పడకలేదు, వాలు కుర్చీలేదు, అంతా నడకే... ఆయన్ని నడిపించింది

ధోతీ పైకి ఎగదోపుకుని కర్రచేతపట్టి నడుస్తూ ఫోటోలలో బలహీనంగా కనపడతాడు. ఆయన మానసికంగా శారీరకంగా బలిష్టుడు. అలసట ఎరుగడు. ఆయన నడకలో ఎపుడూ నీరసం కనిపించదు.

Update: 2024-08-25 11:32 GMT


గాంధీజీ బొమ్మలను జాగ్రత్తగా గమనించారా. ఆయన ఫోటోలలో  ఎక్కువ నడుస్తున్నవే ఉంటాయి. నడకకు ఆయన చాలా ప్రాముఖ్యం ఇచ్చాడు. కారణం. నడక ఫిట్ నెస్ కు మార్గం అని నమ్మే వాడు. గాంధీజీ జీవితంలో రెండు విషయాలకు చాలా ప్రాముఖ్యం ఇచ్చే వాడు. అవి ఫిజికల్ ఫిట్ నెస్, సమతౌల్యాహరం.

ఫిజికల్ ఫిట్ నెస్ కోసమే ఆయన రోజూ 18 కిమీ దాకా నడిచేవాడు. ఇలా తన జీవితంలో నలభై సంవత్సరాలు నడిచాడు. 1913నుంచి 1948 దాకా ఆయన నడిచిదూరమెంతో తెలుసా? 79,000 కిమీ. ఇది భూమి చుట్టు రెండు సార్లు నడిచినంత దూరం. ఆహార నియమాలను గాంధీజి చాలా కఠినంగా పాటించేవారు.మితాహరం ఆయన పద్ధతి. స్వీట్లు తీసుకునేవారు. చక్కెరకంటే బెల్లం మంచిదని నమ్మేవారు.  దానిని కూడా చాలా తక్కువగా తీసుకోవాలంటారు. గాంధీజీ బరువు 45.35 కేజీలు. ఎత్తు 5. 5 అడుగులు. కొన్ని చోట్ల 5.4 అడుగులని రాశారు. ఆయన దేశమంతా పర్యటించాడు. ప్రధానంగా రైలులో ప్రయాణించేవాడు. చిన్నదూరాలనయితే, కాలినడకే వెళ్లేవాడు.

నడక ఆయన లండన్ లో న్యాయ శాస్తం చదవుతున్నపుడే అలవాటు అయింది. మొదట్లో ఆయన ఒక ఇంగ్లీష్ కుటుంబంలో పేయింగ్ గెస్టుగా వుండేవాడు. అయితే, తర్వాత డబ్బులు కొరత వచ్చింది. ఆయన రెండు పనులుచేశాడు. మొదటిది అక్కడి నుంచి మరొక ఇంటికి మారి స్వతంత్రంగా బతకడం. రెండోది కాలేజీకి నడుచుకుంటూ పోవడం.ఇలా ఆయన నడక ఆయన జీవితంలోకి ప్రవేశించి తిరిగివెళ్లనే లేదు. న్యాయశాస్త్రం చదవి బొంబాయి వచ్చి ప్రాక్టీసు మొదలుపెట్టాడు. అపుడాయన గీర్గావ్ ప్రాంతంలో ఉండేవాడు. హైకోర్టుకు ఎపుడూ నడుచుకుంటూ వెళ్లేవాడు. ట్రామ్ ఎపుడూ ఎక్కలేదు. తన గది నుంచి కోర్టుకు చేరుకునేందుకు 45 నిమిషాలు పట్టేది. ఆయన చారిత్రాత్మక నడక దండి సత్యాగ్రహం యాత్ర. అప్పటికి ఆయన వయసు అరవై దాటింది. అయినా లేక్క చేయలేదు. 1931లో సబర్మతీ ఆశ్రమం నుంచి 24 రోజులు 386 కి. మీ నడిచి దండి చేరుకుని ఉప్పుసత్యాగ్రహం చేశారు.

పైకి బక్కపల్చగా ఉంటాడు. ఏదో ధోతీ పైకి ఎగదోపుకుని కర్రచేతపట్టి నడుస్తూ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలలో బాగా బలహీనంగా కనపడతాడు.  అయితే, ఆయన మానసికంగా చాలా బలిష్టుడు. శారీరకంగా మంచి ఆరోగ్యవంతుడు. అలసిపోయాననే మాట ఆయన ఎపుడూ ప్రయోగించడు.ఆయన నడకలో ఎపుడూ నీరసం కనిపించదు. ఒక సారి గమనించండి.

ఆని ఆయనకు జబ్బులేవీ రాలేదనుకోవడానికి వీల్లేదు. జబ్బున బారిపడ్డారు. చికిత్స చేయించుకున్నారు. మళ్లీ మామూలు మనిషయిన తర్వాత తన నడక కొనసాగించేవారు.1914లో ఛాతీలోపల కండరాలు వాపు నొప్పి (Pleurisy)తో బాధపడ్డారు. 1925,1936,1944లో మలేరియా బారిన పడ్డారు.(అందుకే మలేరియా నిర్మూలన మీద ఆయన చాలా శ్రద్ధ చూపే వారు), గ్యాస్ట్రిక్ ఫ్లూ (1939), ఇన్ ఫ్లుయెంజా (1945)లతో బాధపడ్డారు. 1919లో పైల్స్ కి ఆరేషన్ జరిగింది. 1924లో అపెండిసైటిస్ తో బాధపడ్డారు. ఇలా పెద్ద సమస్యలెన్ని వచ్చినా ఆయన చాలా తొందరగా వేగంగా కోలుకునేవారు. దీనికి కారణం ఆయనకు జీవన శైలి విషయంలో క్రమశిక్షణ పాటించడమేనని డాక్టర్లు చెబుతున్నారు.

గాంధీజీ న్యాచురోపతి (ప్రకృతి వైద్యం) అనుసరించే వారు. అయితే, ఆయనెపుడు ఆల్లోపతిని తిరస్కరించలేదు. తాను గా మాత్రం ప్రకృతి వైద్యం నమ్మేవారు,ప్రాక్టీస్ చేసే వారు. ఆది తనకు హామీ అని చెప్పేవారు.

దీని వెనక మనిషి ఆరోగ్యం గురించిన ఆయన ఉన్న అవగాహనే కారణం. మనిషి సహన ప్రాకృతిక సూత్రాల ప్రకారమే జీవించాలి. ఈ నియమాలను ఉల్లఘించినపుడు, దీనిని సరిచేసుకునేందుకు ప్రకతి ప్రయత్నస్తుంది.దాదాపు 50 సంవత్సరాలు ఆయన న్యాచురోపతి మీద ఆధారపడి జీవించారు. అయితే, ఆయన ఆల్లోపతికి గాని, వైద్యులను సంప్రదించడానికి గాని వ్యతిరేకం కాదు.

శాస్త్రవేత్త బలరామ్ డాక్టర్ భార్గవ మాటల్లో చెప్పాలంటే, ‘గాంధీ ఏ ఆరోగ్యచికిత్స వ్యవస్థకు వ్యతిరేకంగా కాదు. ఆయన సిద్ధాంతమంతా రోగాలు రాకుండా జాగ్రత్త పడం, అందరికి వైద్యం అందుబాటులో ఉండటం.


Tags:    

Similar News