తెలుగు వాళ్ల ఫేమస్ చాక్లెట్ ‘న్యూట్రీన్’ ఎటుపోయింది?

నేడు అంతర్జాతీయ చాక్లెట్ దినం. ఈ సందర్భంగా తెలుగు వాళ్లకు చాక్లెట్ తో ఉన్న తీయటి బంధం బంధం గురించి నాలుగు ముక్కలు...;

Update: 2025-07-07 05:54 GMT
Chittoor Central Facebook సౌజన్యం

ఈ రోజు (జూలై 07 - 2025) జాతీయ చాక్లెట్ దినోత్సవం (National Chocolate Day). చాక్లెట్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు.  వీటిని పిల్లలకోసమే తయారుచేస్తున్నట్లు కనిపించినా, పెద్ద వాళ్లు వాటి మాయలో పడకుండా ఉండటం చాలా కష్టం. ఉండలేరు. అయినాసరే,చాక్లెట్ పిల్లల ప్రపంచంలో అతి ముఖ్యమయిన తినుబండారం. అందుకే చాక్లెట్ కంపెనీలు పిల్లలను ఎక్కుపెట్టే బిజినెస్ చేస్తుంటాయి.

వ్యాపారానికి సంబంధించి చాక్ లేట్ సేల్స్ పిల్లలను ఆకట్టుకునేందుకు చాలా వ్యూహాలు అనుసరిస్తాయి. పిల్లల కామిక్స్ ని విడుదల చేస్తాయి. రంగురంగుల పేపర్లలో ప్యాక్ చేసి మార్కెట్ లోకి విడుదల వస్తాయి.  రకరకాల ఆకారాలలో చాక్లెట్స్ వస్తాయి. చాక్ లెట్ లు కొంటే గిఫ్ట్ కూపన్లు లభిస్తాయి. చాలా గిఫ్ట్ బాక్స్  మీరీ అందంగా ఉంటాయి. రుచి పెరిగేందుకు డ్రైఫ్రూట్స్ వేసి కొత్త కొత్త చాక్ లెట్స్ ని తయారు చేస్తున్నాయి కంపెనీలు.చాక్లెట్ పానీయాలు వచ్చాయి. పిల్లలను టార్గెట్ చేసినందున చాక్ లెట్ కంపెనీలు పిల్లల సాహిత్యాన్ని కూడా బాగా ప్రోత్సహించాయి.

చాక్లెట్ అంటే తెలుగు వాళ్లకి న్యూట్రీన్ గుర్తుకు వస్తుంది. అదొక తీయటి బంధం. ఇది తెలుగు వాళ్లు తయారు చేసిన అత్యద్భుతమయిన చాక్లెట్ మిరకిల్.  ఆంధ్రప్రదేశ్ నుంచి తయారయిన న్యూట్రీన్ చాక్ లెట్స్  దేశమంతా బాగా పాపులర్ అయ్యాయి.దేశంలో న్యూట్రీన్ చాక్లెట్ చొరబడని గ్రామంలేదంటే ఆశ్చర్యం కాదు. అయితే, ఇపుడా కంపెనీ మాయమయింది. తెలుగు వాళ్లు తయారుచేసిన ఈ చాక్లెట్ పెద్ద పెద్ద కంపెనీల చాక్లెట్స్ తో పోటీ పడింది. అజేయంగా నిలిచింది. అంతేకాదు, ధనికులకు పేదలకు అందరికి చాక్లెట్ ను అందుబాటులోకి తెచ్చింది. భారతదేశంలో ప్రాచుర్యంలో చాక్లెట్ ని సార్వజనీనం చేసిన ఘనత న్యూట్రిన్ దే.అయితే, గ్లోబలైజేషన్ తో కుదేలయింది.


ఈ న్యూట్రీన్ చాక్లెట్ గిఫ్ట్ బాక్స్ మీద చిత్తూరు ఆంధ్రప్రదేశ్ అని అక్షరాలు చూడవచ్చు

