నిర్బంధ" విద్యతో యుద్ధం !
పుష్యమీ సాగర్ 'హాస్టల్ లైఫ్' పుస్తక సమీక్ష;
By : The Federal
Update: 2025-07-06 02:34 GMT
-పుష్యమీ సాగర్
"ప్రపంచాన్ని మార్చాలి అంటే శక్తివంతమైన ఆయుధం చదువు" , ఆ చదువు కోసం ఒక దళిత విద్యార్థి ఎన్ని కష్టాలు అనుభవించాడు అనేదే ఈ ‘హాస్టల్ లైఫ్’ పుస్తకం.
Education is not preparation for life; education is life itself.” According to Dewey, democracy and education are two sides of the same coin.
ఈ వ్యవస్థ లో దళితుడి చదువు ఎంత వేదనాభరితం గా ఉంటుందో కళ్ళ ముందు దృశ్య మానం గా చూపించే దే ఈ పుస్తకం.
"ఆరగొలను " హాస్టల్ లో చిన్న కుర్రాడి మానసిక సంఘర్షణ కి అక్షర రూపం. మోషే మోహన్ బాల్యం లోకి వెళ్లి చూస్తే సంతోషం కంటే కష్టాలే ఎక్కువ ఉంటాయి "హాస్టల్ లైఫ్" అందరికి వడ్డించిన విస్తరి కాదు ....
ఆర్టికల్ ఇరవై తొమ్మిది మరియు ముప్పై ప్రకారం షెడ్యూల్ కాస్ట్ వారికి విద్యా హక్కులు లభిస్తాయి. రాజ్యాంగం లో పొందుపరిచినా "నిర్బంధ" ఉచిత విద్య గురుకుల సంక్షేమ పాఠశాల్లో ఎలా అమలు పరచబడ్డాయి. నరకానికి నకళ్ళు అన్నట్టు గా ఉంటాయి అని మోహన్ రాసిన ప్రతి అక్షరం లో కనపడుతుంది.
భావోద్వేగ కారక శక్తి (Pathos) రచనలో వ్యక్తుల్ని భావోద్వేగం తో కదిలించే గుణం లేదా శక్తి. ఈ హాస్టల్ఆ లైఫ్ లో ని ప్రతి ఒక్క కధనం నిజంగా మనల్ని కదిలిస్తుంది, కన్నీళ్లు పెట్టిస్తుంది. చదువు ఇంత భయంకరం గా ఉంటుందా అని అనుకోకుండా ఉండలేము.
రచనా ధోరణి (వాయిస్) . తనలోని బాధ ని వ్యక్తీకరించిన తీరు, వాడిన మాండలిక (dilect) సొగసు పాఠకుల్ని కట్టి పడేస్తుంది.
తానూ/తోటి సహవాసగాళ్లు ఎంతో అభిమానించే లేడీ టీచర్ కి రాసిన బూతు లెటర్ ఎంత కలకలం రేపిందో, రాసిన వాడు కనిపెట్టలేక పోయినా "మగ మాస్టార్ల" పురుషాధిక్యత చివరికి ట్రాన్స్ఫర్ చేసుకొని వెళ్లిపోయేలా చేస్తుంది.
తాను చెప్పాలి అనుకున్నది పెద్ద పెద్ద పదాల్లో ఎవరికీ అర్ధం కాకుండా రాయకుండా, రచన భాష (literary language) వ్యహారానికి బిన్నం గా కాకుండా సులభ రీతి లో పిల్లాడి కూడా అర్ధం అయ్యేలా రాయడం ఒక కళ అది మోహన్ బాగా పట్టుకున్నాడు.
హాస్టల్ లైఫ్ అందులో షెడ్యూల్ కులాల హాస్టల్ లో మనం అనుకునేంత సుఖం గా ఉండదు. ఆధిపత్య పోరు, పసితనాన్ని చిదిమేసే దుర్మార్గం, అమ్మ వోడి నుంచి బడి కి వెళ్తున్నామా జైలు కి వెళ్తున్నామా అనే సంఘర్షణ ఒక్క చోట కూర్చోనివ్వదు అందుకే "first escape/second escape" లో ఎన్ని రకాలు గా జైలు నుంచి పారిపోదాం అనుకున్న మళ్ళీ అందులోకి వచ్చి పడతాడు.
లైంగిక దాడి (sexual assult) ..కేవలం ఆడాళ్ళ పై జరుగుతుంది అనుకుంటాం కదా కానీ ఇక్కడ మాత్రం పసి బాలుడి పై పై తరగతి వాళ్ళు జరిపిన అత్యాచారానికి హాస్టల్ అంతటా "హోమో " అనిపించుకుంటూ అవమాన పడి చివరికి రైలు పట్టాల మీద తనువు చాలించిన "సురేషు " . మనకి తెలియని ఎంతమంది సురేష్ లో (గుర్తు తెలిసిన శవం) ...
