగే బౌలింగ్ చేస్తాడని ఆశిస్తున్నాను’’ అని విజయ్ కుమార్ ‘ది ఫెడరల్ ’ తో అన్నారు.
ఆటను మార్చేశాడు: పాంటింగ్
‘‘వైశాఖ్ ఆటను మార్చిన వ్యక్తి’’ అని పీబీకేఎస్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ అన్నారు. ‘‘డగౌట్ లో కూర్చున్నప్పుడూ వారికి(గుజరాత్) ఓవర్ కు 13 లేదా 14 పరుగులు అవసరమని నేను భావించాను.
నేను శ్రేయస్ కు సందేశం పంపాను. మీరు ఏమి చేయాలనుకుంటున్నానని అడిగాను. అతను వెంటనే వైశాఖ్ ను తీసుకురండని చెప్పాడు. అతను యార్కర్ పై రెండు ఓవర్లు వేస్తాడు.
మేము ఆటను ముగిస్తాను. ఇదే గేమ్ ప్లాన్. అలానే బంతుల సంధించి వైశాఖ్ ను గేమ్ ను మొత్తం మార్చివేశాడు’’ అని పాంటింగ్ మ్యాచ్ తరువాత అన్నాడు.
పాంటింగ్ ప్రశంసలు వినడం ఎలా అనిపిస్తుందని వైశాఖ్ ను అడిగినప్పుడూ,  ‘‘ఐపీఎల్ లో అత్యుత్తమ కోచ్ లలో ఒకరైన వారి నుంచి ఈ ప్రశంసలు వినడం చాలా ఆనందం వేసింది’’ అని చెప్పారు.
‘‘రికీ పాంటింగ్ లాంటి దిగ్గజం నా కొడుకు బౌలింగ్ ప్రయత్నాలను ప్రశంసించడం వినడం కంటే ఏమిటో ఇప్పడు నేను మాటల్లో వర్ణించలేను. వైశాక్ కే కాదు మనందరికీ ఇది ఒక గొప్ప క్షణం. పాంటింగ్ ఐపీఎల్ లో అత్యుత్తమ కోచ్ లలో ఒకరు. అతను ఎల్లప్పుడూ క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తాడు.
ఆటగాళ్లకు మద్దతు ఇచ్చి, వారి నుంచి ఉత్తమంగా పొందడానికి ప్రయత్నిస్తాడు. పాంటింగ్ ఇతర కోచ్ లకు భిన్నంగా ఉంటాడు. వైశాఖ్, పాంటింగ్  కింద పనిచేయడం చాలా అదృ ష్టం.’’ అని విజయ్ కుమార్ అన్నారు.
ఆర్సీబీపై నిరాశ..
గత సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ తరఫున ఆడిన వైశాఖ్ ను ఫ్రాంచైజ్ విడుదల చేసింది. దీనితో మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రూ. 1.8 కోట్లకు సంతకం చేశాడు. వైశాఖ్ ను తిరిగి పొందడానికి ఆర్సీబీకి రైట్ టూ మ్యాచ్ (ఆర్టీఎం) ఉపయోగించే ఛాన్స్ ఉంటుంది.
అయినా దానికి వెళ్లలేదు. నిన్న జరిగిన మ్యాచ్ తరువాత అభిమానులు సోషల్ మీడియాలో ఆర్సీబీని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. వారు వైశాఖ్ ను ఎందుకు రిటైన్ చేసుకోలేదని ప్రశ్నించారు. ఇది ఆర్సీబీ అభిమానుల్లో స్పష్టంగా నిరాశ కలిగించింది. ఇదే అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
‘‘స్ఫష్టంగానే ఆర్సీబీ వైశాఖ్ ను నిలుపుకోకపోవడం నిరాశ కలిగించింది. కానీ ప్రతి ఫ్రాంచైజీకి దాని స్వంత ప్రణాళికలు ఉంటాయి. అలాగే మెగా వేలంలో వైశాఖ్ పేరు రాకముందే, మరొక పేస్ బౌలర్ పోటీలో ఉన్నాడు. ఆర్సీబీ అతని కోసం వేలం వేసింది. వైశాక్ ప్రస్తుతం పంజాబ్ తరఫున ఆడటం దేవుని కోరిక అని మేము భావిస్తున్నాము. అంతా మంచికే జరుగుతుంది’’ అని అతను చెప్పాడు.
ఎన్ సీ ఏ లో వైశాఖ్ పునరావాసం..
వైశాక్ క్రికెట్ కలను సాకారం చేసుకోవడానికి తన ఉద్యోగాన్ని వదులుకున్న విజయ్ కుమార్, గాయం నుంచి కోలుకుని ఐపీఎల్ కు సిద్దంగా ఉండటానికి బౌలర్ చేసిన కృషి గురించి మాట్లాడాడు.
‘‘క్వాడ్రిసెప్స్ గాయం తరువాత, వైశాఖ్ బెంగళూర్ లోని నేషనల్ క్రికెట్ అకాడమీ లో చాలా కష్టపడి పనిచేశాడు. రెండు నెలలకు పైగా అతని దినచర్య ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 నాలుగు గంటలకే ముగిసింది. గాయం తరువాత మొదటి మ్యాచ్ లో అతని కృషికి ఫలితం లభించినందుకు నేను సంతోషంగా ఉన్నాను’’ అని విజయ్ కుమార్ అన్నారు.
2025 ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా వైశాక్ ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నందున, ఈ సీజన్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా కాకుండా అన్ని మ్యాచ్ లు ఆడగలిగితే తన కల సాకారం అవుతుందని అతని తండ్రి చెబుతున్నాడు.
‘‘వైశాఖ్ అన్ని మ్యాచ్ లలో ఆడాలని నేను ఆశిస్తున్నాను. అప్పుడు అతను ఈ సంవత్సరం పర్పుల్ క్యాప్ గెలవడం గురించి ఆలోచించగలడు’’ అన్నారు. మ్యాచ్ కు ముందు తరువాత తాను వైశాఖ్ తో క్రమం తప్పకుండా మాట్లాడుతానని, కానీ మేము క్రికెట్ గురించి మాట్లాడుకోమని విజయ్ కుమార్ వెల్లడించాడు.
Tags:    

Similar News