సినీ సందడి.. సంక్రాంతి పందెం
మొత్తం 5 సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఐదూ ఒకేసారి రిలీజ్ అయితే ఎలా ఉంటుందోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. నిర్మాతలేమో బిక్కుబిక్కుమంటున్నారట. ఎందుకో..
అందరూ పెద్ద నిర్మాతలే. ఎవ్వరూ ఎవరికి తీసిపోని వారే. ఐదు సినిమాలు తీశారు. సంక్రాంతికి సిద్ధం చేశారు. ఐదు సినిమాలు విడుదల కావడం తెలుగు సినీ అభిమానులకు పండగే అయినా ఫిలిం ఛాంబర్ మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిర్మాతల మధ్య రాజీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. కుదరకపోతే ఏమి చేయాలనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు.
సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలపై ఉత్కంఠ నెలకొంది. ఐదు చిత్రాలు విడుదలకు సిద్ధమవ్వగా... పోటీ తప్పించడానికి ఫిలిం చాంబర్ ప్రయత్నిస్తోంది. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు... ఐదుగురు నిర్మాతలతో సమావేశం అయ్యారు. వారితో సంప్రదింపులు జరిపారు. రెండు, మూడు రోజుల్లో నిర్మాతలు నిర్ణయం తెలుపనున్నారు. ఒకవేళ ఎవ్వరూ వెనక్కి తగ్గకపోతే అన్నీ సినిమాలు విడుదలవుతాయి. సంక్రాంతి బరిలో గుంటూరు కారం, హనుమాన్, ఈగల్, సైంధవ్, నా సామిరంగా చిత్రాలు ఉన్నాయి. అయితే ఎవరికి వారు పట్టుదలతో ఉన్నారు. ఎవ్వరూ తగ్గకపోతే ఏమి చేయాలనే దానిపై చర్చలు సాగుతున్నాయి. నా సామిరంగా సినిమాలో నాగార్జు హీరోగా ఉన్నారు.