‘మా వందే’ నరేంద్ర మోదీ బయోపిక్

ఉన్ని ముకుందన్ మోదీ గా నటిస్తున్న చిత్రం;

Update: 2025-09-17 10:41 GMT



నరేంద్ర మోదీ 75 వ జన్మదిన సందర్భంగా ఆయన బయోపిక్ ని తీయబోతున్నట్టు సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ సంస్థ ప్రకటించింది. ఈ సినిమాకి ఎం.వీర్ రెడ్డి నిర్మాతగా, సి.హెచ్ .క్రాంత్ కుమార్ డైరెక్టర్ గా ఉండబోతున్నారని ; మోదీగా ప్రముఖ మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటించబోతున్నారన్న వివరాలు కూడా వెల్లడించారు. ఈ సినిమాకు ‘మా వందే’ అన్న పేరు కూడా ఖరారు చేశారు.

'మోదీ గారి వ్యక్తిగత, రాజకీయ జీవితంలోని సంఘటనలు, విశేషాలన్నీ ఎంతో సహజంగా మా సినిమాలో చూపించబోతున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యున్నత సాంకేతిక విలువలు, వీఎఫ్ఎక్స్ తో రూపొందే 'మా వందే' చిత్రాన్ని పాన్ ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్ లోనూ నిర్మిస్తున్నాం. ప్రపంచ నాయకుడిగా మోదీ ఎదగడం వెనక ఆయన మాతృమూర్తి హీరాబెన్ ఇచ్చిన ప్రేరణ, తల్లితో మోదీకి గల అనుబంధం ఈ చిత్రంలో భావోద్వేగాలను పంచనుంది. మచ్చలేని నాయకుడిగా దేశ సేవకే జీవితాన్ని అంకితం చేస్తున్న ప్రధాని మోదీ జీవిత విశేషాలను ఈ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రేక్షకులందరికీ నచ్చేలా ఆవిష్కరించబోతున్నాం' అని ఈ సినిమా గురించి మాట్లాడుతూ వీర్ రెడ్డి అన్నారు.

ఈ చిత్రానికి కింగ్ సాలోమన్ యాక్షన్ కొరియోగ్రఫీ,సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్ ,కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ ,రవి బ్రాసుర్ సంగీతం అందించబోతున్నారు.

‘అన్ని పోరాటాల కన్నా తల్లి సంకల్పం గొప్పదన్న’ నరేంద్ర మోదీ వాక్యంతో ఈ సినిమా పోస్టర్ బయటకు రావడంతో ఈ సినిమా గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది.







Tags:    

Similar News