వామ్మో.. ఈ కుక్క ఖరీదు రూ.20 కోట్లా!
ఇది మామూలు శునకం కాదు. సినిమాల్లో నటిస్తుంది. విమానాల్లో తిరుగుతుంది. దేశదేశాల్లో పోటీలకు పోయివస్తుంది. 32 పతకాలు గెలిచింది.;
ఏ లంచం తీసుకోకుండా నిక్కచ్చిగా ఉద్యోగం చేసే సర్కారు ఉద్యోగి తన జీవిత కాలంలో సంపాయించే మొత్తం మహా అయితే ఓ 50 లక్షలో, మహా అయితే కోటి రూపాయలో ఉంటాయి. ఉంటే ఓ డబుల్ బెడ్ రూం ఇల్లు కూడా కొనుక్కుని ఉండవచ్చు. పిల్లలు ఏ అమెరికాలో మరేదైనా దేశంలోనో ఉంటే మహాఅయితే ఓ విల్లా, ఓ మంచి కారు కూడా కొనుక్కుంటాడు. కానీ ఇక్కడో సినీనటుడు ఏకంగా 20 కోట్లు పెట్టి కుక్కుపిల్లను కొని ముద్దు చేస్తున్నాడు. హైదరాబాద్ లో జరగబోయే కుక్కల ప్రదర్శనకు తీసుకువచ్చారు ఆ నటుడు. ఆయన పేరు సతీశ్. బెంగళూరు. ఇండియన్ డాగ్ బ్రీడర్ అసోసియేషన్ అధ్యక్షుడు.
అత్యంత ఖరీదు ఈ కుక్కపిల్ల..
కుక్కల జాతుల్లో మేటి కాకాసియన్ షెపెర్డ్ (caucasian shepherd). బోలెడంత ఖరీదైంది. అటువంటి కాకాసియన్ షెపెర్డ్ హైదరాబాద్ లోని మియాపూర్‌లో సందడి చేసింది. మియాపూర్‌లోని ఓ పెట్ ఆస్పత్రికి ఆరోగ్య పరీక్షల కోసం వచ్చింది. కన్నడ నటుడు నటుడు సతీశ్ ఈ కాకాసియన్ షెపెర్డ్ శునకాన్ని రూ.20కోట్లకు కొన్నారట. దాని పేరు కాడాబామ్ హైడర్. ఇది మామూలు శునకం కాదు. సినిమాల్లో నటిస్తుంది. విమానాల్లో తిరుగుతుంది. దేశదేశాల్లో పోటీలకు పోయివస్తుంది. 32 పతకాలు గెలిచింది. హైదరాబాద్ డాగ్ షో కోసం నగరానికి వచ్చింది. రొటీన్ చెకప్ కోసం కాడాబామ్ హైడర్ మియాపూర్‌కు వస్తుందని తెలియడంతో దాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు. దానితో సెల్ఫీల కోసం పోటీపడ్డారు.
నా దగ్గర కోట్ల విలువైన కుక్కులు బోలెడున్నాయి..
‘నాకు శునకాలంటే చాలా ఇష్టం. అనేక జాతుల కుక్క పిల్లలు నా దగ్గరున్నాయి. కోట్లు పెట్టి కొంటుంటా. ఇప్పటికే రూ.10కోట్ల టిబెటన్ మస్తిఫ్, రూ.8కోట్ల అలస్కన్ మాలామ్యూట్, రూ.కోటి విలువైన కొరియన్ డోసా మస్తిఫ్ జాతి కుక్కలున్నాయి. అంతెందుకు పెట్టి కొట్టానంటే కుక్కలంటే నాకిష్టం. అంతే, నాకవి మహారాజులు” అంటారు సతీశ్. ఏదైతేనే 20 కోట్ల రూపాయల విలువైన కుక్కపిల్లని టికెట్ చూడగలిగామని సంతోషపడ్డారు మియాపూర్ వాసులు.