న్యూట్రిన్ తెలుగు వాడి నైపుణ్యానికి ప్రతీక

న్యూట్రిన్ తెలుగు పారిశ్రామిక వేత్త తయారుచేసిన స్వీట్. 1952 న్యూట్రిన్ జర్నీ మొదలయింది. చిత్తూరు జిల్లాకు చెందిన బి వెంకట్రామారెడ్డి ఈ చాక్లట్ తయారీ మొదలుపెట్టారు. ఆయన మద్రాసులో ని అడయార్ నేషనల్ యూనివర్శిటీలో చదువుకున్నారు. అపుడు యూనివర్శిటీ చాన్స్ లర్ ఎవరనుకుంటున్నారు, రవీంద్రనాథ్ టాగూర్. రెడ్డి తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ కలిపే ప్రాంతంలో మామిడి, అరటి, టామాటో పంట విస్తృతంగా ఉన్న చిత్తూరు ప్రాంతంలో చాక్లెట్ తయారు చేసే యూనిట్ తెరిచారు. గ్రామీణ ప్రాంతంలో తయారయిన చాక్లెట్ ఇదేనేమో. దేశంలో అన్నివర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా ఒక చాక్లెట్ ను తయారు చేయాలనే ఉద్దేశం ఎప్పటినుండో ఉండింది. దానిని సాధ్యం చేసే లక్ష్యంతో న్యూట్రీన్ కన్ఫెక్షనరీ కంపెనీ లిమిటెడ్ (Nutrine Confectionery Company Ltd)ను స్థాపించారు. ఆయన తయారు చేసిన చాక్లెట్స్ కు జనాదరణ లభించింది. వెంకట్రామారెడ్డి అనంతరం ఆయన కుమారుడు ద్వారకనాథ రెడ్డి (కిందిఫోటో)వ్యాపారంలోకి వచ్చారు. 

అమెరికాలో చదువుకున్న ద్వారక నాథ్ రెడ్డి హయాంలో న్యూట్రీన్ భారతీయ బ్రాండ్ గా రూపొందింది.చిత్తూరు ఫ్యాక్టరీ ఆసియాలోనే పెద్ద చాక్లెట్ ఫ్యాక్టరీ గా పేరు పొందింది. 1980,90 ల భారతీయ చాక్లెట్ మార్కెట్ రారాజుగా న్యూట్రీన్ వర్ధల్లింది. ఈ కంపెనీ భారతదేశంలో నెంబర్1 చాక్లెట్ కంపెనీ అయింది. 



భారతదేశంలోకి గ్లోబలైజ్ కావడం మొదలుపెట్టాక న్యూట్రీన్ అంతర్జాతీయ పోటీ ఎదురయింది. 2000 సంవత్సరం నుంచి విదేశీ బ్రాండ్ చాక్లెట్స్ రావడం మొదలయింది. ఈ వాతావరణానికి తట్టుకుని నిలబడేందుకు వ్యూహం మార్చాలి. 2006 లో న్యూట్రీన్ కంపెనీని గోద్రేజ్ కనుగోలు చేసింది. తర్వాత గోద్రేజ్ కూడా హెర్షే స్ (Hershey’s) చేతులు కలిపి గోద్రేజ్ హెర్షేస్ కంపెనీ (Godrej Hershey Ltd) ప్రారంభించింది. కొద్ది రోజు పాత న్యూట్రీన్ ఉత్పత్తులును తయారు చేశారు. అయితే, తర్వాత కొత్త ఉత్పత్తులు వచ్చాయి. దానితో న్యూట్రీన్ శకం ముగిసింది. చాక్లెట్ ప్రపంచంలో తెలుగు వారి అధ్యాయం ముగిసింది.

చాక్లెట్ వర్సెస్ టూత్ పేస్టు

విపరీతమయిన చాక్లెట్ ప్రచారం వ్యాపారం యుద్ధానికి తెతీసింది. దీన్నుంచి ఎలా లబ్దిపొందాలనే మరొక రంగం ఆలోచించింది. అది టూత్ పేస్టుల మార్కెట్. డెంటిస్టుల బొమ్మలు, పుచ్చిన పళ్ల బొమ్మలు చూపింపి చాక్లెట్ తింటే పళ్లు పాడవుతాయనే కౌంటర్ ప్రచారం మొదలయింది. దీనిని టూత్ పేస్ట్ కంపెనీలు బాగా సొమ్ము చేసుకున్నాయి. చాక్లెట్ తిన్నాక పాడయిన పళ్లని కాపాడేందుకు మా టూత్ పేస్టు వాడండనే ప్రచారం మొదలయింది. చాక్ లెట్ తింటే పళ్లు పాడవుతాయనే భయాన్ని మన బుర్రల్లోకి చొచ్చుకుని పోయేలా చేయడంలో టూత్ పేస్ట్ కంపెనీలు విజయవంతమయ్యాయి. చాక్లెట్ ఒక చక్కటి తినుబండారం. ఇపుడు చాలా మంది తల్లితండ్రులు చాక్ లెట్ ని పిల్లలకు ఇవ్వడానికి జంకుతుంటారు. చాక్ లెట్ తినకుండా సాధ్యమయినంతవరకు అపేస్తుంటారు. చాక్లెట్ తింటే పిల్లల పళ్లు పాడవుతాయనేది అపోహమాత్రమే. అన్ని తీపి పదార్ధాలకున్న గుణమే చాక్లెట్ కు ఉంటుంది. అది పళ్లకి ప్రత్యేక శత్రవేమీ కాదని నిపుణులు చెబుతున్నారు.

