రేపటి పాట (కవిత)

నేటి మేటి కవిత

Update: 2025-09-29 07:01 GMT

మనం అవమానింపబడటానికి

ఇతరులు మన జీవితంతో ఆడుకోవడానికి

మన కలలు వేరొకరు

పగలగొట్టి వెళుతున్నప్పుడు

చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ లేము,

గాలివాటు జీవితంలా

కొట్టుకుపోవడానికి సిద్దపడి ఇక్కడ లేము.

మనకు కష్టపడి పనిచేయడం అలవాటు.

మనం ఎత్తడానికి భారాలు చాలానే ఉన్నాయి.

గాయాలెన్నో తొలిచేస్తూ ఉంటే

బలహీనపడి మీ పోరాటాన్ని తిరస్కరించవద్దు.

దానిని ఎదుర్కోవడానికి రంధి పడండి

ఇది జీవితం నీకిచ్చిన బహుమతి

బలంగా ఉండండి

రోజులు బహు చెడ్డవి

ఎవరిని నిందించాలి అని వేదాంతం వల్లించవద్దు.

చేతులు ముడుచుకుని అవమానాన్ని అంగీకరించకండి

నిజం పేరు మీద నిలబడండి

మాట్లాడండి మరియు ధైర్యంగా ఉండండి

బలంగా ఉండండి!

ఆరోపణలు ఎంత హీనమైనవో

అసత్యాలు ఎంత నిరాధారమైనవో

అవహేళన ఎంత కృత్రిమంగా అతికించబడిందో

అవమానం ఎంత లోతుగా పాతుకుపోయిందో,

యుద్ధం ఎంత కష్టంగా వుంటుందో

ఎన్ని రోజులు జరుగుతుందో అది ముఖ్యం కాదు.

బలంగా వుండండి.

కార్యక్షేత్రంలో వెన్నుజూపి పారిపోకండి.

ఏ అదృశ్యశక్తో

మీకు తోడు అవుతుందని అతిగా ఆశించకండి.

తెర్లుతున్న ఆవేశంతో మరుగుతున్న

ఆలోచనతో కాలం ఇంధనంతో

తగిలిన గాయంపై ఉప్పు కారం అద్ది

ఆ చోదకశక్తితో కసిగా పథం పట్టండి.

రేపటి పాటొకటి మీ కొరకు వేచివుంది

మీ విజయాలను అది కీర్తిస్తుంది

-వనజ తాతినేని

Tags:    

Similar News