మరో 24 గంటల్లో ఐపీఎల్ ఆరంభం IPL Countdown-10

2025 మార్చి 22 తారీఖున మొదలయ్యే 18 వ సీజన్(ఎడిషన్), మే 25న జరిగే ఫైనల్ తో ముగుస్తుంది.;

Update: 2025-03-21 11:30 GMT

రేపు సాయంత్రం ఏడు గంటలకి ఐపీఎల్ 2025 సీజన్ మొదటి మ్యాచ్ టాస్ వేస్తారు. ఈ మ్యాచ్ 2024 ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్, ఒకసారి కూడా గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ మధ్యలో 7:30 నిమిషాలకు మొదలవుతుంది.

ఈ సందర్భంగా అన్ని జట్ల కెప్టెన్లు, కోచ్ లు, వివరాలు:

1.చెన్నై సూపర్ కింగ్స్( విన్నర్:2010,2011,2018,2021,2023)

కెప్టెన్: రుతురాజ్ గైక్వాడ్

కోచ్ : స్టీఫెన్ ఫ్లెమింగ్ ( న్యూజిలాండ్)

ఈసారి కప్ గెలవడానికి ఎక్కువ అవకాశాలున్న జట్లలో ఇదొకటి. . చెన్నైలో గెలిపించే సత్తా ఉన్నవాళ్లు కొంతమంది ఉన్నారు. ధనాధన్ ధోని గురించి చెప్పవలసిన అవసరం లేదు. మెగా వేలంలో తాకిడిని తట్టుకొని, ఎన్నో మార్పులు చేర్పులు జరిగినప్పటికీ, ప్రధాన ఆటగాళ్లని అట్టే పెట్టుకోగలిగింది. చెన్నై సూపర్ కింగ్స్ గెలవడానికి బ్యాటింగ్లో కెప్టెన్ గా ఉన్న రుతురాజు గైక్వాడ్ నిలకడగా ఆడే సమర్థవంతమైన బ్యాట్స్మెన్. ధోని ఎలాగూ ఉన్నాడు. అయితే ఈసారి కీలకమైన ఆటగాడు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. భారత్ జట్టు 2025 ఛాంపియన్ ట్రోఫీ గెలవడానికి, జడేజా బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఉపయోగపడింది.

జడేజా తో పాటు, అశ్విన్, నూర్ అహ్మద్ లను భారీ మొత్తాన్ని పెట్టి చెన్నై సూపర్ కింగ్స్ ఎటు కొనుక్కుంది. ఇదే అశ్విన్ కు సొంతమైదానం. హాఫ్ స్పిన్నర్ గా రాణించే అవకాశం ఉంది. ఇక నూర్ అహ్మద్ 2023,24 సీజన్ లలో బాగానే రాణించాడు. గుజరాత్ టైటాన్స్ జట్టు 2023 లో ఫైనల్ చేరడంలో, నూర్ అహ్మద్ పాత్ర కూడా ఉంది.

భారత ఆటగాళ్లు

రుతురాజు గైక్వాడ్(కెప్టెన్), ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా,శివం దుబే, రవిచంద్రన్ అశ్విన్, డేవన్ కాన్వే, సయ్యద్ ఖలీల్ అహ్మద్, రాహుల్ త్రిపాటి, విజయ శంకర్, షేక్ రషీద్, అన్షుల్ కంబోజ్, ముఖేష్ చౌదరి, దీపక్ హుడా, గురు చరణ్ ప్రీత్ సింగ్, కమలేష్ నగర్ కోటి, రామకృష్ణన్ గోష్, శ్రేయాస్ గోపాల్, వన్స్ బేడి, ఆండ్రీ సిద్ధార్థ్

విదేశీ ఆటగాళ్లు

డేవన్ కాన్వే(న్యూజిలాండ్) ఆస్ట్రేలియా,నూర్ అహ్మద్(ఆఫ్ఘనిస్తాన్),మతీషా పతిరాణ(శ్రీలంక),రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్),నాథన్ ఎల్లిస్(ఆస్ట్రేలియా),జామి ఓవర్ టన్,(ఇంగ్లాండ్) సాం కరణ్(ఇంగ్లాండ్)

