మాజీ ప్రధాని వాజ్ పేయ్, వాళ్ల నాన్న ఇద్దరు క్లాస్ మేట్స్ అని మీకు తెలుసా

అటల్ బిహారీ వాజ్ పేయ్ ప్రధానిగా, ప్రతిపక్షనేతగా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నారు. పాలకపక్షంలో ఉన్న, విపక్షంలో ఉన్న తన ముద్ర స్పష్టంగా కనిపించేలా రాజకీయం చేశారు.

Update: 2023-12-25 07:11 GMT
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్

 తన వాగ్ధాటి, కవితలు, పాలనతో దేశ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి నాయకుడి జన్మదినం నేడు.. ఈసందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు మన ఫెడరల్ పాఠకుల కోసం

1. మాజీ ప్రధాని వాజ్ పేయ్ డిసెంబర్ 25, 1924లో జన్మించారు. ఇదే రోజు మదన్ మోహన్ మాలవ్య, పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టినరోజు కూడా. 

2. ఐక్యరాజ్యసమితి లో జాతీయ భాష హిందీలో ప్రసంగించిన తొలి భారతీయ నాయకుడు, అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్.

3. వాజ్ పేయ్ గొప్ప వక్త మాత్రమే కాదు.. గొప్ప కవి కూడా. ఆయన 10 వ తరగతిలో ఉండగానే తొలి పద్యం రాశారు. ‘హిందూ తన్ మన్, హిందూ జీవన్, రాగ్ రాగ్ హిందూ- మేరా పరిచయ్’ అంటూ తన కలాన్ని భావయుక్తంగా పరుగులు పెట్టించారు.

4. వాజ్ పేయ్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అయినప్పటికీ ఆయన నాన్ వెజ్ అంటే అమితంగా ఇష్టపడేవారు. ముఖ్యంగా రొయ్యలతో చేసిన వివిధ రకాల ఆహార పదార్థాలంటే తనకు చాలా ఇష్టమని సన్నిహితులతో చెబుతుండేవారు.

5. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 23 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. ఆయనతో పాటు తన సోదరుడు సైతం ఆయనతో పాటు జైలు జీవితం గడిపారు.

6.ఆయన తన జీవిత కాలంలో రెండు పత్రికలకు ఎడిటర్ గా పని చేశారు. మొదటగా ‘రాష్ట్రధర్మ’ కాగా రెండోవది ‘పాంచజన్య’. ఇవి రెండు కూడా మాస పత్రికలు

7.వాజ్ పేయ్, ఆయన తండ్రి క్లాస్ మేట్స్.. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఇద్దరు కలిసి కాన్పూర్ లోని డీఏవీ కాలేజీలో న్యాయవాద విద్యను అభ్యసించారు. ఒకే హస్టల్ రూమ్ లో ఉన్నారు కూడా.

8. అటల్ పెళ్లి చేసుకోలేదు. " మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు" అని ఎవరైన అడిగితే, "పనిలో పడి మర్చిపోయాను" అని సరదాగా సమాధానం ఇచ్చేవారట. కానీ ఆయన ఒక పాపను దత్తత తీసుకున్నారు.

9. పార్లమెంట్ లో ఒక్క పక్కన కూర్చుని, మిగతా సభ్యుల ప్రసంగాలు వింటూ, ఒక బుక్ లో ముఖ్యమైన పాయింట్స్ రాసుకుంటున్న కుర్రాడు ఎవరని భారత తొలి ప్రధాని నెహ్రూ అడిగారట. ఆ వెంటనే ఈ కుర్రాడు ఎప్పటికైన భారత ప్రధాని పీఠం అలంకరిస్తారని జోస్యం చెప్పారు. ఆయనేవరో మీరే చెప్పండి.

10.వాజ్ పేయ్ ఎంపీగా ఆరు నియోజకవర్గాల నుంచి గెలిచి చరిత్ర సృష్టించారు. బల్ రామ్ పూర్, లక్నో( యూపీ), విదిశ, గ్వాలియర్( ఎంపీ), న్యూఢిల్లీ, గాంధీనగర్( గుజరాత్), అలాగే రెండు సార్లు రాజ్యసభ కు ఎంపికైయ్యారు. మొత్తం 40 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నారు. చివరి సారిగా 2004లో లక్నో నుంచి ఎంపీగా గెలుపొందారు.

11.ఎంపీగా 47 సంవత్సరాలు పని చేశారు. చాలా కాలం పాటు పార్లమెంట్ కు ఎన్నికైన నాయకుల్లో వాజ్ పేయ్ ఒకరు. ఆయన జీవిత కాలంలో 11 సార్లు ఎంపీగా గెలుపొందారు.

12. న్యూక్లియర్ పరీక్షలు నిర్వహించి భారత అణుశక్తిని ప్రపంచానికి చూపించిన నాయకుడు అటల్. 13 మే 1998 సాయంత్రం 3.30 నిమిషాలకు పరీక్షలు నిర్వహించారు. పరీక్షలన్నీ పూర్తయ్యాక ప్రసంగిస్తూ.. నో ఫస్ట్ యూజ్ సిద్దాంతాన్ని ప్రతిపాదించారు. అంటే భారత్ మొదటగా శత్రువుపై అణుదాడి చేయదు అని దానర్థం. ఇప్పటికి భారత్ ఇదే విధానాన్ని అనుసరిస్తోంది.

13.పాకిస్తాన్ కు స్నేహం హస్తం చాచి, లాహోర్ - ఢిల్లీకి బస్సు యాత్ర చేసారు. అయితే పాకిస్తాన్ తరువాత కార్గిల్ ఆక్రమణకు దిగింది. దీనిని అప్పటి భారత ప్రభుత్వం తిప్పికొట్టింది. ఆనాడు ప్రధానిగా ఉండి సైన్యానికి అవసరమైన నైతిక బలం అందించి విజయపథంలో నడిపిందే వాజ్ పేయ్ నే. పాకిస్తాన్ ను అంతర్జాతీయంగా ఒంటరిగా చేయడంతో అవసరమైన దౌత్యం నెరిపారు.

14. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీకి, వాజ్ పేయ్ సన్నిహితుడు. భారతీయ జనసంఘ్ కాలక్రమేణా బీజేపీకి మారిన సంగతి తెలిసిందే.

15. 2009లో ఆయనకు పక్షవాతం వచ్చింది. ఆ తరువాత మెల్లిగా చేతికదలికలు దెబ్బతిన్నాయి.

93 ఏళ్ల అటల్ బిహారీ వాజ్ పేయ్ కిడ్నీ ఇన్ ఫెక్షన్, యూరినరీ ట్రాక్డ్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆగష్టు 16, 2018న ఢిల్లీలో తుది శ్వాస విడిచారు. దీంతో జాతి తీవ్ర దిగ్భాంతికి లోనైంది. 

Tags:    

Similar News