గ్లోబల్ అయ్యప్ప సమ్మిట్‌ ఆహ్వానంపై తమిళనాడు సీఎం ఎలా స్పందించారు?

స్టాలిన్ హాజరయితే నిరసన ప్రదర్శన చేపడతామంటున్న బీజేపీ కేరళ నేతలు..;

Update: 2025-08-26 08:07 GMT
Click the Play button to listen to article

కేరళ(Kerala) లోని ట్రావెన్‌కోర్ దేవస్థానం (Travancore) బోర్డు సెప్టెంబర్ 20వ తేదీన అయ్యప్ప సంగమం(గ్లోబల్ అయ్యప్ప సమ్మిట్)నిర్వహిస్తోంది. బోర్డు ప్లాటినం జూబ్లీ వేడుకల్లో భాగంగా పంబా నది ఒడ్డున నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమానికి హాజరుకావాలని తమిళనాడు(Tamil Nadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(MK Stalin)కు గత వారం కేరళ సహకార, ఓడరేవులు మంత్రి వి నా వాసవం నుంచి ఆహ్వానం అందింది. అయితే బిజీ షెడ్యూల్ వల్ల ముఖ్యమంత్రి హాజరుకావడం లేదని, మంత్రులు పీకే శేఖర్ బాబు, పళనివేల్ త్యాగరాజన్ హాజరవుతారని తమిళనాడు సీఎం కార్యాలయం కేరళ ప్రభుత్వానికి సమాచారం పంపింది.


స్టాలిన్ హాజరుపై బీజేపీ అభ్యంతరం..

గ్లోబల్ అయ్యప్ప సమ్మిట్‌కు స్టాలిన్‌ను ఆహ్వానించడం రాజకీయ చర్చకు దారితీసింది. స్టాలిన్ హాజరును బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ వ్యతిరేకించారు. ఆయన హాజరయితే నిరసన ప్రదర్శన చేపడతామని పార్టీ నేతలు హెచ్చరించారు. 


కేరళ సీఎం పినరయి విజయన్, స్టాలిన్ గతంతో హిందూ విశ్వాసాన్ని అవమానించారని, అయ్యప్ప భక్తుల అగౌరవపరిచారని, వారిద్దరూ హిందువులకు క్షమాపణ చెప్పాలని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.

"పినరాయి అయ్యప్ప భక్తులను జైలులో పెట్టాడు. చాలామందిపై కేసులు పెట్టించాడు. భక్తులపైకి పోలీసులను ఉసిగొల్పారు. శబరిమల పవిత్రను దెబ్బతిసేందుకు చేయగలిగినదంతా చేశాడు, " అని సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో చంద్రశేఖర్ పోస్టు చేశారు.

2023లో సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "స్టాలిన్, ఆయన కొడుకు పదే పదే హిందువులను అవమానించారని, హిందూ విశ్వాసాన్ని వైరస్‌గా పోల్చారని,’’ రాజీవ్ ఆరోపించారు.

Tags:    

Similar News