పోలింగ్ రోజే ఐఎండీ ఆరంజ్ అలర్ట్ జారీ

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ద్రోణి ప్రభావం వల్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు వెల్లడించారు. సోమవారం ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు.

Update: 2024-05-13 01:05 GMT
వర్షాల నేపథ్యంలో ఆరంజ్ అలర్ట్ జారీ

తెలంగాణలో సోమవారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ సోమవారం ఉదయం వెల్లడించింది.

- సోమవారం పార్లమెంట్ పోలింగ్ సందర్భంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో ఎన్నికల అధికారులు అప్రమత్తమయ్యారు.
- హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో రాగల 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
- వర్షాల కురవనున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ హైదరాబాద్‌లో భారీ వర్షపాతం హెచ్చరికను జారీ చేసింది. సహాయం కోసం 040-21111111 లేదా 9000113667 నంబర్లకు కాల్ చేయాలని ప్రజలకు సూచించింది.
- వర్షాలు కురవనున్న దృష్ట్యా ప్రజలు అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని దూరంగా ఉండాలని డైరెక్టరేట్ సూచించింది. ప్రజలు బయటకు వెళ్లాలంటే విద్యుత్‌ తీగలకు దూరంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది.
- పోలింగ్‌ సిబ్బందికి టెంట్లు, గొడుగులు ఏర్పాటు చేయాలని రిటర్నింగ్‌ అధికారులను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. వర్షం కురిస్తే రిటర్నింగ్‌ అధికారులతో సమన్వయం చేసుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ఈసీ ఆదేశించింది.

పలు జిల్లాల్లో వర్షాలు...ఐఎండీ వెల్లడి
ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, సూర్యాపేట జిల్లాల్లో సోమవారం ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37, 27 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది.


Tags:    

Similar News