గూగుల్ మ్యాప్‌లో ఈ మార్పేంటి?

గూగుల్ మ్యాప్ కొత్తగా కనిపిస్తుందేంటి? నా మొబైల్‌లోనే ఇలా కనిపిస్తుందా? అని ఆశ్చర్యపోకండి.. రీసెంట్‌ అప్‌డేట్ వల్లే మ్యాప్‌లో ఈ కలర్ ఛేంజ్

Update: 2023-11-29 19:03 GMT

(Venkat. Mahankali - 9441089555) 

టెక్నాలజీలో మార్పులు సహజం. కొత్త ఫీచర్స్‌ యాడ్‌ అవుతూ ఉంటాయి. యాప్‌ల విషయానికొస్తే వాటిని అప్పుడప్పుడు అప్‌డేట్‌ చేస్తుంటారు.

ఈ క్రమంలోనే ఇటీవల గూగుల్‌ మ్యాప్‌ రంగుమారింది. గతంలో రోడ్లు తెలుపు, పసుపు రంగుల్లో కనిపించేవి. ప్రస్తుతం గ్రే షేడ్‌ (బూడిద వర్ణం)లో కనిపిస్తున్నాయి.గతవారం రోజుల నుంచి ఈ మార్పు కనిపిస్తుంది.

రంగుల్లో మార్పులుంటాయని గూగుల్‌ అక్టోబర్‌లో వెల్లడిరచింది. కాగా ఈ కొత్త అప్‌డేట్‌ను కొంతమంది స్వాగతిస్తుండగా.. ఇంకొందరు బాగోలేదంటున్నారు. మార్చిన రంగులు ప్రకాశవంతంగా లేవని, స్పష్టంగా కనిపించడం లేదంటున్నారు.

15 ఏళ్ల క్రితం గూగుల్‌ మ్యాప్‌ డిజైనింగ్‌ టీంలో పనిచేసిన డిజైనర్‌ ఎలిజబెత్‌ లారా ఈ కొత్త అప్‌డేట్‌పై తన ఎక్స్‌ (ట్విటర్‌)లో కామెంట్‌ చేశారు. ‘‘రోడ్లన్నీ గ్రే కలర్‌లో కనిపిస్తున్నాయి. నీళ్ల రంగు నీలం నుంచి టీల్‌ వర్ణానికి మార్చారు. పార్కులు, ఖాళీ ప్రదేశాలు మింట్‌ గ్రీన్‌లో ఉన్నాయ’’న్నారు.

పార్కులు, నీళ్ల రంగు మార్పుపై ఆమె టీం సభ్యులతో చర్చించారు. రోడ్ల రంగు బాగున్నా..నీరు, ఖాళీ ప్రదేశాలు, పార్కుల రంగులు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. విసిబిలిటీ, రీడబులిటీ కోసం ఈ మార్పు తెచ్చినట్లుంది. స్వల్ప మార్పులుంటే బాగుండేదన్నారు.

కొత్త ఫీచర్‌ అప్‌డేట్‌ చేయాలంటే చాలా మార్గాలున్నాయి. సెర్చ్‌ బాక్స్‌, బాటమ్‌ ట్యాబ్‌ మినహా మిగతావన్ని తీసెయొచ్చని.. నమూనా డిజైన్‌ ఆమె షేర్‌ చేశారు. యాప్‌ సింపుల్‌గా ఉండాలంటూనే.. ‘గూగుల్‌’ మ్యాప్‌ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వస్తుందని తన ట్వీట్‌ను ముగించారు. 

Tags:    

Similar News