సినిమాకాదు, అద్భుత నాటకం ‘మాయాబజార్’

విశాఖ సముద్రతీరంలో వెలసిన నెలవంక

Update: 2024-07-06 09:07 GMT

విశాఖపట్నంలో ఈమధ్యకాలంలో నాటకం చూస్తూ పిల్లలు కేరించి నవ్వుకుని, చప్పట్లు సత్కారాన్ని పంచిన అద్భుతం ‘మాయాబజార్’ నాటకం.

తరతరాలనుంచి వినోద సంస్కృత కళా ప్రక్రియలతో సురభి కళాకారులను మరిచిపోలేం. వారు తాతలు తమ్ములు, కొడుకులు, పిల్లలు, కోడళ్లు, చెల్లెళ్లు కలిసి నాటకాన్ని రచిస్తారు, పాడతారు, ఆడతారు, మొత్తం మీద రక్తికట్టించే అద్భుతమైన సాంకేతిక ప్రజ్ఞతో ప్రదర్శిస్తూ ఉంటారని మనకందరికీ తెలుసు. చాలా కాలంతరువాత ఈ నాటకాన్ని విశాఖ కళాభారతిలో చూసే అవకాశం లభించింది.



అందమైన హీరో, మరీ అందమైన కథానాయకి, నవరసాలను కురిపించిన ఘటోత్కరుడు, వారి తల్లి హిడింబ, అందమైన శ్రీకృష్ణుడు, కోపిష్టియైన కథ నడిపిన బలరాముడు, అందరినీ సంధానకంగా మొత్తం నాటకాన్ని రక్తికట్టిన నారదుడు, అన్నిటికీ మించి గొప్ప చిత్ర విచిత్ర మాయలు, మ్యాజిక్, సినిమా ప్రభావాన్ని తలపించే మ్యూజిక్ తో కలిసిన నాటకం మరిచిపోలేని సృష్టి.


జులై 5న చూడలేకపోయిన ఆ సృష్టిని ఊళ్లో ఉండి చూడలేని దురదృష్టం. (మూడేళ్ల తరువాత ఆరోగ్యంగా నేను విశాఖపట్నం వచ్చిన నాకు ఈ నాటకం చూసే అవకాశం వచ్చినా నాకు లోలోపల ఇంత గొప్ప నాటకాన్ని ప్రదర్శిస్తే సాధ్యమవుతుందా అని అనుమానమే ఉండింది. కాని నిస్సందేహంగా ఇది అద్భుత ప్రక్రియ.)


ఖర్చుచేసిన డబ్బు మాత్రమైనా వస్తే చాలు, కష్టమైన సరే అయినా ఒక మంచి నాటకం చూపిద్దాం అని విశాఖ భానోదయ నాట్య మండలి (సురభి) ప్రదర్శించిన దృశ్య కావ్యం రసిక కళాకారులకు సమర్పించిన నాటకం మాయాబజార్.



సినిమా తలపించిన నాటకం

ఎస్ వి రంగారావు, ఎన్టీఆర్, నాగేశ్వర్ రావుగారి 60 సంవత్సరాలు మించిన పాత మాయాబజార్ మరిచిపోలేని అద్భుత చిత్రం, విచిత్రం, కళాఖండం. అంత గొప్పనిదైనటువంటి సినిమా మళ్లీ చేసి చూపించడం సాధ్యం కాదు. మాయాబజార్ సినిమా చరిత్రను తిరగరాసిన అద్భుత చలన చిత్ర చరిత్ర అది. అదే పేరుతో మరో నాటకం మాయాబజార్. అయితే మరిపించే అనలేం, మరిపించే అనడం సినిమా మాయాబజార్ ను అన్యాయం చేయలేం. కనుక దాన్ని తలపించే నాటకం నిన్న 5 జూలై 2024న కళాభారతి ముందు ప్రదర్శించిన మాయాబజార్ విశాఖ ప్రేక్షకులకు పెద్దలను, చిన్నలను కూడా ఆమోదింపచేసి, మోదింపజేసిన నాటకం ఇది.



మన సినిమాలో నే అది సాధ్యం అవుతుందా కాదో అనుకునే మాయాబజార్ కదా. కాని నాటకంలో, మన ముందు, చూస్తున్న ముందు చూడడం ఆశ్చర్యమే. ఇది సాంకేతిక టెక్నిక్ సృష్టించిన అద్భుతం చూడవచ్చు అని ప్రేక్షకులు ప్రశంసలు సాధించిన నాటకం మాయాబజార్. అందులో కొన్ని సంఘటనలు, చిత్రవిచిత్రాల మాయ వివరాలు ఇవి.


