విడదల రజనీకి లైన్‌ క్లియర్‌

గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గంలో ఏమి జరుగుతోంది?

Byline :  The Federal
Update: 2023-12-19 13:34 GMT
Vidala Rajani and Maddala Giri

అసమ్మతి సద్దు మణిగిందా? రాష్ట్రమంత్రి విడదల రజనీకి లైన్‌ క్లియరైందా? అసలింతకీ ఏం జరిగిందీ? వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే, విడదల రజనీ నాయకత్వాన్ని వ్యతిరేకించిన గుంటూరు ఎమ్మెల్యే మద్దాల గిరి ఎందుకు ఒప్పుకున్నారు. ఒక్కసారిగా విడదల రజనీకిజై అంటున్నారు ఎందుకు? ముఖ్యమంత్రి ఏమి తాయిలం పెట్టారు? సోమవారం ముఖ్యమంత్రిని కలిసిన తరువాత మద్దాల గిరి మనసు మార్చుకున్నారు. రజనీతో కలిసి నియోకవర్గంలో తిరుగుతున్నారు. ఆమెకు మద్దతు ప్రకటించారు.

గిరికి అవకాశం లేనట్లే..
గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీని ఇన్‌చార్జ్‌గా ప్రకటించడాన్ని అక్కడి ఎమ్మెల్యే మద్దాల గిరి ఇప్పటి వరకు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. వారం రోజుల క్రితం విడదల రజనీని నియోకవర్గ ఇన్‌చార్జ్‌గా సీఎం ప్రపకటించిన విషయం తెలిసిందే. మద్దాల గిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత వైఎస్సార్‌సీపీలోకి వెళ్లారు. ఇప్పటి వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేగానే చెలామని అయ్యారు. గెలిపించిన పార్టీని విడిచి వచ్చిన మద్దాల గిరికి వైఎస్సార్‌సీపీ చుక్కలు చూపిచింది. ఉన్నట్లుండి రజనీకి అవకావం కల్పిస్తున్నట్లు ప్రకటించడంతో ఎలాగైనా తాను ముఖ్యమంత్రిని కలవాల్సిందేనని పట్టుబట్టారు. ఈ మేరకు సోమవారం సీఎం జగన్‌ను కలిసారు. సీఎం మద్దాల గిరికి సీఎం ఏమి చెప్పారు? లోపలికి వెళ్లేటప్పుడు సీఎంపై తీవ్ర ఆగ్రహంతో వెళ్లిన గిరి బయటకు వచ్చిన తరువాత సీఎం ఎలా చెబితే అలా నడుచుకుంటానని చెబుతున్నారు. మంగళవారం సాయంత్రం నగరంలోని నియోజకవర్గ పరిధిలో ఉన్న మునిసిపల్‌ కార్పొరేటర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి విడదల రజనీ హాజరవుతున్నారు. మనం ఇక నుంచి కలిసి పనిచేయాలని, రజనీని గెలిపించాలని కార్పొరేటర్లకు ఉద్బోధ చేయనున్నారు. మంగళవారం ఉదయం ఆరోగ్యశ్రీ పథ«కం కింద వైద్యం చేయించుకునే వారికి రూ. 25 లక్షల వరకు ప్రభుత్వం ఖర్చు చేసేందుకు అవకావం కల్పిస్తూ సీఎం ప్రచారం కోసం కార్యక్రమాన్ని ప్రారంబించారు. ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ పథకం కింద రూ. 10లక్షల వరకు మాత్రమే వైద్యం చేసే వారు. ఇక నుంచి వైద్య ఖర్చును పెంచుతున్నారు. ఈ విషయమై ప్రజలకు వివరించేందుకు గుంటూరు వెస్ట్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనీతో పాటు మద్దాల గిరి కూడా పాల్గొన్నారు.

Delete Edit
పోటీకి రజనీ సిద్ధం..
విడదల రజనీ కూడా నియోకవర్గంలో పోటీకి సిద్దంగా ఉన్నట్లు వైఎస్సార్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాల వారు ఉన్నారు. ప్రధానంగా కమ్మ, రెడ్డి, వైశ్య, బీసీలు ఉన్నారు. కొద్ది మంది ముస్లిమ్‌ కమ్యునిటీ కూడా ఉంది. ఎవరు పోటీలో ఉన్నా బీసీలతో పాటు కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల మద్ధతు కూడా పూర్తిస్తాయిలో అవసరం.
కమ్మ సామాజికవర్గం రాజేంద్రనగర్, లక్ష్మీపురం, బృంధావన్‌ గార్డెన్స్, పట్టాభిపురం, శ్యామలనగర్, మారుతీనగర్, ఎస్‌వీఎన్‌ కాలనీ, విద్యానగర్, చంద్రమౌళి నగర్‌లో ఎక్కువగా ఉన్నారు. స్తంభాల గరువు, భాగ్యనర్‌ కాలనీ, ఎల్‌ఐసీ కాలనీ, నల్లబాడుల్లో రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారు.
తెలుగేదేశం పార్టీ నుంచి కోవెలమూడి రవింద్ర (నాని), భాష్యం ప్రవీణ్‌లు టిక్కెట్‌ కోసం పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లోనూ టీడీపీ గెలిచినందున వైఎస్సార్‌సీపీ తీవ్ర స్థాయిలో కరత్తు ప్రారంభించింది.


Tags:    

Similar News