వాహ్హ్ వాటే స్టంపింగ్.. మెరుపు వేగంతో కదిలిన ధోని.. అవాక్కయిన సూర్య
కేవలం 0.12 సెకన్లలో స్పందించిన భారత మాజీ కెప్టెన్;
By : The Federal
Update: 2025-03-23 17:12 GMT
చెన్నై చెపాక్ లో సీఎస్కేతో ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో ధోని మరోసారి తన మార్క్ కీపింగ్ ను చూపించాడు. వికెట్ల వెనక తను ఎందుకు అంత అత్యుత్తమో మరోసారి నిరూపించుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ మెంట్ తీసుకుని తరువాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాత్రమే ఆడతున్న 43 ఏళ్ల ధోని, తన సత్తాను ముంబై జట్టుపై చూపాడు.
రెప్పవాల్చే లోగానే..
ముంబై జట్టు బ్యాటింగ్ కు వచ్చి రాగానే హిట్ మ్యాన్ రోహిత్ వికెట్ ను కోల్పోయింది. ఇండియన్ కెప్టెన్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. తరువాత వరుసగా మరో రెండు వికెట్లు కూడా పడటంతో ఎంఐ తాత్కలిక కెప్టెన్ సూర్య ఇన్నింగ్స్ ను నిర్మించే బాధ్యతను తీసుకున్నాడు.
నిదానంగా ఆడుతున్నప్పటికీ స్కై మ్యాన్ మంచి టచ్ లో ఉన్నాడు. 11 ఓవర్ లో నూర్ అహ్మద్ బౌలింగ్ కు వచ్చాడు. బంతిని ఆడేందుకు ముందుకు వచ్చిన సూర్య క్రీజును దాటాడు.
కానీ బంతిని బ్యాట్ తో కనెక్ట్ చేయలేకపోవడంతో బంతి కీపర్ ధోని చేతుల్లోకి వెళ్లడం మెరుపు వేగంతో బెయిల్స్ ను గిరాటేయడం రెప్పపాటులో జరిగిపోయింది. సూర్యకుమార్ అయితే స్టన్ అయిపోయాడు.
మాజీ కెప్టెన్ కేవలం 0.12 సెకన్లలో బంతిని అందుకుని స్టంపింగ్ చేశాడు. ఈ వీడియో క్లిప్పింగ్ తో సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది.
𝙁𝙖𝙨𝙩. 𝙁𝙖𝙨𝙩𝙚𝙧. 𝙈𝙎 𝘿𝙝𝙤𝙣𝙞 🫡
— IndianPremierLeague (@IPL) March 23, 2025
📹 Watch #CSK legend's jaw-dropping reflexes behind the stumps 🔥
Updates ▶ https://t.co/QlMj4G7kV0#TATAIPL | #CSKvMI | @ChennaiIPL | @msdhoni pic.twitter.com/S26cUYzRd8
చాలామంది సీఎస్కే అభిమానులు ఈ చిత్రాన్ని ట్వీట్లు, రీట్వీట్లతో సామాజిక మాధ్యమాలను పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది అభిమానులు ధోనిని కీర్తిస్తూ పాటలు పాడగా, మరికొంతమంది నృత్యాలు చేస్తున్నారు.
అభిమానుల కోలాహలం..
ఎంఎస్డీని సీఎస్కే కేవలం నాలుగు కోట్లతో అన్ క్యాప్ డ్ ప్లేయర్ కింద రిటైన్ చేసుకుంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఐదు సంవత్సరాలకు పైగా అంతర్జాతీయ క్రికెట్ ఆడని వారు అన్ క్యాప్ డ్ ప్లేయర్లుగా ఉంటారు.
ధోని స్టంపింగ్ స్పీడ్ పై ఓ అభిమాని ఎక్స్ లో ఇలా పోస్ట్ పెట్టారు.. ‘‘ మెరుపు వేగంతో స్టంపింగ్ చేసిన యువ అన్ క్యాప్డ్ ప్లేయర్ ఎంఎస్ ధోని. కొన్ని విషయాలు ఎప్పటికి మారవు. వికెట్ల వెనక స్వచ్ఛమైన వ్యక్తి’’ అని పోస్ట్ లో రాసుకొచ్చాడు.
‘‘ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్, ఎంస్ ధోని స్టంపింగ్’’ అన్నాడు. ధోనిని భర్తీ చేసే ఆటగాడు మరోకరు రారు అని మరో యూజర్ పోస్ట్ లో అభిప్రాయపడ్డారు. ‘‘వావ్, స్టంప్స్ వెనక ఇప్పటికి అతనే అత్యంత వేగవంతమైన వాడు # ధోని’’ ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే ఎక్స్ లో పోస్ట్ చేశారు.
‘‘ఈ అన్ క్యాప్డ్ ప్లేయర్ కు భారత్ కు అవకాశం ఇవ్వాలి, వయస్సు కేవలం ఒక అంశం మాత్రమే’’ అని మరో ధోని అభిమాని అన్నారు.
2025 ఐపీఎల్ తరువాత ధోని క్రికెట్ నుంచి రిటైర్ అవుతారనే ఊహాగానాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ధోని ఫిట్ నెస్, స్టంపింగ్ లో మాజీ కెప్టెన్ చూపిస్తున్న జోరు తో అతను మరికొంతకాలం ఈ ఫ్రాంచైజీలో కొనసాగాలని ‘తల’ అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రస్తుతం ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో స్పిన్నర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. నూర్ అహ్మద్ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు తీసి 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీనితో ఎంఐ నిర్ణీత ఓవర్లలో 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. తిలక్ వర్మ అత్యధికంగా 31 పరుగులు సాధించాడు.