కీలకమైన ఆటగాళ్లు

రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, నూర్ అహ్మద్, మహేంద్రసింగ్ ధోని, అశ్విన్

2. ముంబై ఇండియన్స్(విన్నర్స్. 2013,15,17,19,20)

కెప్టెన్: హార్దిక్ పాండ్యా

కోచ్ : మహేళా జయవర్ధనే(శ్రీలంక)

ఐపీఎల్ లో గత ఏడాది ముంబై ఇండియన్స్ మూడుసార్లు స్లో ఓవర్ రేట్ తో బౌలింగ్ చేసింది. దాంతో జట్టుకు 30 లక్షల జరిమానా విధించడం జరిగింది. . దాంతోపాటు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఒక మ్యాచ్ నిషేధానికి గురి అయ్యాడు. జట్టు లీగ్ దశ లోనే నిష్క్రమించడం వల్ల, నిషేధం అమ్మలు కుదరలేదు. దాంతో ఈ సీజన్లో హార్దిక్ పాండ్యా మొదటి మ్యాచ్లో ఆడలేడు.

భారత ఆటగాళ్లు

రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, రాబిన్ మింజు, రయాన్ రికల్టన్, శ్రీజిత్ కృష్ణన్, తిలక్ వర్మ, హార్దిక పాండ్యా, నమదీర్, విల్ జాక్స్ ,మిచెల్ సాంట్నర్, విగినేష్, కార్బన్ బోస్, ట్రెంట్ బోల్ట్, కర్ణశర్మ, దీపక చెహార్, అశ్విని కుమార్, రికీటోప్లి, సత్యనారాయణ పెనుమత్స, అర్జున టెండూల్కర్,బుమ్రా

విదేశీ ఆటగాళ్లు

రాబిన్ మింజు, రయాన్ రికల్టన్, విల్ జాక్స్ ,మిచెల్ సాంట్నర్, కార్బన్ బోస్, ట్రెంట్ బోల్ట్, రికీటోప్లి

కీలకమైన ఆటగాళ్లు:

రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, హార్దిక పాండ్యా, బుమ్రా, ట్రెంట్ బోల్ట్

3. ఢిల్లీ క్యాపిటల్స్

కెప్టెన్: అక్షర పటేల్,

కోచ్ : హేమంగ్ బదాని (ఇండియా)

ఇంతవరకు ఒకసారి కప్పు గెలువని ఢిల్లీ క్యాపిటల్స్, రిషబ్ పంత్ ను వదిలేసింది. దాంతో లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. ఐపీఎల్ లో సాధారణంగా బ్యాట్స్మెన్ లో కెప్టెన్ లు అవుతారు. ఇప్పుడు అక్షర్ పటేల్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా సెలెక్ట్ కావడం కొంత ఆశ్చర్యకరమే. ఢిల్లీకి గత కొంతకాలంగా నాయకత్వం స్థిరంగా లేదు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శన కూడా అదే స్థాయిలో ఉంది. పైగా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ హేరీ బ్రూక్ కూడా రెండేళ్ల నిషేధానికి గురైయ్యాడు. ఢిల్లీ యాజమాన్యానికి క్షమాపణలు కూడా చెప్పాడు. ఢిల్లీకి ఇది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది

భారత ఆటగాళ్లు

అక్షర పటేల్,కే ఎల్ రాహుల్, కరుణ్ నాయర్, అభిషేక పోరెల్, సమీర్ రిజివి, అజయ్ మండల్, మాన్వంత్ కుమార్ అశుతోష్ శర్మ, మాధవ తివారి, ముఖేష్ కుమార్, నటరాజన్, మోహిత్ శర్మ, విప్రాజ్ నిగం, త్రిపుర విజయ్, కులదీప్ యాదవ్,

విదేశీ ఆటగాళ్లు

కే ఎల్ రాహుల్ ,స్టార్క్, డ్యూప్లెస్, జేక్ ప్రేజర్, డోనోవాన్ ఫెరీర, స్టబ్స్, చమీరా.