Sigmond Freudism (Frayidism ) ప్రాయిడ్ వాదం ప్రకారం "మానవ అచేతనం లో నిక్షిప్తమైన అనుభవాలే మానవ ప్రవర్తన ని నిర్ధేస్తాయి". చేతన స్థితి లో మానవుడి కి ఈ అనుభవాలు గుర్తు ఉండవు .. కానీ మోషే మోహన్ తన బాల్యపు చేదు అనుభవాల్ని చేతనం లో మర్చిపోలేదు /అచేతనం లో కూడా కలవరింపులకి గురి చేసే సంఘటనల్ని అక్షర బద్ధం చేసాడు.
ప్రతి ఆదివారం తల్లి తండ్రులు పిల్లలని చూడడటానికి వచ్చేప్పుడు తెచ్చే తినుబండారాలు వారం అంతా తింటారు. పురుగులు/పే డ పురుగులు కనిపించే అన్నం తినలేని దీన స్థితి నుంచి ఊరట. "రెబల్ స్టార్ట్ సుందరమ్మ" లో నాయనమ్మ అన్ని మైళ్ళు నడిచివచ్చి ఇంటికి తిరిగివెళ్ళలేని నిస్సహాయత హాస్టల్ లో ఉండిపోవాల్సి వస్తే. వాచ్మాన్ తో కోట్లాడీ ప్రిన్సిపాల్ ని ఒప్పించి మనవడి దగ్గర ఉన్న తీరు/తరువాత వచ్చిన వారు అంతా అదే ఫాలో కావడం గొప్ప మార్పు కి సంకేతం.
క్రమ"శిక్ష"ణ లో ఉదయం ఐదింటికి మొదలయ్యే శిక్ష రాత్రి పది దాకా మాస్టార్ల దెబ్బలతో నే సరిపోతుంది . నీళ్ల ట్యాంకు దగ్గర స్నానం చెయ్యడం ఒక యుద్ధం తోనే సమానం. గురుకుల హాస్టల్ లో సుగుణ రావు, ఉండే శ్రీనివాస్ రావు గారి లాంటివారు అరుదు ఎందుకు అంత సహానుభూతి అంటే, వాళ్ళు కూడా గురుకుల పాఠశాల లోనే చదివారు కాబట్టి ఆ emphathy ఉంటుంది సహజంగానే.. అయితే ఈ కోవా లో జాన్ వెస్లీ లాంటి తమ జాతికి సంబందించిన వాళ్లు కూడా పీడించడం మింగుడుపడని విషయము అని, వారితో పాటు గా మిగతావారు అంతా మాదిగవాళ్ళని వాళ్ళ బతుకు ని ఉద్దరించడానికి వచ్చినవాళ్లే అని ఫీల్ అవుతారు అని ఘాటుగానే చురకలు వేస్తాడు.
ఏ నీళ్ల కోసం బాబా సాహెబ్ అంబెడ్కర్ గారు :"మహద్ సంగ్రామం " చేసారో అలాంటి ఒక యుద్ధమే చెయ్యాల్సి వస్తుంది నీళ్ల కోసం మరి ఆ నీళ్ల కోసం " చినలంజి దిబ్బ" కు నీళ్లు కోసం పరిగెత్తినప్పుడు డోక్కుకుపోయిన మోకాలి చిప్పలు గుర్తు కు వస్తే అయ్యో అనిపించకమానదు ..అక్కడ పెదకాపు గారి మోటార్ పంపు ఏ వాళ్ళకి .
"ఆదివారాలు " ఎప్పుడైనా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు తనకి తగిలిన దెబ్బలికి కాకుండా అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ నవ్వాపాలెం వెళ్లడం చూసి మనకి కూడా కళ్ళు చెమర్చుతాయి, ఇంకా అందులోనే ఓ చోట అమ్మ అంటుంది . మీరు కొట్టి సంపేత్తారు అని కనలేదు సారూ గారు మేము మా బిడ్డల్ని. మా గత్యంతరం బాగోక ఇక్కడ వదిలేశాం " అన్నప్పుడు ఏ తల్లి మరోసారి ఈ సంక్షేమ గురుకుల పాఠశాల్లో వెయ్యొద్దు అనే అనుకుంటుంది.
