సీఎం రేవంత్‌, డెప్యూటీ సీఎం భట్టి ప్రమాణం చేయించిన గవర్నర్ తమిళిసై

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ . ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పండగ

Update: 2023-12-07 09:28 GMT

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు. అంతకుముందు కాంగ్రెస్‌ కార్యకర్తల కేరింతలు మధ్య ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీతో కలిసి ప్రత్యేక వాహనంలో రేవంత్‌ వేదిక వద్దకు చేరుకున్నారు. కాంగ్రెస్‌, ఇతర పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకతో పాటు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ ముఖ్యనేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.

రేవంత్‌రెడ్డి ప్రొఫైల్..

స్వతంత్రంగా పోటీ చేసి జడ్పీటీసీ సభ్యుడిగా గెలిచి.. రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రేవంత్‌రెడ్డి, కేవలం 17 ఏళ్లలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. తొలుత టీఆర్‌ఎస్ లో పని చేసిన రేవంత్‌.. తర్వాత టీడీపీలో చేరారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ లో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. పార్టీ సర్కారునే గద్దె దించి, ఏకంగా సీఎం అయిపోయారు..

ఊరు: నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి

తల్లిదండ్రులు: ఎనుముల నరసింహారెడ్డి, రామచంద్రమ్మ

పుట్టిన తేదీ: నవంబరు 08, 1969

విద్యార్హతలు: డిగ్రీ (ఏవీ కళాశాల, హైదరాబాద్‌)

భార్య: గీత

కుమార్తె: నైమిషా రెడ్డి

నివాసం: జూబ్లీహిల్స్‌

రాజకీయ నేపథ్యం.. పదవులు

2006: స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి మిడ్జిల్‌ (ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా) జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నిక

2007-2009: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ (ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలి)

2009-2014: ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ (కొడంగల్‌ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా గెలుపు)

2014: మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక (కొడంగల్‌ నుంచే టీడీపీ అభ్యర్థిగా గెలుపు)

2014-2017: టీడీపీ శాసనసభా పక్షనేత (తెలంగాణ శాసనసభ)

2017 అక్టోబరు: కాంగ్రెస్‌ పార్టీలో చేరిక

2018: శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా కొడంగల్‌ నుంచి పోటీ చేసి ఓటమి

2018: పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియామకం

2019 మే: కాంగ్రెస్ అభ్యర్థిగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపు

2021 జూన్‌ 26: పీసీసీ అధ్యక్షునిగా నియామకం

ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు



రేవంత్‌తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నూతన మంత్రుల చేత గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు. భట్టి విక్రమార్క ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు మొత్తం 12 మంది ప్రమాణస్వీకారం చేసినట్టయింది.

మంత్రుల జాబితా ఇదే..

1. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

2. కొండా సురేఖ

3. జూపల్లి కృష్ణ రావు

4. భట్టి విక్రమార్క

5. ఉత్తమ్ కుమార్‌ రెడ్డి

6. పొన్నం ప్రభాకర్

7. సీతక్క

8. శ్రీధర్ బాబు

9. తుమ్మల నాగేశ్వరరావు

10. పొంగులేటి శ్రీనివాసరెడ్డి

11. దామోదర రాజనర్సింహ



Similar News