కీలకమైన ఆటగాళ్లు:

కే ఎల్ రాహుల్ , మోహిత్ శర్మ, స్టార్క్, డ్యూప్లెస్, అక్షర పటేల్

4. గుజరాత్ టైటాన్స్ (విన్నర్స్ 2022)

కెప్టెన్: శుభ్ మాన్ గిల్

కోచ్ : ఆశిష్ నెహ్ర (ఇండియా)

2022 అడుగుపెట్టి, అనూహ్యంగా ట్రోఫీ గెలిచిన గుజరాత్ టైటాన్స్ ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. 2023 లో కూడా ఫైనల్ చేరినప్పటికీ, ఫైనల్లో ఓడిపోయింది. తర్వాత 2024 సీజన్లో కూడా నిరాశ కలిగింది. చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో గిల్ ప్రదర్శన నిరాశ జనకంగా ఉంది. పైగా ఇప్పుడు కెప్టెన్ గా జట్టును నడిపించాలి. బ్యాటింగ్ చాలా మటుకు గిల్ పైనే ఆధారపడింది. మళ్లీ టైటిల్ గెలవాలంటే టైటాన్స్ ప్రదర్శన అద్భుతానికి తక్కువగా ఉండకూడదు.

భారత ఆటగాళ్లు

రషీద్ ఖాన్, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, కగిసో రబడ,జోస్ బట్లర్ , మహ్మద్ సిరాజ్ , ప్రసిద్ధ్ కృష్ణ , నిశాంత్ సింధు , మహిపాల్ లోమ్రోర్ , కుమార్ కుషాగ్రా , అనుజ్ రావత్ , మానవ్ సుతార్ , వాషింగ్టన్ సుందర్ , జెరాల్డ్ కోయెట్జీ , అర్షద్ ఖాన్, గుర్నూర్ బ్రార్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ , సాయి కిషోర్ , ఇషాంత్ శర్మ , జయంత్ యాదవ్ , గ్లెన్ ఫిలిప్స్ , కరీం జనత్

విదేశీ ఆటగాళ్లు

రషీద్ ఖాన్, కగిసో రబడ, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్, గ్లెన్ ఫిలిప్స్ , కరీం జనత్, జోస్ బట్లర్, జెరాల్డ్ కోయెట్జీ.

కీలకమైన ఆటగాళ్లు:

రషీద్ ఖాన్, శుభ్మన్ గిల్, కగిసో రబడ, జోస్ బట్లర్

5. రాజస్థాన్ రాయల్స్ (విన్నర్స్ 2008)

కెప్టెన్: సంజు సాంసన్

కోచ్ : రాహుల్ ద్రవిడ్ (ఇండియా)

బ్యాటింగ్ కోచ్: విక్రమ్ రాథోడ్ (ఇండియా)

సంజు శామ్సన్ పూర్తిగా గాయం నుంచి కోలుకోకపోవడం వల్ల, మొదటి మూడు మ్యాచ్లు ఇయాన్ పరాగ్ సారధ్యంలో నడుస్తాయి. గాయం నుంచి పూర్తిగా కోరుకున్న తర్వాత సంజు శామ్సన్ మళ్లీ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరిస్తాడు. పైగా శామ్సన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగే అవకాశం ఉంది. రాజస్థాన్ రాయల్స్ కి ఇది కొంచెం ఇబ్బంది.

