ఆసియా కప్: బీసీసీఐ, బీజేపీపై ప్రతిపక్షాల విమర్శలు

రక్తం, క్రికెట్ ప్రవహిస్తున్నాయన్న ఆదిత్య థాకరే;

Update: 2025-09-13 08:00 GMT

ఆసియాకప్ లో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ఆడటానికి అనుమతి ఇవ్వడంపై ప్రతిపక్షాలు బీజేపీ, బీసీసీఐ పై విమర్శలు గుప్పించాయి. శివసేన(యూబీటీ) గ్రూప్ నాయకుడు ఆదిత్యఠాక్రే మాట్లాడుతూ.. క్రికెట్, రక్తం కలిసి ప్రవహిస్తున్నాయని విమర్శించారు.

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎన్నోసార్లు భారత్ లో ఉగ్రవాద దాడులు నిర్వహించిందని దేశంలోని టెలీవిజన్ ప్రసారదారులు ఈ మ్యాచ్ ను బహిష్కరించాలని కోరారు.
బీసీసీఐ జాతి వ్యతిరేక చర్యలు..
బీసీసీఐ జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి, సరిహద్దులో అమరులైన సైనికులు త్యాగాలను అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
భారత ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని ఆరోపించింది. పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు ఎందుకు అనుమతి ఇచ్చారని ఎన్సీపీ(ఎస్పీ) నేతలు ప్రశ్నించారు.
‘‘బీసీసీఐ దేశ వ్యతిరేకిగా మారుతోంది. పాకిస్తాన్ తో ఆడటానికి బీసీసీఐ ఎందుకు ఉత్సాహంగా ఉంది. డబ్బు, టీవీ ఆదాయం, ప్రకటన ఆదాయం అనే దురాశ వల్లనా, లేక ఆటగాళ్ల ఫీజుల కోసమా? భారత్ వేదికగా పాక్ ఆడటానికి విముఖత వ్యక్తం చేసినప్పుడూ అదే పని బీసీసీఐ ఎందకు చేయట్లేదు’’ అని ఠాక్రే విమర్శలు గుప్పించారు.
‘‘నిజమైన బీజేపీ అధికారంలో ఉండి ఉంటే, అది ఈ ఆటలకు అనుమతి ఇచ్చేది కాదు. బీజేపీ తన భావజాలన్ని మార్చుకుంది’’ అని ఆదిత్య ఠాక్రే విమర్శలు గుప్పించారు.
తరువాత ఎక్స్ లో ఈ అంశానికి సంబంధించి పోస్ట్ చేశారు. ‘‘రక్తం, నీరు కలిసి ప్రవహించలేనప్పుడూ, రక్తం, క్రికెట్ మాత్రం కలిసి ప్రవహించడాని అనుమతించినట్లు కనిపిస్తోంది’’ అని ఆయన అన్నారు.
‘‘భారత్- పాకిస్తాన్ చుట్టూ రాజకీయాలు తిరుగున్న ఈ సమయంలో ప్రభుత్వం, అధికార పార్టీ ద్వంద్వ ప్రమాణాలను క్రికెట్ మ్యాచ్ బయటపెట్టింది’’ అని ఎన్సీపీ ప్రతినిధి జితేంద్ర అవ్హాద్ వార్తా సంస్థకు తెలిపారు.
ఈ విమర్శలపై మహారాష్ట్ర మంత్రి, క్రికెట్ పరిపాలకుడు అయిన ఆశిశ్ షెలర్ స్పందించారు. అంతర్జాతీయ క్రీడలు అనేవి రెండు దేశాల మధ్య ఉండే రాజకీయ అంశాలు నిర్దేశించలేవని అన్నారు.
ఆసియా క్రికెట్ కౌన్సిల్ బోర్డులో బీసీసీఐ ప్రతినిధిగా ఉన్న బీజేపీ మంత్రి షెలార్ మరో చోట మాట్లాడుతూ.. శివసేన(ఉద్దవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ ఈ అంశంపై భారత వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారని ఆరోపించారు.
‘‘భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లదనే విషయంలో స్ఫష్టంగా ఉంది. అయితే మా జట్టు అంతర్జాతీయ టోర్నమెంట్ ఆడకుండా లేదా పాల్గొనకుండా మేము నియంత్రించలేము. ఇది సముచిత వైఖరి కాదు’’ అని షెలార్ అన్నారు.
‘‘భారత్ క్రికెట్ ఆడటాన్ని వ్యతిరేకిస్తున్న వారు, బాలా సాహెబ్ థాకరే పాకిస్తాన్ మాజీ బ్యాటింగ్ దిగ్గజం జావేద్ మియాందాద్ కు తన సొంత ఇంట్లో ఆతిథ్యం ఇచ్చిన సంగతి గుర్తుంచుకోవాలి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఆసియా కప్ లో భాగంగా భారత్- పాకిస్తాన్ మధ్య రేపు అబుదాబిలో టీ20 జరగబోతోంది. దీనిని నిరసిస్తూ రేపపు శివసేన యూబీటీ వర్గం ‘‘సిందూర్ రక్షా’’ ప్రచారాన్ని నిర్వహిస్తుందని రౌత్ గురువారం ప్రకటించారు.
Tags:    

Similar News