నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి అరవింద్‌పై కాంగ్రెస్ చార్జిషీట్
నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి అరవింద్ పేరిట కాంగ్రెస్ పార్టీ చార్జిషీట్ విడుదల చేసింది. బీజేపీ ఎంపీ అరవింద్ కు టీపీసీసీ ఎన్నారై సెల్ నాలుగు ప్రశ్నలు సంధించింది.
‘గల్ఫ్ కార్మిక ద్రోహి... గప్పాల అరవింద్’ పేరిట కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం సంచలన చార్జిషీట్ విడుదల చేశారు. 2019 లో మాయ మాటలతో గల్ఫ్ కార్మికుల ఓట్లు కొల్లగొట్టి నిజామాబాద్ ఎంపీగా గెలిచిన అరవింద్ గల్ఫ్ కార్మికులను మోసం చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. టీపీసీసీ ఎన్నారై సెల్, గల్ఫ్ కాంగ్రెస్ నాయకులు సోమవారం గాంధీ భవన్ లో ఒక చార్జిషీట్ ను విడుదల చేశారు.
- మాజీ కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, టీపీసీసీ ఎన్నారై సెల్ నాయకులు మంద భీంరెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, కేరళ ప్రవాసి కాంగ్రెస్ నేత మునీర్ తో కలిసి ఎంపీ అరవింద్ పై చార్జిషీట్ పోస్టర్ ను ఆవిష్కరించారు. చార్జిషీట్ లోని నాలుగు ప్రశ్నలకు జవాబు ఇవ్వకపోతే... ఈ పార్లమెంటు ఎన్నికల్లో అరవింద్ కు గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగే నైతిక అర్హత ఉండదని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.