నాన్న త్యాగి

పాదర్స్ డే సందర్బంగా నాన్నకు ప్రేమతో డాక్టర్ కొవ్వలి గోపాలకృష్ణ కవిత ‘త్యాగి’;

Update: 2025-06-15 02:54 GMT

నాన్న త్యాగి

ఆనంద త్యాగి,
సౌఖ్య త్యాగి,
స్వీయ అవసరాల త్యాగి
కుటుంబం కోసం
తనను తానే కోల్పోయిన
శివరూపం నాన్న
పలుకెరుగని ప్రేమల ప్రకటనలకు
నాన్న బ్రాండ్ రాయబారి
భవిష్యదాశతో గతాన్ని మరచి
నిట్టూర్పెరుగని ఆశల బాటలో
వర్తమానంలో చరించే
ఆశాజీవి నాన్న
బరువనిపించినా
ఎత్తుకున్న బాధ్యతల భారాన్ని
నిబ్బరంగా నిభాయించే
శివ తత్వ సారం నాన్నత్వం
నాన్న బంధం కాదు, బంధుత్వం కాదు;
అనుబంధాల వారధి
నాన్న తరాలకి తీగ
తీగ తెగిన తరాలు తీరం దాటని నావలు
నాన్న ప్రతిఫలం కోరని కర్మ యోగి,
గీతాతత్వ సారమెరిగిన
పర్వతోద్ధారణ సంసారి
నాన్న నిత్య పారాయణ నామ శ్రేష్టి


-డాక్టర్ కోవ్వలి గోపాలకృష్ణ

Tags:    

Similar News

కాలం మానం