చాక్లెట్ చరిత్ర

చాక్లెట్ కు 4,000 సంవత్సరాల చరిత్ర ఉంది. మధ్య అమెరికాలోని అజ్టెక్ రాజ్యం అంటే నేటి మెక్సికోలో మొదటి చాక్లెట్ తయారయింది. ఇక్కడే మొదటి కోకో మొక్కలు కనిపించాయి, చాక్లెట్ కు పనికొచ్చే మొక్కలు ఇక్కడే పెరిగాయి.  లాటిన్ అమెరికాలోని తొలి నాగరికతలలో ఒకటైన ఓల్మెక్ జాతి కోకో మొక్కను చాక్లెట్‌గా మార్చినట్లు పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కర్మకాండల సమయంలో వాళ్లు చాక్లెట్ పానీయాన్ని తాగేవారని, దానిని ఔషధంగా కూడా ఉపయోగించారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆ తరువాత, మాయన్లు చాక్లెట్‌ను దేవతల పానీయంగా కొనియాడారు. మాయన్ చాక్లెట్ అనేది కొకా విత్తనాలను చేసిన కాల్చి చూర్ణానికి మిరపకాయలు, నీరు, మొక్కజొన్న పిండి కలిపి తయారుచేసిన గౌరవనీయమైన, పవిత్రమయిన పానీయం. మాయన్లు ఈ మిశ్రమాన్ని కుండల్లో పులియబెట్టి, "xocolatl" అనే మందపాటి నురుగు పానీయాన్ని సృష్టించారు, దీని అర్థం "చేదు నీరు".

15వ శతాబ్దం నాటికి, అజ్టెక్‌లు కోకో గింజలను కరెన్సీగా ఉపయోగించారు. చాక్లెట్ క్వెట్జల్‌కోటల్ దేవుడిచ్చిన బహుమతి అని వారు విశ్వసించారు. దానిని రిఫ్రెష్ పానీయంగా, కామోద్దీపనగా, యుద్ధానికి సిద్ధం ఉత్తేజకారకంగా కూడా తాగారు.

చాక్లెట్ యూరోప్‌ జైత్రయాత్ర

చాక్లెట్ యూరోప్ కు ఎప్పుడు వచ్చిందో ఎవరికీ కచ్చితంగా తెలియదు. 1528లో హెర్నాన్ కోర్టెస్ అనే స్పెయిన పర్యాటకుడు  స్పెయిన్ కు చాక్లెట్ తెచ్చాడని చెబుతారు.

బంగారాన్ని అన్వేషిస్తూ కోర్టెస్ మధ్య అమెరికాలో పర్యటిస్తున్నపుడు అజ్టెక్ చక్రవర్తి ఆయనకు కోకా కప్పును అందించాడు. దానిని తీసుకుని ఆయన స్పెయిన్ కు తిరిగివచ్చాడు. అలా అది యూరోప్ లో ప్రవేశించింది. స్పెయిన్ కు తిరిగి వస్తూ ఆయన కోకో విత్తనాలను కూడా తీసువచ్చాడు.  స్పానిష్ రైతులకు పరిచయం చేశాడు. అలా కోకో పంట విస్తరించింది. కోకో పానీయం చేదుగా వగురుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా తీపి, కారం ,ఉప్పు కలుపుకుని తాగడం మొదలు పెట్టారు. అనతి కాలంలోనే అజ్టెక్ అందించిన ప్రసాదంగా  స్పెయిన్‌లోని ధనవంతుల ఇళ్లలో చాక్లెట్ త్వరగా ప్రాచుర్యం పొందింది.

1828 లో చాక్ లేట్ ప్రెస్ రావడంతో చాక్ లెట్ తయారీలో విప్లవం మొదలయింది. అంతవరకు చాక్ లేట్లని చేతితో తయారుచేసేవారు. 1847లో J. S Fry & Sons కంపెనీ మొదటి చాక్ లెట్ బార్ ని తయారుచేసింది. ఇపుడు చాక్ లెట్ ప్రవేశించని వంటకం లేదు. చాక్ లేట్ పానీయాలు వచ్చాయి. చాక్ లేట్ కేకులే కాదు, దోసెలు, చాక్ లెట్ శాండ్విచ్ లు వచ్చాయి. చాక్ టెల్ నాన్ వెజ్ వంటకాలు కూడా వస్తున్నాయి.

డైరీ మిల్క్, ఫైవ్ స్టార్, క్యాడ్బరీ, కిట్ క్యాట్ లతో పాటు డార్క్ చాక్లెట్ వంటి ఎన్నో రకాల పేర్లతో అందంగా ప్యాకేజీలలో చాక్లెట్స అందుబాటులోకి వచ్చాయి. ఇపుడిది పెద్ద అంతార్జాతీయ వాణిజ్యం. ప్రపంచవ్యాపితంగా చాక్లెట్ మార్కెట్ సైజు 2023లో 119.39 బిలియన్ అమెరికా డాలర్లు. 2030 నాటికి 156.74 బిలియన్ అమెరికా డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ఇక భారతదేశానికి సంబంధించి చాక్లెట్ మార్కెట్ విలువ 2.3లో 3.8 బిలియన్ డాలర్లు.

Tags:    

Similar News