తెలుగు సినిమాను మలుపుతిప్పిన నటి కృష్ణవేణి.. ఎన్నో అద్భుతాలు

తెలుగు చిత్రసీమలోని దిగ్గజ నటులు ఎన్‌టీఆర్, ఎస్‌వీ రంగారావులకు తొలి సినీ అవకాశం కల్పించిన వ్యక్తి కృష్ణవేణి.;

Update: 2025-02-17 04:35 GMT

తెలుగు చిత్ర సీమను ఉన్నతస్థాయికి తీసుకెళ్లడంలో తొలితరం కథానాయకులు, కథానాయికలు, దర్శకులు, నిర్మాతలు కీలక పాత్ర పోషించారు. ఈ బాధ్యతలన్నింటిని పోషించి తెలుగు చిత్ర సీమ అభివృద్ధికి ఎంతగానో పాటుపడిన నటి, తొలితరం కథానాయిక కృష్ణవేణి. ఎందరో గొప్పగొప్ప నటులు, దర్శకులకు తొలి అవకాశాలు కల్పించిన నిర్మాత కూడా. అటువంటి మహానాయకి 101 ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యల కారణంగా ఆదివారం కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యం బారిన పడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె, నిర్మాత అనురాధాదేవి నిర్ధారించారు. తెలుగు సినిమా తొలి అడుగుల నుంచి డిజిటల్ యుగం వరకు దగ్గరుండి చూసిన బహుముఖ ప్రజ్ఞాశాలి కృష్ణవేణి.

ఎన్‌టీఆర్‌, ఎస్‌వీఆర్‌లకు అవకాశం

తెలుగు చిత్రసీమలోని దిగ్గజ నటులు ఎన్‌టీఆర్, ఎస్‌వీ రంగారావులకు తొలి సినీ అవకాశం కల్పించిన వ్యక్తి కృష్ణవేణి. 1942లో కృష్ణవేణి, మీర్జాపురం రాజా దంపతులకు అనురాధాదేవి జన్మించారు. ఆమె పేరుమీదే ఎంఆర్ఏ అనే బ్యానర్ స్థాపించారు. ఆ బ్యానర్‌పై ఎల్‌వీ ప్రసాద్ దర్శకత్వంలో ‘మనదేశం’ చిత్రాన్ని నిర్మంచారు. ఈ సినిమాలో ఎన్‌టీఆర్ తొలిసారి వెండితెరకు పరిచయం అయ్యారు. బెంగాళీలో వచ్చిన ‘విప్రదాసు’ నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఘంటసాల, రమేష్ నాయుడులను నేపథ్యగాయకుడిగా, సంగీత దర్శకులుగా పరిచయం చేశారు. పీ లీల, జిక్కాలను గాయనీమణులుగా, ఎర్రా అప్పారావును దర్శకుడిగా ప్రజల ముందుకు తీసుకొచ్చిన ఘనత కృష్ణవేణిదే. అప్పట్లోనే ఆమె రూ.45వేల పారితోషికం తీసున్నారు. ఆమెతో సరిసమానంగా భానుమతి ఒక్కరే పారితోషికం తీసుకునేవారు.

స్టేజ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ వరకు

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో 1924 డిసెంబర్‌ 24న కృష్ణవేణి జన్మించారు. ఆమె తండ్రి వైద్య వృత్తి నిర్వర్తించేవారు. కృష్ణవేణి డ్రామా ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ఆరంభించారు. చిన్నప్పటి నుంచే నటన, నాట్యం, గానంపై ఆమెకు ఎనలేని మక్కువ ఉండటంతో చిన్న వయసు నుంచే నాటకాల్లో బాలనటిగా కనిపించేవారు. ఆమె ప్రతిభకు పెద్దపెద్ద నటును కూడా మెచ్చుకునేవారు. స్టేజీ నాటకాలు వేస్తూనే 1936లో ‘సతీ అనసూయ’ సినిమాతో తెలుగు చలచిత్ర సీమలోకి అరంగేట్రం చేశారు. కృష్ణవేణి తెలుగు సినిమా నిర్మాత మీర్జాపురం రాజాతో వివాహం జరిగింది. ఈమె కూడా స్వయంగా అనేక సినిమాలు నిర్మించింది. ఈమె తన సినిమాలలో తెలుగు సాంప్రదాయ విలువలకు అద్దంపట్టి జానపదగీతాలకు పెద్దపీట వేసింది. 1949 తెలుగులో సినిమా చరిత్రలో మైలురాయి అయినటువంటి మన దేశం చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాతో ఎన్‌టీఆర్, ఎస్‌వీఆర్, గంటసాలను పరిచయం చేశారు. ఆ తర్వాత మరెన్నో సినిమాల్లో మరెందరో నటులు, గాయకులను ఆమె పరిచయం చేశారు.

