ఊటీ, కొడైకెనాల్‌ వెళ్తున్నారా? అయితే ఈ పాస్ తప్పనిసరి..

ఈ వేసవిలో ఊటీ, కొడైకెనాల్ వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ పాస్ తీసుకోవాల్సిందే. ఈ విధానాన్ని మే 7 నుంచి జూన్ 30 వరకు అమలు చేయాలని మద్రాసు కోర్టు ఆదేశించింది.

Update: 2024-05-06 08:41 GMT

మనదేశంలో పర్యాటకులను ఎక్కువగా ఆకట్టుకుంటున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. కొడైకెనాల్, ఊటీ అందాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో వస్తుంటారు. వేసవి సెలవుల్లోయితే పర్యాటకుల సంఖ్య మరింత ఎక్కువ.

పర్యావరణ పరిరక్షణపై ఇటీవల దాఖలయిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు విచారించింది. ఒకే సమయంలో అన్ని వాహనాలు కొండ ప్రాంతాలకు వెళ్తే ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. జంతువులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ వాదనలతో అంగీకరించిన కోర్టు పర్యాటకుల సంఖ్యను నియంత్రించేందుకు ఈ-పాస్ విధానాన్ని మే 7 నుంచి జూన్ 30 వరకు అమలు చేయాలని నీలగిరి, దిండిగుల్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. కోర్టు నిర్ణయాన్ని పర్యావరణ ప్రేమికులు స్వాగతిస్తున్నారు.

ఇ-పాస్ ఎలా పొందాలి?

మొదటగా epass.tnega.org వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. పర్యాటకులు లేదా వాణిజ్య వాహనాల యజమానులు వారి ఫోన్ నంబర్‌ను ఎంట్రీ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీసీ ఎంట్రీ చేసి వెళ్లాల్సిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. తర్వాత అప్లికెంట్ పేరు, పర్పస్ ఆఫ్ విసిట్, వెహికల్ నంబర్, పర్యాటకుల సంఖ్య, డేట్ ఆఫ్ ఎంట్రీ, డేట్ ఆఫ్ ఎగ్జిట్, అడ్రస్సును భర్తీ చేయాలి. విదేశీ పర్యాటకుల అయితే ఈ మెయిల్ ఐడిని ఉపయోగించి వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

వివరాలు భర్తీ చేయడం పూర్తయితే ఒక QR కోడ్‌ మీ ఫోన్‌కు వస్తుంది. దాన్ని ఎంట్రీ పాయింట్‌లో చూయిస్తే మిమ్మల్ని అనుమతిస్తారు. ఒకే వాహనంలో ఎక్కువ మంది ప్రయాణిస్తే, అందరూ పాస్ పొందాల్సిన అవసరం లేదు. పర్యాటకుల సంఖ్యపై కూడా ఎలాంటి పరిమితి లేదు. ఇ-పాస్‌ను ఎన్నిసార్లయినా పొందవచ్చు. బస్సుల్లో ప్రయాణించే వారు ఈ-పాస్‌ల కోసం దరఖాస్తు చేసుకోనవసరం లేదు. స్థానికంగా నివాసం ఉండే వారు ఈ పాసు తీసుకోనక్కర్లేదు.

Tags:    

Similar News