బాబ్రీ మసీద్ కూల్చివేతకు 31 ఏళ్లు పూర్తి

అయోధ్యలో ఉన్న బాబ్రీ మసీద్ కూల్చివేసి నేటికి సరిగ్గా 31 ఏళ్లు పూర్తి అయ్యాయి. 1992 డిసెంబర్ 6న కరసేవకులు బాబ్రీ మసీద్ ని కూల్చివేశారు.

Producer :  Chepyala Praveen
Update: 2023-12-06 09:54 GMT
babri masid

బాబ్రీ మసీద్ కట్టిన స్థలాన్ని హిందూవులు రామజన్మ భూమిగా భావిస్తారు. మొగల్ రాజు బాబర్ సేనాని అయిన మీర్ బాకీ క్రీ.శ. 1528-29లో ఇక్కడ నిర్మాణం అయి ఉన్న శ్రీ రాముడి గుడిని ధ్వంసం చేసి మసీద్ ను నిర్మాణం చేశాడు. దీంతో వివాదం మొదలైంది. మొదట దీనిని మసీదే అని ఓవర్గం ప్రచారం చేసింది. అయితే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా సర్వే నివేదిక, కేకే మహ్మద్ అనే అధికారి చెప్పిన విషయాల వల్ల ఇక్కడ నిర్మాణం అయిన ఉన్నగుడిని కూల్చివేసి, మసీద్ నిర్మాణం జరిగినట్లు తేలింది. 

అంతకుముందు బ్రిటిష్ పాలనా కాలంలో స్థానిక జడ్డి ఇచ్చిన తీర్పు ప్రకారం కూడా ఇక్కడ గుడి ఉండేదని తేలింది. తరువాత వివాదాలు ముదిరాయి. ఇవి ముదిరి 1992లో డిసెంబర్ 6 న కరసేవకులు ఇక్కడ ఉన్న మసీద్ ను కూల్చివేశారు. తరువాత జరిపిన తవ్వకాల్లో ఇక్కడ గుడి ఉండేదని ఆనవాళ్లు బయటపడ్డాయి. తరువాత వివాదం కోర్టుల్లోకి చేరింది. మొదట అలహబాద్ కోర్టు రామజన్మభూమిని మూడు భాగాలుగా చేస్తూ తీర్పు చెప్పింది. అయితే ఈఅంశంపై ఇరుపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. 2019లో కోర్టు ఇది రామజన్మభూమిగా తీర్పు చెప్పింది. మసీద్ వేరే చోట కట్టుకోవడానికి ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలని ఆర్డర్ ఇచ్చింది. 

దేశాన్ని మలుపు తిప్పిన బాబ్రీ- రామజన్మభూమి వివాదం

దేశంలో బాబ్రీ మసీద్ కూల్చివేత తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ముంబాయిలో వరుసగా బాంబు పేలుళ్లలో దాదాపు 250 మందికి పైగా సామాన్య ప్రజలు మరణించారు. బాబ్రీ మసీద్ కూల్చివేత పై అప్పటి కేంద్ర ప్రభుత్వం జస్టిస్ లిబర్హన్ కమిషన్ ను నియమించింది. ఈ కమిటీ 17  సంవత్సరాలు విచారణ జరిపి నివేదిక అందించింది.  ఇది దేశంలోనే అత్యధిక కాలం విచారణ జరిపిన కమిషన్ గా పేరు పొందింది.  అయోధ్య వివాదం బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి ఉపయోగపడింది. రామజన్మభూమి వివాదం నేపథ్యంలో బీజేపీ అగ్రనేతం ఎల్ కే ఆడ్వానీ రథయాత్ర చేపట్టారు.

ప్రస్తుతం ఇక్కడ శ్రీ రామమందిరం నిర్మాణం జరగుతోంది. 2023 జనవరి 22 న రామ్ లల్లా విగ్రహానికి ఇక్కడ ప్రాణప్రతిష్ట చేయడానికి అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆరు వేల మందికి ఆహ్వనాలు అందాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈపనులు పూర్తి చేస్తోంది. ఆలయ నిర్మాణానికి దాదాపు 15వందల కోట్లు ఖర్చు అవుతుందని, వాటిని దేశంలోని ప్రజల దగ్గర నుంచి రామ్ జన్మస్థాన్ తీర్ధ ట్రస్ట్ సేకరించింది. 

Tags:    

Similar News