హైదరాబాద్‌లో విస్తరిస్తున్న ఏఐ రంగం...కొత్తగా లక్షన్నర ఉద్యోగాలు
హైదరాబాద్ నగరం ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా మారనుందా? అంటే అవునంటోంది తెలంగాణ సర్కారు. ఏఐలో హైదరాబాద్ సాధిస్తున్న ప్రగతి, ఉద్యోగావకాశాలపై స్టోరీ...
వచ్చే రెండేళ్లలో లక్షన్నర మందికి కొత్తగా ఏఐ ఆధారిత ఉద్యోగాలు వస్తాయని సాంకేతిక నిపుణులు అంచనా వేశారు. హైదరాబాద్ నగరంలో ఇంజినీరింగ్ చదివిన విద్యార్థులు ఏఐలో శిక్షణ పొందుతున్నారు. దీంతో ఏఐ మార్పులకు అనుగుణంగా యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఐఐటీలు పలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టాయి. మద్రాస్ ఐఐటీ ఏఐ నిపుణులను తయారు చేసేందుకు వీలుగా యూకేలోని బర్మింగ్ హామ్ యూనివర్శిటీతో కలిసి ఏఐ ఎమ్మెస్సీ మాస్టర్స్ కోర్సును ప్రవేశపెట్టింది. భవిష్యత్ ఏఐదేనని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ కోర్సులో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. ఏఐపై హైదరాబాద్ ట్రిపుల్ ఐటీ, ఐఐటీలు 300కు పైగా పరిశోధనాపత్రాలు వెలువడ్డాయి. టెక్ ప్రపంచంలో ఏఐ మానియా నడుస్తుండటంతో హైదరాబాద్ నగరంలో అందరి దృష్టి దీనిపై పడింది. ఏఐకి హైదరాబాద్ అన్ని రకాల అనుకూలమని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఏఐ గ్లోబల్ సమ్మిట్, ఏఐ సిటీ
హైదరాబాద్ నగరంలో జులై 1,2 తేదీల్లో ఏఐ సదస్సు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ విభాగం కార్యదర్శి జయేష్ రంజన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఏఐ సంస్థలను ఆహ్వానించి ఏఐ ఎకోసిస్టమ్ ను అభివృద్ధి చేస్తామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ లో నిర్వహించనున్న ఆర్టిఫిసీయల్ ఇంటలిజెన్స్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రపంచం నలుమూలల నుంచి ఏఐ కంపెనీలను పిలుస్తామని జయేష్ రంజన్ వెల్లడించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని 500 ఎకరాల్లో దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో ఏఐ సీటీని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ సర్కారు సన్నాహాలు ప్రారంభించింది. ఏఐ, రోబోటిక్స్, కంప్యూటర్ విజన్ రంగాలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 2025వ సంవత్సరానికి 150 స్టార్టప్ కంపెనీలను నెలకొల్పడం ద్వారా 500 ఏఐ సంబంధిత ఉద్యోగావకాశాలు కల్పించాలని నిర్ణయించారు.
ఏఐ స్టార్టప్‌లకు ప్రోత్సాహం
మరో వైపు టీహబ్ ఏఐకు ప్రాధాన్యమిచ్చి స్టార్టప్ ల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. తెలంగాణ ఏఐ మిషన్, నాస్కామ్ లు సంయుక్తంగా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ పై నివేదికను కూడా రూపొందించాయి. ప్రపంచ-స్థాయి లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, విభిన్న ఏఐ అప్లికేషన్‌లపై టీహబ్ ఈ నెలలో ప్రత్యేక లెక్చర్స్ ఏర్పాటు చేయనున్నారు. ఒక సంస్థలో ఏఐ సాంకేతికతను అమలు చేయడంలో ఎదురయ్యే అడ్డంకులు, వాటిని అధిగమించేందుకు వ్యూహాలపై టీహబ్ మార్చి చివరివారంలో చర్చా వేదికలు కూడా నిర్వహించనుంది. హైదరాబాద్ నగరంలో ఏఐ విస్తరిస్తే మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయని టెక్ నిపుణులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
విస్తరిస్తున్న ఏఐ రంగం
తెలంగాణలోని హైదరాబాద్ నగరం కేంద్రంగా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్(ఏఐ) విస్తరించనుంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ఏఐ రంగంలో హైదరాబాద్ నగరం వేగంగా దూసుకుపోతోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ నగరంలో జులై నెలలో ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ సదస్సు నిర్వహిస్తామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తాజాగా ప్రకటించారు. ప్రపంచంలోనే హైదరాబాద్ నగరాన్ని ఏఐ రాజధానిగా చేసేందుకు వీలుగా ఏఐ ఎక్స్‌లెన్స్ సెంటరును ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం హైదరాబాద్ నగరంలో ప్రారంభించిన టీ హబ్ స్టార్టప్ ఇంక్యుబేటర్ తరహాలోనే ఏఐ అండ్ మెషీన్ లెర్నింగ్ కేంద్రాన్ని నెలకొల్పాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది. రాష్ట్రంలో వ్యవసాయోత్పత్తులు, పెన్షనర్ల వెరిఫికేషన్, రోడ్లపై గుంతలను గుర్తించడంలో ఏఐ సాంకేతికతను వినియోగించనున్నారు.
ఎందుకు హైదరాబాద్ ఏఐకి అనుకూలం?