మీరూ ఆలోచించండి!

నేటి మేటి కవిత;

Update: 2025-06-18 02:54 GMT

మనమందరం

ఫాల్స్ ప్రిస్టేజ్‌తో
అమాయకత్వంతో
అజ్ఞానంతో బ్రతికేస్తున్నాం!
లేని గొప్పతనాన్ని
మనకు ఆపాదించుకొని
మనల్ని మనం రోజూ
మోసం చేసుకొంటున్నాం!
వ్యక్తిత్వాన్ని మించి
మనం ధరించగల
ఆభరణం ఇలలో లేదు!
ఖరీదైన వస్తువులతో
అనవసరపు అహం తప్ప
మన విలువ పెరగదు!
యాపిల్ ఫోనున్నా సరే
దేవుడితో మాట్లాడలేవు..
అర్మానీ సూటేసుకొన్నా
అమితాబ్ బచ్చన్ కాలేవు..
రేబాన్ గ్లాసుల్లోంచి చూసినా
ఇల్లు ఇంద్రభవనమైపోదు..
వెయ్యిరూపాయల విందుతో
ఆశీస్సులు వచ్చిపడిపోవు..
కోటిరూపాయల బెంజ్‌ కొన్నా
గాలిలో తేలుకొంటూ పోదు..
హ్యార్లీడేవిడ్సన్ తోలుతున్నావని
ట్రాఫిక్ తొలగి దారివ్వదు..
గుచ్చీ హ్యాండ్ బ్యాగ్‌ కొంటే
డాలర్లు తమేవచ్చి పడిపోవు..
సభ్యసాచి పెళ్ళిడ్రస్సేసుకొన్నా
కాపురం సజావుగా సాగిపోదు..
ఎగ్జిక్యూటివ్ విమానసీట్లోవచ్చినా
దిగాక‌ భూమిపై నడవకతప్పదు..
నైకీ షూ వేసుకొన్నంత మాత్రాన
ఒలంపిక్స్ మెడల్ మనకివ్వరు..
తాజ్‌లో డిన్నరు తిన్నావని
మరుసటిరోజు ఆకలికాకపోదు..
లోరియల్ మేకప్ వేసుకోగానే
పెళ్ళాం ప్రపంచసుందరి కాదు..
రోలెక్స్‌వాచ్ పెట్టుకోగానే
కాలమేమీ మనకు కలిసిరాదు..
హైరైజ్ అపార్ట్‌మెంట్లోవుంటే
స్వర్గమేమీ దగ్గరకురాదు..
వస్తువుకున్న విలువనుచూసి
న్యాయమైన ధరే చెల్లించండి!
ప్రపంచపు గుర్తింపుకోసమని
పేరుచూసి మోసపోకండి!
Pay for the Worthiness
of an article.!
not for the Brand name
it possess.!!

-డాక్టర్ గోపికృష్ణ
అమృత హాస్పిటల్, మదనపల్లె


Tags:    

Similar News

కాలం మానం