భారత ఆటగాళ్లు

జైస్వాల్,హెట్మర్,పరాగ్, శుభం దూబే, సూర్యవంశీ, సంజూ సాంసన్, జురెల్, రాథోడ్, హర్షిత్ రాణ, హసరంగా, యుధ్వీర్ సింగ్,సందీప్ షర్మ, జోఫ్రా ఆర్చర్,ఫజల్,మపాక, తీక్షన, కార్తికేయా, తుషార్ దేశ్ పాండే, ఆకాష్ మద్వాల్,అశోక్ శర్మ

విదేశీ ఆటగాళ్లు

హెట్మర్, హషరంగా, జోఫ్రా ఆర్చర్, మపాక, మహీష్ తీక్షణ

కీలకమైన ఆటగాళ్లు:

సంజూ సాంసన్, జోఫ్రా ఆర్చర్, సందీప్ షర్మ, జైస్వాల్,హెట్మర్

6. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

కెప్టెన్: రజత్ పట్టిదార్

కోచ్ : ఆండీ ఫ్లవర్(జింబాబ్వే

బ్యాటింగ్ కోచ్: దినేష్ కార్తీక్

భారత ఆటగాళ్లు

రజత్ పట్టిదార్. విరాట్ కోహ్లీ. పైడికల్, స్వస్తిక్ షికార, జితేష్ శర్మ, ఫిల్ సాల్ట్, లియాన్ లివింగ్ స్టన్, క్రునాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టీమ్ డేవిడ్, రుమారియో షెఫర్డ్, మనోజ్, జాకప్ బెత్తల్, భువనేశ్వర్, హేజల్ వుడ్, రసిక్ దార్, సుయాష్, తుషార, లుంగీ ఎంగిడి, అభినందన్ సింగ్, మోహిత్, యష్ దయాల్

విదేశీ ఆటగాళ్లు

ఫిల్ సాల్ట్, లియాన్ లివింగ్ స్టన్, టీమ్ డేవిడ్, రుమారియో షెఫర్డ్, మనోజ్, జాకప్ బెత్తల్, హేజల్ వుడ్, లుంగీ ఎంగిడి,

కీలకమైన ఆటగాళ్లు:

విరాట్ కోహ్లీ. పడిక్కల్, ఫిల్ సాల్ట్, లయాన్ లివింగ్ స్టన్, క్రునాల్ పాండ్యా,

7. కోల్కత్తా నైట్ రైడర్స్ (విన్నర్స్ 2012,2014,2024)

కెప్టెన్: అజింక్య రహానే

కోచ్ : చంద్రకాంత్ పండిత్ (ఇండియా)

బౌలింగ్ కోచ్: భరత్ అరుణ్ ( ఇండియా)

గత సంవత్సరం శ్రేయాస్ అయ్యర్ ఆధ్వర్యంలో ట్రోఫీ గెలిచినప్పటికీ, అయ్యర్ మాత్రం టీం ను వదిలి వెళ్ళిపోయాడు. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న కేకేఆర్ 2014 లో చివరిసారిగా ట్రోఫీ గెలిచింది. అప్పుడు కెప్టెన్ గా గౌతమ్ గంభీర్ ఉన్నాడు. మళ్లీ 10 ఏళ్ల తర్వాత ట్రోఫీ గెలిచినప్పటికీ ఉపయోగం లేకపోయింది. జట్టులో సమతుల్యత లేకుండా పోయింది 23.75 కోట్లతో ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ని కొనుగోలు చేసిన కేకేఆర్, అయ్యర్ కు కాకుండా అజింక్య ను కెప్టెన్ చేయడం ఆశ్చర్యకరమే.

భారత ఆటగాళ్లు

అజింక్య రహానే, రింకు సింగ్, రఘు వంశీ, పోవల్, మనీష్ పాండే, డీకాక్, గురుబాజ్, సిసోడియా, వెంకటేష్ అయ్యర్, అనుకూల రాయి, మోయిన్ అలీ, రమణాదీప్ సింగ్, ఆండ్రీ రస్సెల్, నోకియా, వైభవ్ అరోరా, మయాంక్ మార్కండే, స్పెన్సర్స్ జాన్సన్, హర్షిత్ రానా, సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి, చేతన్ సకారియా

విదేశీ ఆటగాళ్లు

పోవల్, డీకాక్, సిసోడియా, మోయిన్ అలీ, ఆండ్రీ రస్సెల్, స్పెన్సర్స్ జాన్సన్, సునీల్ నరేన్,

