జన్యువులపై పరిశోధనకుగానూ ఇద్దరు అమెరికా సైంటిస్టులకు నోబుల్ బహుమతి

జన్యువుల నియంత్రణలో కీలకపాత్ర పోషించే మైక్రో ఆర్ఎన్ఏ అనే ఒక కొత్తరకం ఆర్ఎన్ఏను వీరు కనుగొన్నారు.

Update: 2024-10-07 12:20 GMT

2024 వ సంవత్సరానికి గానూ వైద్యశాస్త్రంలో నోబుల్ బహుమతిని ప్రకటించారు. జన్యువుల నియంత్రణలో ఇమిడిఉన్న మౌలిక సూత్రాన్ని కనుగొన్నందుకుగానూ విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్ అనే ఇద్దరు శాస్త్రజ్ఞులు ఈ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసినట్లు స్టాక్‌హోమ్‌లోని నోబుల్ బహుమతి ఎంపిక కమిటీవారు ప్రకటించారు.

మన క్రోమోజోములలో దాగిఉన్న సమాచారం మన శరీరంలోని కణాలు అన్నింటికీ ఒక సూచనల మేన్యువల్‌లాగా పని చేస్తుందని అంటారు. ప్రతి కణంలోనూ అవే క్రోమోజోమ్‌లు ఉంటాయి కాబట్టి ప్రతి కణంలోనూ అదే జన్యువుల జోడీ ఉంటుంది, అదే రకమైన సూచనలు ఉంటాయి.

అయినా కూడా, నరాలు, కండరాలలో ఉండే భిన్నమైన రకాల కణాలకు చాలా భిన్నమైన లక్షణాలు ఉంటాయి. ఈ తేడాలు ఎందుకు ఏర్పడతాయి అనే ప్రశ్నకు జవాబు జన్యువుల నియంత్రణలో ఉంటుంది. ఈ నియంత్రణ వలనే ప్రతి కణమూ సంబంధిత సూచనను మాత్రమే ఎంచుకుంటుంది. అందుకే ప్రతి కణ తరగతిలోనూ సరైన జన్యువుల జోడీ మాత్రమే క్రియాశీలం అవుతుంది.

భిన్నమైన రకాల కణాలు ఎలా అభివృద్ధి చెందుతాయి అనేదానిపై ఆంబ్రోస్, రువ్‌కున్‌లకు మొదటినుంచీ ఆసక్తి ఉంది. జన్యువుల నియంత్రణలో కీలకపాత్ర పోషించే మైక్రో ఆర్ఎన్ఏ అనే ఒక కొత్తరకం ఆర్ఎన్ఏను వీరు కనుగొన్నారు. వీరు కనుగొన్న ఈ విషయంద్వారా జన్యు నియంత్రణలో ఒక కొత్త మౌలిక సూత్రం ఆవిష్కృతమయింది.

Tags:    

Similar News