1. శశిరేఖను మంచంతో సహా ఘటోత్కచుని ఆకాశంలో వనానికి పంపడం ఒక మాయ.

2. అంతముందు, ఘటోత్కచుని నిద్రలేచి అమ్మా తిండి కోసం అడిగే దృశ్యాన్ని మరోసారి చూడవలసిన సంఘటన.

3. ఘటోత్కచుని ఆవిష్కరించే దృశ్యం గగుర్పొడిచింది. డ్రాగన్ నిప్పులు చెరిగేస్తూ ఉండగా, వళ్లు విరిచుకుంటూ ఉండే దశలో వెనుక గురకతో భయపెడతాయి.


4. ఘటోత్కచుడు వివాహ భోజనంబు అంటూ లడ్డూలు గాలిలో ఎగురుతూ నోటికి వచ్చే ఘటనాన్ని ఏమనగలం? అదొక ఆశ్చర్యం.

5. అంతేకాదు, ద్వారకంలో ఉన్న బలరాముడి భవనంలో నెలవంకను చూస్తూ కథానాయకి శశిరేఖ విరహాన్ని ప్రదర్శించే ఘటన, ఘటోత్కచుని వనంలో అదే సమయంలో కథానాయకుడైన అభిమన్యుడు తన ప్రియుడికోసం యుగళ గీతం ఆశ్చర్యం కాకమరేమిటి. ఆ దృశ్యాన్ని నాటకం చివరన మరోసారి చూస్తామని ఎదురుచూడడం చాలా గొప్పది.

6. మరో ఘటన ఏదంటే బాలభానుడు సంధ్యాసమయంలో కాషాయ రంగు పులుముకున్న బ్రాహ్మణ బాలకుడు సంధ్యావందనం చేసే మరో ఘటన మరిచిపోలేం. ఇది భానోదయ నాట్య మండలికి టైటిల్ ఘటనగా ఈ దర్శకుడు, రచయిత, నటులు ఉపయోగించుకునే అద్భుత ఘటన ఇది.


7. ఘటోత్కచునికి అభిమన్యుడికి మధ్య యుద్ధం చూడడం అదృష్టమే. ఆ వీరుడు బాణాలన్నీ తిప్పికొట్టే సంఘటన, ఘటోత్కచుని గదను విసిరితే బాణంతో వెనక్కి తరుముకొస్తూ పేల్చివేసిన సంఘటన పిల్లలు ఆనందంగా అరిచిన కేకలు మరిచిపోలేం.

8. శ్రీకృష్ణుడిని దీప వెలుతురులతో విశ్వరూపం మరోసారి చూడాల్సిందే.

9. హిడింబి ఏకాదశి తరువాత ద్వాదశినాడు వచ్చే పుణ్యం కోసం ఆకలి ఆకలి అంటూ బాల బ్రాహ్మడిని ఆరగిస్తాననడం, ఆ బాల బ్రాహ్మనుడి భయపడుతూ నటించిన హాస్యంవల్ల విశాఖ ప్రేక్షకులు ఊర్రూతలూగించాయి.

10. ఘటోత్కచుడికి ఉత్తరరాకుమారుడి మధ్య ఘటనలో నవ్వులే నవ్వులు కనిపిస్తూ వినిపిస్తూ ఉంటాయి.

ఇంకా ఎన్నో సంఘటనలను దర్శకుడు, నటీనటులు, తెరవెనుక నడిపిన కళాకారులు, టెక్నిక్ ప్రతిభావంతుల అంకిత భావన చాలా గొప్పది. (ఈ అద్భుత నాటకంలో అనుకోకుండా చూసే అవకాశం నాకు లభించింది. పూర్తివివరాలు నాకు అందలేదుడం వల్ల మంచి నటనా ప్రాభవాన్ని వివరించలేకపోతున్నాను. ఈ నాటకంలో ఆ నటుల పేర్లతో చేర్చడం, వారి కళాకారులకు చప్పట్లుకాక ఏం చేయగలుగుతాం? అప్పడికీ ఈ నాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రముఖులు రావడం, ఆశీర్వదించడం, సన్మానించడం చాలా గొప్ప విషయం)

(విశాఖపట్నం 6.7.2024)

Tags:    

Similar News