హైదరాబాద్ ‘రాజకీయ సభ’ లో నేతాజీ ప్రసంగించిన వేళ…

హైదరాబాద్ ప్రజలు బ్రౌన్ బ్యూరోక్రసీ పోరాడుతున్నారన్న నేతాజీ;

Update: 2025-01-23 12:06 GMT

ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి. ఈ సంర్భంగా తెలంగాణతో నేతాజీకి ఉన్న సంబంధం ఏమిటో చూద్దాం.

తెలంగాణ ప్రాంతంలో ప్రజాస్వామిక పోరాటం ఎపుడుమొదలయిందో కచ్చితంగా చెప్పలేం గాని, రికార్డులెకెక్కినంతర వరకు 1883 లోనే బీజాలు పడ్డాయి.

నిజానికి నిజాం రైల్వేల ప్రయివైటైజనేషన్ కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంతో నైజాంలో ప్రజా పోరాటం మొదలయిందని చెప్పవచ్చు.

బ్రిటిష్ వాళ్ళు హైదరాబాద్ ను బ్రిటిష్ పాలన కింద ఉన్న ప్రాంతాలతో కలిపేందుకు రైలు మార్గాలు వేయాలనుకున్నారు. వాళ్లు వేయాలనుకున్న మార్గాలలో సికిందరాబాద్ - చాందా మార్గం ఒకటి . దీనికి పెట్టుబడులు పెట్టేందుకు దేశీయ పెట్టుబడిదారులెవరూ ముందుకు రాలేదు. అపుడు ఇంగ్లండు మార్కెట్ నుంచి పెట్టబడులు సేకరించాల్సి వచ్చింది. చాలా మంది బ్రిటన్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చారు. అయితే వాళ్ల పెట్టుబడులకు నిజాం గ్యారంటీ ఇవ్వాలని షరతు పెట్టారు. నిజాం దీనికి అంగీకరించారు.

ఇది, బ్రిటిష్ వాళ్లు నిజాం నుంచి భారీగా ఈ పెట్టుబడులు మీద వడ్డీ లాగేందుకే చేసిన కుట్రఅని చరిత్ర కారులు చెబుతారు. ఎందుకంటే ఆరు శాతం వడ్డీకి నిజాం అంగీకారం తెలిపారు. ఫలితంగా నిజాం రైల్వేస్, నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే కంపెనీ (యన్ జిఎస్ ఆర్ )గా రూపాంతరం చెందింది.

నిజాం నిర్ణయానికి వ్యతిరేకంగా అనేక చోట్ల నిరసనలుచెలరేగాయి.

నిరసనకారుల్లో కొందరిని నిజాం రాజ్యం నుంచి బహిష్కరించారు. అందులో ఒక ప్రముఖుడు కూడా ఉన్నాడు. ఆయన పేరు అఘోరనాథ చట్టోపాధ్యాయ. ఆయనను అరెస్టు చేసి షోలాపూర్ జైలు పెట్టారు. ఈ అరెస్టు విషయం బ్రిటిష్ పార్లమెంటులోకూడా చర్చకు వచ్చింది.

ఇలా మొదలయిన నిజాం కాల ప్రజాస్వామిక పోరాటాలు 1920 దశాబ్దం నాటికి రాజకీయ స్వేచ్చ, పత్రికా స్వేచ్ఛ కావాలనే దాకా వెళ్లాయి. అయితే,నిజాం సంస్థానంలో రాజకీయ సభలను సమావేశాలను నిషేధించారు. అందుకే తొలినాళ్ల నిజాం రాజ్య రాజ్యసభలన్నీ సభలన్నీ బ్రిటిష్ ఇండియాలో జరిగాయి.

ఈ నైజాం రాజకీయ సభలను Hyderabad political conferences అంటారు. ఇవన్నీ ఆప్పటి కాంగ్రెస్ సభలతో పాటు జరిగేవి. ఇలా తొలిసభ బ్రిటిష్ ఇండియా మద్రాస్ ప్రెసిడెన్సీలోని కాకినాడలో(1923) జరిగింది.రెండో సభ ముంబై (1926) లో జరింగింది. మూడో హైదరాబాద్ పొలిటిక్ కాన్షరెన్స్ పూనా(1928) లో జరిగింది. నాలుగోది బేరార్ లోని అకోలా (1931)లో జరిగింది.

నైజాం రాజ్యంలో రాజకీయ సభలు సమావేశాలు జరుపుకునే స్వేచ్ఛ కావాలని, పత్రికా స్వేచ్ఛకావాలనేది ప్రధానమయిన డిమాండ్ గా ఈ సభలు జరిగాయి.

పూనాలో 1928 మే లో జరిగిన మూడో హైదరాబాద్ పొలిటికల్ కాన్ఫరెన్స్ విశేషమేమిటంటే ఈ సభలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రసంగించారు.

ఈ సభకు ఎల్ బి భోపత్కార్ ఆహ్వాన సంఘం ఛెయిర్మన్, ఎన్ సి కేల్కార్ అధ్యక్షుడు. నైజాంలో రాజకీయ స్వేఛ్చ, పత్రికా స్వాతంత్య్రం ఉండాలనే దానితో పాటు మొత్తం 16 తీర్మానాలు చేశారు.

ఈ సభలో ప్రసంగిస్తూ, బ్రిటిష్ ఇండియాలో తెల్ల నియంతృత్వం సాగుతుఉంటే దేశీయ ప్రాంతాలలో బ్రౌన్ రంగు వారి నియంతృత్వం సాగుతూ ఉందని పేర్కొన్నారు. ఆయన క్లుప్తంగానే మాట్లాడని చాలా ఉత్తేజకరంగా మాట్లాడారని ప్రశంసలొచ్చాయి. నేతాజీ ఉపన్యాసంలోని కొన్ని ముఖ్యాంశాలు:

“It is not possible for me to say much on the present topic for my knowledge of the internal affairs of states is very meagre…In British India, we have the white bureaucracy or autocracy but in the Native States the people have to fight with the brown bureaucracy or autocracy. The character of both is much the same. We are all striving for the establishment of a democratic government…I, therefore, thank you all and hope that we will be enabled to do something more tangible and take more interest in our brothers of the States.”

Tags:    

Similar News