పల్లవి ప్రశాంత్ మళ్లీ పేరు మార్చుకున్నాడు!

జైలు ఎంతటి వారిలోనైనా పరివర్తన తెస్తుందట. బిగ్‌ బాస్‌ 7 వ సీజన్‌ విజేతగా నిలిచిన పల్లవికి ఆ సంతోషం కూడా నిలవకముందే కటకటాల పాలయ్యారు. బెయిల్‌పై ఇవాళ వస్తున్నాడు

Update: 2023-12-23 04:59 GMT
పల్లవి ప్రశాంత్‌ ఫైల్ ఫోటో

జైలుకెళ్లిన తర్వాత పల్లవి ప్రశాంత్‌లో చాలా మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు భూమి పుత్రునిగా ఉన్న పల్లవి ఇకపై వేరే పేరుతో కనిపించబోతున్నాడు. బిగ్‌బాస్‌ 7వ సీజన్‌ టైటిల్‌ గెల్చిన తర్వాత 48 గంటలకే జైలు కెళ్లాల్సి వచ్చిన పల్లవికి ప్రశాంత కొరవడింది. మారిన రూపంలో ఇవాళ జైలు నుంచి బయటకు రానున్నారు.

బెయిల్‌ వచ్చింది

బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ టైటిల్ విజేత పల్లవి ప్రశాంత్‍కు బెయిల్‌ వచ్చింది. గెలుపు సంతోషాన్ని ఎంజాయి చేయకమునుపే జైలు కెళ్లాల్సి రావడంతో ప్రశాంత్ కుటుంబం తీవ్ర ఇబ్బందులకు ఈ బెయిల్ తో విముక్తి కలిగినట్టయింది. బిగ్‌ బాస్‌ ఫైనల్‌ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు ప్రశాంత్‌ను ఏ-1గా, అతని సోదరుడు మనోహర్‌ను ఏ-2గా పేర్కొంటూ కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ కేసులో ఆయనకు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. డిసెంబర్‌ 23 చంచల్‌ గూడ జైలు నుంచి ఆయన విడుదల కావచ్చు.

పేరు ఎందుకు మారిందంటే...

తాజాగా పల్లవి ప్రశాంత్‌ ఇన్‌స్టాలో తన పేరు మారింది. అందులో తన పేరు, బయోను మార్పు చేశారు. MALLA OCHINA, SPY Team Winner అని కొత్తగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేర్చుకున్నాడు. ప్రశాంత్‌ సూచన మేరకు అతని మరో​ సోదరుడు ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. తన విజయంలో SPY బ్యాచ్‌ పాత్ర ఎంతగానో ఉందని ప్రశాంత్‌ గుర్తించినట్లు ఆయన ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

ప్రశాంత్‌ ఇవాళ విడుదల

చంచల్‌గూడ జైలు నుంచి పల్లవి ప్రశాంత్‌ నేడు విడుదల కానున్నాడు. ప్రశాంత్‌ కోసం అండగా భోలే మాత్రమే నిలబడ్డాడు. హౌస్‌లో కూడా ఆయన ప్రశాంత్‌ కోసమే బిగ్‌ బాస్‌కు వచ్చానని చెప్పాడు. బెయిల్‌ వచ్చిన సందర్భంగా భోలే మాట్లాడుతూ.. రైతుబిడ్డకి న్యాయం జరిగిందని తెలిపాడు. 15 వేల పూచీకత్తుతో పాటు రెండు షూరిటీల నిబంధనతో బెయిల్ మంజూరు చేయడం జరిగిందని తెలిపాడు. ప్రశాంత్ అరెస్ట్ అయిన 48 గంటల్లోనే బెయిల్ వచ్చేలా చేసిన అడ్వకేట్లకు ధన్యవాదాలు తెలిపాడు. అంతే కాకుండా నిష్పక్షపాతంగా తీర్పు ఇచ్చిన జడ్జీగారికి పాదాభివందనం తెలిపాడు.

Tags:    

Similar News