సినిమా అవకాశాల్లో భాగంగా కృష్ణవేణి కుటుంబం చెన్నైలో స్థిరపడింది. 1939లో మీర్జాపురం జమీందార్‌తో ఆమె వివాహం జరిగింది. భర్తకు చెందిన శోభనాచల స్టూడియోస్‌ సారథ్యంలో పలు సినిమాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించారు. తన పాటలను తానే పాడుకున్న నట గాయనిగా కూడా ఆమె పేరు సంపాదించారు. 1940లో మీర్జాపురం రాజాతో ఆమెకు వివాహం జరిగింది. వివాహానంతరం 'భోజ కాళిదాసు'లో కృష్ణవేణి నటించారు. 'మన దేశం'తో నటుడిగా ఎన్టీఆర్‌ను కృష్ణవేణి పరిచయం చేశారు.

1947లో విడుదలైన 'గొల్లభామ'తో గుర్తింపు తెచ్చుకున్నారు. 1942లో కుమార్తె రాజ్యలక్ష్మీ అనూరాధకు కృష్ణవేణి జన్మనిచ్చారు. తల్లి కృష్ణవేణి బాటలో నిర్మాతగా అనూరాధాదేవి రాణించారు. 'కీలుగుర్రం' సినిమాలో అంజలీదేవికి కృష్ణవేణి నేపథ్యగానం అందించారు. ఘంటసాల, రమేశ్‌ నాయుడును సంగీత దర్శకులుగా కృష్ణవేణి పరిచయం చేశారు. గాయనీమణులు పి. లీల, జిక్కీలను కృష్ణవేణినే చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. త్రిపురనేని గోపీచంద్‌ను కూడా సినీ రచయితగా కృష్ణవేణి మార్చారు. 1952లో వచ్చిన 'సాహసం' సినిమాలో ఆమె చివరిగా నటించారు. 1957లో చివరిగా 'దాంపత్యం' చిత్రం నిర్మించారు. కృష్ణవేణి రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. ఇటీవల 'మనదేశం' వజ్రోత్సవ వేడుకలో కృష్ణవేణి పాల్గొన్నారు.

ఎన్నో పురస్కారాలు

తెలుగుసినీ రంగానికి కృష్ణవేణి చేసిన సేవల అంతాఇంత కాదు. ఆమె సేవలకు గానూ ఎన్నో అవార్డులు అందాయి. 2004లో ఆమె అప్పటి ఏపీ ప్రభుత్వం నుంచి రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. ఎన్‌టీఆర్ సినీ వజ్రోత్సవం సందర్బంగా 14 డిసెంబర్ 2024న విజయవాడలో ఏసీ సీఎం చంద్రబాబు, భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కలిసి కృష్ణవేణిని సత్కరించారు. ఇప్పుడు ఆమె తుదిశ్వాస విడిచారన్న అంశం యావత్ తెలుగు చిత్రసీమను కలచివేస్తోంది. ఆమె మృతి పట్ల సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు.

‘ఎన్‌టీఆర్‌కు తొలి అవకాశం ఇచ్చిన కృష్ణవేణి మృతి అత్యంత బాధాకరం. తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో ఆమెది ఒక ప్రత్యేక అధ్యాయం. ఆమె మరణం తీరలి లోటు’’ అని బాలకృష్ణ సంతాపం తెలిపారు.

‘ఎన్‌టీఆర్‌ని చిత్రసీమకు పరిచయం చేసిన ఒక అమూల్చమైన కానుకను మానకు అందించారు. ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలం’ అంటూ మా అధ్యక్షుడు మంచు విష్ణు ట్వీట్ చేశారు.

"అలనాటి నటీమణి, సినీ నిర్మాత కృష్ణవేణి మృతి నన్ను బాధించింది. 102 సంవత్సరాల పరిపూర్ణ జీవితం గడిపిన కృష్ణవేణి గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. 'మన దేశం' చిత్రంతో ఎన్టీఆర్ ను చిత్ర రంగానికి పరిచయం చేసి కళారంగానికి వారు చేసిన సేవ మరువలేనిది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.” అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

‘తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తొలి మహిళా నిర్మాతగా గుర్తింపు పొందిన కృష్ణవేణి తుదిశ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు.

Tags:    

Similar News