కీలకమైన ఆటగాళ్లు:

అజింక్య రహానే, రింకు సింగ్, రస్సెల్, సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి,

8. పంజాబ్ కింగ్స్ (ఇంతవరకు గెలవలేదు )

కెప్టెన్: శ్రేయస్ అయ్యర్

కోచ్ : రికీ పాంటింగ్(ఆస్ట్రేలియా)

భారత ఆటగాళ్లు

శ్రియస్ అయ్యర్, ఆర్షదీప్ సింగ్, చాహల్, ప్రభు సిమన్సింగ్, శశాంక్ సింగ్, నిహాల్ వదెరా, వైశ్యాక్ విజయకుమార్, యష్ ఠాకూర్, విష్ణు వినోద్, హర్నూర్ పన్ను, పైలా అవినాష్, హరి ప్రీత్ బ్రార్, ప్రియాంష్ ఆర్య, ముషీర్ ఖాన్, సూర్యాంష్, కుల్దీప్ సేన్, ప్రవీణ్ దుబే,ఆరోన్ హార్డీ, లక్కీ ఫర్గూసన్, బార్ట్ లెట్

విదేశీ ఆటగాళ్లు

స్టైనిస్, మాక్స్వెల్, జ్యూస్ ఇంగ్లీష్, మార్కో యాన్సెస్, అజ్మతుల్లా, అరుణ్ హారతి

కీలకమైన ఆటగాళ్లు:

శ్రేయస్ అయ్యర్, ఆర్షదీప్ సింగ్, చాహల్, స్టైనిస్, మాక్స్వెల్

9. లఖ్ నవ్ సూపర్ జైంట్స్ (ఇంతవరకు గెలవలేదు)

కెప్టెన్: రిషబ్ పంత్

కోచ్ : జస్టిన్ లంగర్(ఆస్ట్రేలియా):

భారత ఆటగాళ్లు

రిషబ్ పంత్(కెప్టెన్), షాబాజ్ అహ్మద్, ఆయుష్ బదోని, మయాంక్ యాదవ్, ఆవేశ్ ఖాన్, ఆకాష్ దీప్, మోసిన్ ఖాన్, రవి బష్నోయి, మనీ మారన్, అబ్దుల్ సమద్, ఆర్యన్ జుఎల్, హిమ్మత్ సింగ్, యువరాజ్ చౌదరి, అశ్విన్ కులకర్ణి, ప్రిన్స్ యాదవ్, ఆకాష్ సింగ్, దిగ్వేస్ సింగ్,

విదేశీ ఆటగాళ్లు

పూరన్, మార్ క్రం,మిల్లర్, మిచెల్ మార్ష్, బ్రీట్జ్ కే, షమర్ జోసెఫ్

కీలకమైన ఆటగాళ్లు:

రిషబ్ పంత్, మయాంక్ యాదవ్, అబ్దుల్ సమద్, మిల్లర్, మిచెల్ మార్ష్

10. సన్రైజర్స్ హైదరాబాద్(ఇంతవరకు గెలవలేదు)

కెప్టెన్: ప్యాట్ కమిన్స్

కోచ్ : డేనియల్ వెట్టోరి (న్యూజిలాండ్ )

భారత ఆటగాళ్లు

అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ షమీ, సచిన్ బేబీ, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, అధర్వా దైతే, రాహుల్ షహర్, హర్షల్ షపటేల్, సిమర్జిత్ సింగ్, జయదేవ్ ఉనద్కట్,జీషన్ అన్సారి,

విదేశీ ఆటగాళ్లు

ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, హెన్రిక్ క్లాసెన్, మెండిస్, ముల్డర్,బ్రైడెన్ కార్స్, ఇషన్ మలింగా, ఆడం జంపా.

కీలకమైన ఆటగాళ్లు:

అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, మహమ్మద్ షమీ, ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్

Tags:    

Similar News