ఎవరూ ఈ విఘ్నేష్ పుత్తూర్ ? రోహిత్ స్థానంలో వచ్చి చెన్నైని వణికించాడు

ప్రశంసలతో ముంచెత్తిన భారత దిగ్గజాలు.. ఇండియాకు కొత్త టాలెంట్ ను పరిచయం చేసిన ఎంఐ;

Update: 2025-03-24 06:20 GMT
విఘ్నేశ్ పుత్తూర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రతి సంవత్సరం కొత్త ఆటగాళ్లను పరిచయం చేస్తుంది. తాజాగా జరగుతున్న 18 వ ఎడిషన్ లో కూడా యువ స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూర్ టీ20 టోర్నమెంట్ అరంగ్రేటం చేయించింది. జట్టు కోరుకున్నట్లుగానే తొలి ప్రభావం గట్టిగానే చూపాడు.

గత సంవత్సరం జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ అన్ క్యాప్డ్ లెప్ట్ ఆర్మ్ మణికట్టు స్పిన్నర్ విఘ్నేష్ ను రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. విఘ్నేశ్ మార్చి 2, 2001 లో జన్మించాడు. ఇతను కేరళలోని మలప్పురం జిల్లాలోని పెరింతల్మన్నకు చెందినవాడు.
వేలంలో కొనుగోలు చేసిన తరువాత ముంబై ఇండియన్స్ అతన్ని దక్షిణాఫ్రికాకు తీసుకెళ్లింది. ఎంఐ అక్కడ కూడా ఓ జట్టును కొనుగోలు చేసింది. అక్కడ జట్టుతో విఘ్నేష్ అధికారికంగా జట్టులో భాగం కాలేదు.


 


సీఎస్కే పై విఘ్నేష్ కీలక వికెట్లు..
24 ఏళ్ల విఘ్నేష్ ఇంకా కేరళ సీనియర్ జట్టు తరఫున ఆడలేదు. కానీ ఎంఐ జట్టు యాజమాన్యం ఆదివారం అతడిని అనూహ్యంగా బరిలోకి దించింది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా మూడు వికట్లు పడగొట్టి తన సత్తా చాటాడు.
కేరళ క్రికెట్ లీగ్, కేరళ కాలేజ్ ప్రిమియర్ టీ20 లీగ్, తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో కూడా ఆడాడు. అతను అండర్ -14, అండర్ -19 స్థాయిలో కేరళకు ప్రాతినిధ్యం వహించాడు.
నిన్న జరిగిన మ్యాచ్ లో విఘ్నేశ్ శివన్ రోహిత్ శర్మ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చాడు. చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో తొలి భాగంలో సీఎస్కే స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారు. దీనితో ఎంఐ నిర్ణీత ఓవర్లలో 155/9 కే పరిమితం అయింది.
విఘ్నేశ్ రాక..
సీఎస్కే 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగింది. ఈ క్రమంలో ఎనిమిదో ఓవర్ లో ముంబై స్టాండ్ ఇన్ కెప్టెన్ సూర్యకుమార్, విఘ్నేశ్ ను బౌలింగ్ కు తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే జోరు మీదున్న రుతురాజ్ ను ఈ యంగ్ కుర్రాడు పెవిలియన్ పంపాడు.
తరువాత ఓవర్లో మళ్లీ వచ్చిన చైనామన్ బౌలర్ ఈ సారి స్పిన్నర్లపై ఎదురుదాడి చేస్తాడని పేరున్న బిగ్ హిట్టింగ్ ఆల్ రౌండర్ శివం దూబెను ఇంటికి పంపాడు. అతను తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చాడు.
ఈ ఓవర్లో అతను తొమ్మిది పరుగులు మాత్రమే ఇచ్చాడు. మూడోసారి బౌలింగ్ కు వచ్చిన విఘ్నేష్ ఈసారి దీపక్ హుడాను అవుట్ చేశాడు. ఇలా నాలుగు ఓవర్ల కోటాను పూర్తిచేసి తొమ్మిది డాట్ బాల్స్ తో 32 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇది ఈ అరంగ్రేట బౌలర్ కు చిరస్మరణీయమైన ఐపీఎల్ అరంగ్రేటం
ప్రశంసలతో ముంచెత్తిన సూర్యకుమార్..
సీఎస్కే నాలుగు వికెట్లతో గెలిచిన తరువాత సూర్యకుమార్ యాదవ్ ను విఘ్నేష్ గురించి అడిగారు. ఆ యంగ్ కుర్రాడికి మంచి భవిష్యత్ ఉందని చెప్పాడు. ‘‘ యువకులను శోధించడం ఎంఐకి అలవాటు.
సంవత్సరానికి పది నెలల వారు శోధించిన తరువాత ఈ యువకుడిని పట్టుకున్నారు. అతనికి ఉజ్వల భవిష్యత్ ఉంది’’ అని సూర్యకుమార్ అన్నారు. ‘‘ఆట తీవ్ర స్థాయిలో సాగితే నేను ఒక ఓవర్ ను అలాగే పెడతాను. కానీ 18 ఓవర్ ఇవ్వడంలో సందేహం లేదు’’ అని స్కై మ్యాన్ చెప్పాడు.
భుజం తట్టిన ధోని..


 


విఘ్నేష్ సీఎస్కే లెజెండ్ ఎంఎస్ ధోని నుంచి ప్రశంసలు అందుకున్నాడు. అతని భుజం తట్టి ఆ యువకుడితో కొన్ని మాటలు మాట్లాడాడు. దీనిని చూసిన భారత మాజీ కెప్టెన్ రవిశాస్త్రి ‘‘ అది చాలా గొప్ప దృశ్యం. యువ ఆటగాడు విఘ్నేష్ పుత్తూర్ భుజం తట్టండి.
అతను దీన్ని చాలాకాలం వరకూ మర్చిపోతాడని నేను అనుకోను’’ అని వ్యాఖ్యానించాడు. భారత మాజీ ఓపెనర్ నవ జ్యోత్ సింగ్ సిద్దూ ఒక ప్రకటన చేస్తూ, విఘ్నేష్ బౌలింగ్ చూస్తే నాకు దిగ్గజ భారత స్పిన్నర్ బిషన్ సింగ్ బేడి గుర్తుకు వచ్చాడని చెప్పారు.
ఏంఐ ఏం చెప్పిందంటే..
గత సంవత్సరం ఎంఐ వారి వెబ్ సైట్ లో విఘ్నేష్ గురించి ఇలా రాసింది. ‘‘కేరళకు చెందిన 23 సంచలనం. ముంబై ఇండియన్స్ తెలియని వాటిని వెలికితీసే జాబితాలో ఇది కొత్తది, తాజాది.. అతను ఇంకా ఎక్కువ కాలం అజ్ఞాతంగా ఉండలేడు’’ అని రాసుకొచ్చింది.

‘‘స్థానిక టోర్నమెంట్ల విషయానికి వస్తే, అతను కేరళ ప్రిమియర్ లీగ్ మొదటి సీజన్ లో అల్లెప్పీ రిప్పల్స్ తరఫున ఆడాడు. కొన్ని అద్బుతమైన ప్రదర్శనలు ఇచ్చాడు. ఈ ఎడమ చేతి స్పిన్నర్ కు మద్దతు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని వివరించింది.
Tags:    

Similar News