బలవంతుడు ఎప్పుడూ బలహీనుడి ని తొక్కేస్తూ పైకి వెళ్తూనే ఉంటాడు . గెలిచే దమ్ము లేనప్పుడు బాధితుడు అవుతాడు ..ఇంటర్మీడియట్ వాళ్ళు టెన్త్ వాళ్ళు మధ్య లైన్ లో జొరబడి తనదాకా బువ్వ రానివ్వనప్పుడు ఆ పురుగుల అన్నానికి ఆకలి కి నక నకలా డుతుంటే అమ్మిరాజు గాడు అమ్మ లా ఆదరించి ఆదుకుంటాడు. అలాంటోడు ఒక్కడైనా ఉంటె మోషే లాంటి పిల్లలు ప్రేమ కి బదులు గా ద్వేషాన్ని పెంచుకుంటారు.
కొత్త గా పెట్టిన ఫోను డబ్బా నుంచి అమ్మ కి ఫోన్ చేస్తున్నప్పుడు ఎంత ఆనందమో స్వరాజ్యాన్ని చూసినప్పుడు అంతే ఆనందం ....తెలిసి తెలియని వయసులో ఆకర్షణ లో ఎవరైనా పడాల్సిందే. అలా స్వరాజ్యం మాయలో పడినా, చివరి పరీక్షల్లో వెనక కూర్చొని ఏడిపించిన , కూడా కోమటి వారి అమ్మాయి జీవితం లో ఎప్పటికి గుర్తు ఉండే పోయే స్వరాజ్యం నా జన్మ హక్కే అని ప్రకటించేస్తాడు.
చివరి పార్ట్ లో పరీక్షల్లో గుమస్తా గారి అమ్మాయి మమతా కి చూపించనప్పుడు పాస్ అవ్వడమే గొప్ప అనే స్థితి నుంచి ఫస్ట్ క్లాస్ వచ్చాక ..కనీసం అభినందన కోసం అని గుమస్తా క్వాటర్స్ కి వెళ్లిన మోషే కి ఎదురైనా అనుభవం ..ఎప్పటికైనా అగ్ర కులం అగ్రకులమే .....తానూ చూపించాను కనీసం కృతజ్ఞత అన్న ఉంటుంది అన్న మోషే ఆలోచన కి నిరాశనే ..అవును మరి వాళ్ళని వాళ్ళ బరువుల్ని, భయాల్ని మోయాల్సి నుండి దళితుడే కదా...
చివర్లో మోషే స్వగతం లో అనుకున్న వాక్యాలు మాత్రం వెంటాడుతూ ఉంటాయి "ఇలా అనుకుంటాడు.
"నా పేపర్ చూసి రాసినంత మాత్రానా ఆ పిల్ల మాలదైపోద్దా, 503 మార్కులు వచ్చినంత మాత్రాన నేను పిల్లల బాపనోన్ని ఐపోతానా " నిజమే మనిషి చేసిన సహాయం పట్ల కనీసం కృతజ్ఞత ఉండాలి అదే లోపించింది కదా.
ఇంకా ఈ చిన్ని పుస్తకం లో "రాక్షసుడు" "చిన్నవారి క్రిస్మస్ -పెద్ద వారి క్రిస్మస్ " తాల్ పే తాల్ మిలా " వసంతం" లాంటివి ఉన్నాయి ఇవన్నీ కూడా ఏకబిగిన చదివిస్తాయి. ముఖ్యం గా గోదావరి జిల్లాలో ఊరు ఊరు కి మారి పోయే మాండలికాలు (ఆరుగొలను) అద్భుతం అనిపించక మానదు.
స్వాతంత్య్రం వచ్చి డెబ్భై వసంతాలు దాటినా ఇంకా దళిత హాస్టల్ లో ఆ మాటకి వస్తే సంక్షేమ గురుకుల పాఠశాలలో పురుగుల అన్నం తిని అడ్డం పడటం, చనిపోవడం వంటి వార్తలు వినాల్సి రావడం దారుణ. నాణ్యమైన విద్యని/కనీసం ఆహారాన్ని అందించలేకపోయిన వ్యవస్థల అవినీతి ని ఖాండ్రించి ఉమ్మేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తాడు మోషే. రాజ్యాంగ బద్ధం గా హక్కు గా రావలసిన వాటి కోసం యుద్ధం చెయ్యాల్సి రావడం విషాదం లో కెల్లా అతి విషాదం.
"There is no end for this discrimination world until you fight for your rights."
పేద విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల్లో ఇలా ఎందుకు ఉన్నాయి అని ప్రశ్న వేసుకుంటే అలక్ష్యం/నిర్లక్ష్యం ఒక కారణం అయితే, అవినీతి మరో ముద్దాయి . వీటి పైన కూడా ఇంకొక మంచి పుస్తకాన్ని తీసుకువస్తాడు అని భావిద్దాం.
(పుష్యమీ సాగర్ కవి, రచయిత, విమర్శకుడు)