రాష్ట్రాలకు మళ్లీ కరోనా ఎలర్ట్
ప్రపంచాన్ని హడలెత్తించిన కరోనా మహమ్మారి మళ్లీ ఇండియాలోకి
Byline : The Federal
Update: 2023-12-18 14:04 GMT
ప్రపంచాన్ని హడలెత్తించిన కరోనా మహమ్మారి మళ్లీ ఇండియాలోకి ప్రవేశించిందా? ఈసారి కొత్త వేరియంట్ రూపంలో దేశంలోకి చొరబడినట్టు చెబుతున్నారు అధికారులు. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. రాష్ట్రాలకు కోవిడ్ అలెర్ట్ ఇచ్చింది. కేరళలో కొత్త వేరియంట్ JN.1ను గుర్తించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ వైరస్‌తో కేరళలో ఇప్పటికే నలుగురు మరణించారు. 'కొవిడ్ టెస్టులకు RTPCR కిట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. టెస్టుల సంఖ్యను పెంచాలని ఆదేశించింది. జిల్లాల్లోని కేసులను పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఉత్తర్వులు ఇచ్చింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను INSACOG ప్రయోగశాలలకు పంపాలని సలహా ఇచ్చింది. కరోనా సబ్ వేరియంట్ గా భావిస్తున్న JN.1 ఇటీవల కేరళలో బయటపడింది.