చంద్రబాబునాయుడి పై దాఖలు చేసిన వారంట్లు చెల్లవు: కోర్టు
మాజీ సీఎం చంద్రబాబు నాయుడి బెయిల్ పై బయట ఉన్నందున ఇన్నర్ రింగ్ రోడ్(ఐఆర్ఆర్), ఫైబర్ నెట్ కేసులో ఏపీ సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లు చెల్లవని ఏసీబీ కోర్టు ప్రకటించింది. చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాంలో జైలులో ఉన్న సమయంలో ఏపీ సీఐడీ ఆయనను ఐఆర్ఆర్, ఫైబర్ నెట్ లో వందల కోట్ల అవినీతి జరిగిందనే ఫిర్యాదు మేరకు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేడు ఆ పిటిషన్ల పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టి పీటీ వారెంట్లను తిరస్కరించింది.
ఇదీ ఫైబర్ గ్రిడ్ కేసు
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఫైబర్ గ్రిడ్ పేరుతో రూ. 321 కోట్ల మేర కుంభకోణానికి పాల్పడ్డారని ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ ప్రాజెక్ట్ టెండర్ ను టెరాసాప్ట్ అనే కంపెనికీ అప్పగించారని ఇది చంద్రబాబునాయుడు అనుయాయులదని ప్రధాన అభియోగం. ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటేడ్ ఎండీ 2021లో ఫిర్యాదు మేరకు చంద్రబాబు నాయుడిపై సీఐడీ కేసు నమోదు చేసింది. అలాగే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు 41 ఏ సీఆర్పీసీ ప్రకారం నోటీసులు జారీ చేశారు.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు విషయాలు
చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నసమయంలో రాజధాని అమరావతి చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రణాళికలు వేశారు. అయితే ఇందులో క్విడ్ ప్రోకో చేసినట్లు సీఐడీ ప్రధాన ఆరోపణ. మాస్టర్ ప్లాన్, రింగ్ రోడ్డులో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మంత్రి పొంగూరు నారాయణ, చంద్రబాబు సన్నిహితులైన వ్యాపారవేత్తలు లింగమనేని కుటుంబం, రామకృష్ణ హౌసింగ్ కంపెనీకి చెందిన అంజనీకుమార్ సహ పలువురిపై కేసు నమోదు అయింది. అలాగే లోకేష్ పై సైతం కేసు నమోదు అయింది. హెరిటేజ్ సహ లింగమనేని కొన్నభూముల విలువ పెరగడానికి ఐఆర్ఆర్ అలైన్ మెంట్ మార్చారని ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి.