" కారును " మాట్లాడుతున్నాను

ఇన్నాళ్ళు రయ్యు.. రయ్యు మని తిరిగి ఇప్పుడు పరివారమంతా కలిసి షెడ్డుకు తీసుకొచ్చారు.;

Update: 2025-08-27 03:06 GMT

    2023 డిసెంబర్ చివరి వారంలో కారు' కూసి కూసి' అయిపోయి షెడ్ రిపేరు కోసం వచ్చిన ఇన్ని నాళ్ళు షికారు జామ్మంటూ తిరిగిన కారును నేను వ్యూహాత్మక మౌనం పాటించలేక మాట్లాడుతున్నాను. తీసుకువచ్చిన యజమాని మరియు అందులో ప్రయాణించిన ఆయన పరివారం కలిసి నెట్టుకుంటూ తీసుకొచ్చి తొందరగా రిపేర్ చేసి ఇవ్వమని నన్ను ఇక్కడ ఇచ్చి పోయారు. తొందర పెట్టాడు. కానీ మెకానిక్ అటు సదిరి ఇటు సదిరి ఎంత స్టార్ట్ చేసిన స్టార్ట్ కానీ కారు ఇప్పట్లో సరి కాదని తెగేసి చెప్పాడు. చేసేది ఏమీ లేక విక్రమార్కుడు చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజం మీద మోసుకుంటూ కాళ్లు ఈడ్చుకుంటూ ఎవరి మనసులో వారు ఎంత పని అయిందని స్వగతం లో గనుక్కుంటూ ఫామ్ హౌస్ లోకి ప్రవేశం చేశారు.

తమతో పాటు రిపేర్ కోసం వచ్చిన కార్లు సరిచేసుకొని దవాఖాన లో చేరి డిశ్చార్జ్ అయిన పేషెంట్ లా పోతూ ఉన్నాయి. కానీ మెకానిక్ ఎంత ప్రయత్నం చేసినా నేను ఒక పట్టాన రిపేరు కావడం లేదు. ఇప్పట్లో అయ్యేలాగా కనిపించడమూ లేదు. ఇక ఇప్పటిలో రిపేరు సాధ్యం కాదని మెకానిక్ లోపల షెడ్డులో నన్ను పడుకోమన్నాడు.

షెడ్డు అంతా రిపేర్ నేర్చుకునే పిల్లలతో మెకానిక్ గట్టిగా పనుల గురించి మాట్లాడే మాటలు తప్ప నా చెవులకు మరొకటి వినిపించడం లేదు. ఎన్నో సంవత్సరాలు మౌనం వహించిన నాకు ఓపిక నశించి మాట్లాడడం షురూ చేసాను. ఇంతకాలం నోరు మూసుకున్న నేను ఇప్పుడైనా నిజాలు చెప్పాలని సంకల్పించుకున్నాను. బాగా తిన్న మనిషి పడుకున్నప్పుడు ఆయన బాగా తిన్న మనిషి ఉదరంపై చేరి అన్ని శరీర అవయవాలు కలిసి సభ పెట్టుకున్నట్టు నేను పడుకోగానే నా విడిభాగాలు ఒక్కొక్కటిగా మాట్లాడుతున్నాయి. వాటి గోడు ను అవే చెప్పుకుంటున్నాయి .

స్టీరింగ్:- వాహన చోదకుడు దిగి పోగానే తప్పనిసరై ఇన్నొద్దులు పడిన బాధను నాకు నేనే స్టీరింగును నాలుగు ముచ్చట్లు మీతో పంచుకోవాలని మాట్లాడుతున్నాను. యజమాని కుటుంబ పరివారంతో ఓవర్ లోడైనా కుల్యూమర్ కుయ్యో మొర్రో మొత్తుకుంటూ నా చెవులు ఎటు మెలేసిన అటు తిరుగాను. కార్యనిర్వాహక డ్రైవర్ తనకు ఎవరూ ఎదురు లేరని సాటి రారని కారని కన్నూ మిన్నూ కానక ఇన్నాళ్లు నడిపాడు. అహం అహంకారం వెంటరాగా కచ్చా రోడ్డు తారు రోడ్డు అనకొండా అన్ని దారుల్లో చల్ మోహనరంగా ఈలవేస్తూ ఉయ్యాలలో వేసి జోల పాడినట్టు మస్తు మజా ఉడాయించాడు . ముందట ఐదేళ్లకోసారి పాన గండం ఉందనే విషయం మరిచి పక్కన ఉన్న అపాయం బోర్డును అయితే ఖాతర్ చేయక ఆ దారిలో ప్రయాణించాడు. అనుభవించిన అన్నిటి మూల్యం ఫలంగా యాక్సిడెంట్ చేశాడు. యజమాని ఎవరిని కలవక బిజీ ఉందనే సాకుతో ఇతరులను కలువనీయక గడిలో కాలూపుకుంటూ విశ్రాంతి తీసుకున్నాడు. అనుకున్నట్టుగానే ఆయన ఈ రేసు కేసులో విచారణను ఎదుర్కొంటున్నాడు. ఊహించని ఎదురుదెబ్బ తగిలేసరికి వెర్రి లేసిన సాదుకం కుక్కలా తీవ్ర అసహనంతో ఎవరినైనా చిన్నా పెద్దా తేడ లేకుండా మాటలు తూలనాడుతున్నాడు. ఈయనకు కాలు జారితే వెంటనే తీసుకోవచ్చు కానీ మాట జారితే తీసుకోవాలని విషయం ఎన్నడు బోధపడి జ్ఞానోదయం అవుతుందో నాకు మాత్రం ఇంత జరిగాక కూడా తెలవదు. తొండ తొండ విడిదాక నీ పయనం అంటే కోర్టులాకి ఎనుగుల దాకా అన్నట్టు ఈయన తరీక ఉంటుంది. మేకపోతూ గాంబీర్యంలా అరెస్ట్ చేసుకుంటే చేసుకోని నేను జైల్లో యోగా చేసుకుంటా అని చివరికి కోర్టు మెట్లు ఎక్కాడు.

ముందు టైర్లు:- ఇది స్టీరింగ్ ఇలా తన కథ చెప్పుకుంటూ దమ్ము తీసుకుందో లేదో ముందటి ఒకటో టైరు తన వేదనను లోపల ఉంచుకోలేక బయటకు చెప్పుకోలేక మసిలిపోయి చెప్తున్నాను. ఏమీ కానప్పుడే ఎక్కడ ఎన్నిక కానప్పుడే మంత్రిని చేసినాను. ఉద్యమ కాలంలో ఆంధ్ర ఆధిపత్య ప్రాంతం అది ఫ్యాక్టరీ అయినా అది సినిమా స్టూడియో అయినా నాయకులైన యజమాని ఇంటి ముందు ధర్నాలు చేసి గేట్లెక్కి కండువాలు ధరించి దండుకొచ్చిన విషయం నాకు జ్ఞాపకం వస్తున్నది. కారు డ్రైవర్ గా నాకు స్టీరింగ్ ఇయ్యాల నా తర్వాత వచ్చిన జూనియర్ కు ఎలా ఇస్తారని లోపల లోపల గుస్సా పడుతూ పైకి రాని నవ్వును పెదవుల మీదికి బలవంతంగా తెచ్చుకుంటూ నవ్వుతుంటాను. కారు నడిచినప్పుడు స్టీరింగ్ చేతులకు రాలేదు. ఇక ముందు వస్తదనే గ్యారెంటీ లేదు. కాలం తీరిన వారంటీని అయిపోయాను. పొమ్మనలేక అనుకుంటే పొగ పెడతారు అనుకుంటే ఆ జాడలు చూఛాయగా కనిపిస్తలేవు. లోపల ఇమడలేక బయటపడలేక నాకు నిండు చలికాలంలో ఏసి ఉన్నా నాకు నాకు ఉక్కపోస్తూనే ఉంది. తన ఇలాకాలో ఎదిగి వస్తున్న యువ నాయకుడిని పోలీసులతో దౌడు తీయించిన గౌడు పెట్టిన కేసును ఎదుర్కోలేక మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగాన్యాయం కోసం కోర్టు తలుపులు తట్టాను. ఏం చేస్తాను. ఇప్పుడు గాలి పోయిన టైరును అయ్యాను.

వెనుక టైర్లు:- అతి వేగంగా దూసుకుపోతున్న ముందు టైర్లను చూసి వెనుక టైర్లకు కండ్లు బైర్లు కమ్ముతున్నాయి. మేము కదులుతేనె కదా కారు ముందు ఉరికేది. కానీ ముందు డ్రైవర్ మరియు ముందు టైర్లు మేమే నడుపుతున్నామని అనుకుంటాయి. ఫిర్యాదులకు అరెస్టులకు భయపడనని బీరాలు పలికి చివరికి న్యాయ స్థానాన్ని ఆశ్రయించాడు. మరొక గీరె పిట్ట పోరు పిట్ట పోరు బోకెత్తుల మూతినాకుల్ల పిల్లి తీర్చినట్టు మొంటెడు చాపలు తిన్న పిల్లిరా ముఖం పెట్టీంది. సెల్ పట్టుకున్న టైర్ గింత ఉంటే మంత్రిగా వెలగబెట్టిన నాలుగో టైరు అయిన నాకు ఎంతుండాలెనో చెప్పుండ్రి. కొంచెం ఉన్న కాస్త గాలి తుస్సుమని దిగిపోయింది.

యజమాని కూర్చునే సీటు:- దిగిపోయాక యజమాని తాలు మాటలు బోలు చేతలు తెలిసిన కూర్చున్న సీటు మాట్లాడుతుంది. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. అంతా తన ఇంటి వాళ్లే. నమ్మి నాన పోస్తే పుచ్చి బుర్రలు అయిన్నై. పొదుగేసిన గుడ్లు అన్నీ గుడ్లు "సీ" గుడ్లు అయిపోయినాయి. అందరూ అదుపు ఆజ్ఞలో ఉన్నట్టే కనబడుతారు కానీ ఎవరు ఉండరు. చెప్పిన మాట విన్నట్టు వింటారు అవతలికి పోయినాక తర్వాత ఆచరణ వేరే ఉంటుంది. పీట చెక్కతో నేను ఇట్లా అంటే తలుపు చెక్కతోనే తాను ఇట్లా అనే అన్నట్టుగా ఉంది. ఎంక్వయిరీ వేసుకుంటే వేసుకోండి. విచారణ చేసుకుంటే చేసుకో పొండ్రి అంటారు. అరెస్టు చేసుకుంటే చేసుకోండి హాయిగా జైల్లో ఉంటాం అంటూ డంబాచారాలు పలుకుతూ బిక్కు బిక్కు మంటూ మేకపోతు గాంబీర్యం ప్రదర్శిస్తుంటారు. తీరా అన్ని కమిషన్ల రిపోర్ట్ ఇచ్చాక ఆఖరికి చావు తప్పి కన్నులొట్ట పోయినట్టు కోర్టులో వ్యాజ్యం వేస్తారు. తనవాళ్లే అందరూ కలిసి చివరికి యజమాని కిందికి నీళ్లు తెస్తారో చూడాలి. ఓడిపోయిన అప్పటి నుంచి యజమాని కంటికి నిద్ర రాదు మనసులో మనసు లేదు తర్బీయత్ రోజుకింత తమామ్ కరాబ్ అవుతుంది.

గమనిక :- కారు భాగాలు హుషారుగా తమ తమ ఎతకతను ఎల్లబోసుకున్నయ్. కాంగ్రెస్ పార్టీ అధికార చేపట్టి రెండేళ్లు కూడా పూర్తి కాకముందే, తన యజమాని లోపల్లోపల వారి కుటుంబ సభ్యులు పైకి కూట్లె రాయి తీయలేనోడు ఏట్లె రాయి తీస్తడా చెప్పుండ్రి. అధికార పార్టీ శివా అంటే ప్రతిపక్ష పార్టీకి బూతులా వినబడడం గిట్లా ఆగమాగం అవడం మునాసం కాదు. ఉరికురికి పశువుల కాస్తే పొద్దుకదు. అని మీరన్నా జర వాళ్లకు చెప్పుండ్రి. సము జాయించుండ్రి. చెప్పంగా వినకుంటే చెడంగా చూడాలి.

Tags:    

Similar News