రాజ్యాంగ ప్రయాణంలో నిశ్శబ్దం: సిద్దిఖ్ కప్పన్ ఆందోళన

విజయవాడలో జరిగిన విప్లవరచయిత సంఘం మహాసభల్లో ప్రసగించిన ప్రముఖ జర్నలిస్టు సిద్దిఖ్ కప్పన్

Update: 2024-01-29 09:08 GMT

రాజ్యాంగ ప్రయాణంలో నిశ్శబ్దం చోటుచేసుకుందని, అది అనేక సవాళ్ళను ఎదుర్కుంటోందని ప్రముఖ జర్నలిస్ట్ సిద్దిఖీ కప్పన్ ఆవేదన వ్యక్తం చేశారు.

విజయవాడలోని సిద్దార్థ కాలేజీ ఆడిటోరియంలో రెండు రోజుల పాటు జరిగిన విప్లవ రచయితల సంఘం (విరసం) 29వ రాష్ట్ర మహాసభల్లో శనివారం ఉదయం ఆయన ప్రారంభోపన్యాసం చేశారు.

‘‘రాజ్యాంగం అనేది న్యాయ సంబంధమైన పత్రాల పొత్తమో, నిబంధనల సమూహమో కాదు. అది ప్రజాస్వామిక స్ఫూర్తి నిచ్చే సజీవ డాక్యుమెంట్. మన రాజ్యాంగంలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం , సౌభ్రాతృత్వం, న్యాయాన్ని పేర్కొనడంతో పాటు, అందులో ప్రభుత్వ అధికారాలను నిర్వచించడం, పౌరుల హక్కులను ప్రకటించడం, ఆ హక్కులకు ఎవరూ భంగంకలిగించ కుండా కాపాడడం అనే ప్రభుత్వ బాధ్యతలున్నాఅయి,"అని ఆయన అన్నారు.

సిద్దిక్ కప్పన్ తో రచయిత రాఘవ శర్మ, విరసం సభ్యుడు చెంచయ్య


 రాజ్యాంగంలో పౌరుల గౌరవాన్ని కాపాడడం, అధికారం, జవాబుదారీ తనం మధ్య సమతుల్యత సాధించాలని ఉంది. న్యాయం అనేది గౌరవం కాదు, ప్రజలందరికీ దక్కాల్సిన జన్మహక్కు అని సమష్టి కృషి అనే దృ క్పథానికి సజీవ రూపమని ఆయన వర్ణించారు.

 ఒక జాతిగా మనుషులందరినీ సమైక్యంగా ఉంచాలని చెబుతూ  రాజ్యాంగం  పౌరుల హక్కులను రక్షించేది మాత్రమే కాదు, పౌరుల అవసరాల కనుగుణంగా మారేది, అందరినీ నడిపించేది.’’ అని కప్పన్ అన్నారు.  రాజ్యాంగం ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా ఉండాలన్న అమెరికా స్వాతంత్య్ర ప్రకటనను రచించిన రాజనీతిజ్ఞుడు జఫర్సన్ మాటలతో సిద్దిఖీ కప్పన్ తన ప్రారంభోపన్యాసాన్ని ముగించారు.
ఖసిద్దిఖీ కప్పన్ ఎవరు?
కప్పన్  కేరళకు చెందిన జర్నలిస్ట్. ఉత్తర్ ప్రదేశ్ లోని హత్రాస్ లో ఒక దళిత యువతిపై అగ్రకులాలకు చెందిన వారు సామూహిక అత్యాచారం చేసి, హత్య చేశారన్న వార్త 2022 అక్టోబర్లో దేశమంతా వ్యాపించింది. ఆ సంఘటన గురించి రాయడానికి ఢిల్లీ నుంచి ఉత్తర్ ప్రదేశ్ కు వెళ్ళిన సిద్ధిఖీ కప్పన్ ను పోలీసులు తమ అదుపులో ఉంచుకుని, ఆ విషయం బైటకు పొక్కకుండా జాగ్రత్త వహించారు. సిద్దిఖీ కప్పన్ ను ఒక మంచానికి సంకెళ్ళతో బంధించిన ఫొటో ఒకటి సామాజిక మాద్యమాలలోకి ఎలా వచ్చిందో వచ్చింది. దాన్ని చూసిన సిద్దిఖీ కప్పన్ సతీమణి రైహనత్ కప్పన్ హెబియస్ కార్పస్ పిటిషన్తో సుప్రీం కోర్టు తలుపు తట్టింది. వెంటనే సిద్దిఖీ కప్పన్ ను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించాలంటూ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఉత్తర ప్రదేశ్ లోని యోగి ఆదిత్య నాత్ ప్రభుత్వం విధిలేక అతన్ని ఆస్పత్రికి తరలించి ‘ఉపా’ (చట్టవ్యతిరేక చర్యల నిరోధక చట్టం) కింద కేసుపెట్టింది. నలభై ఐదు నెలలు, అంటే 850 రోజుల నిర్బంధం తరువాత బెయిల్ పై విడుదలయ్యారు.


Tags:    

Similar News