మను బాకర్ పారితోషికం లక్షల నుంచి కోట్లలోకి..

తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని సుమారు 50కి పైగా కంపెనీలు మను బాకర్ వెంట పడ్డాయి. దీంతో ఆమె పారితోషకం కూడా అమాంతంగా పెరిగిపోయింది.

By :  Aprameya C
Update: 2024-08-22 11:36 GMT

మను భాకర్ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా తెలిసిపోయింది. షూటర్‌గా గుర్తింపు చేసుకున్న ఈమె ఇటీవలి పారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు కాంస్య పతకాలను సాధించింది. మహిళల 10 మీ ఎయిర్ పిస్టల్, మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సత్తా చాటిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని కంపెనీలు వెంటపడుతుండడంతో ఆమె పారితోషకం అమాంతంగా పెరిగిపోయింది.

ఒక్కో డీల్ రూ. 1.5 కోట్లు..

"పారిస్ ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలను సాధించిన మను భాకర్ .. ప్రస్తుతం క్రీడా ప్రపంచంలో పరిచయం అక్కర్లేని క్రీడాకారిణి. ప్రస్తుతం వివిధ కంపెనీల దృష్టి ఆమెపై పడింది. తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని 50కి పైగా కంపెనీలు క్యూకట్టాయి. అయితే ఇప్పటికి ఆమె ఒకదానికి మాత్రమే ఓకే చేశారు. రాబోయే రోజుల్లో మరో ఐదారింటితో డీల్ కుదిరే అవకాశం ఉంది. ఇంతకుముందు మను రూ. 20 లక్షల నుంచి రూ25 లక్షలు తీసుకునేది. ఇప్పుడు ఆమె బ్రాండ్ విలువ దాదాపు ఐదు నుంచి ఆరు రెట్లు పెరిగింది. ఒక్కో డీల్‌కు రూ. 1.5 కోట్లకు చేరుకుంది.” అని IOS స్పోర్ట్స్ & ఎంటర్‌టైన్‌మెంట్ MD నీరవ్ తోమర్ ఫెడరల్‌తో చెప్పారు.

Tags:    

Similar News