మైనపు బొమ్మా, నువ్వెవరమ్మా!

బొమ్మకు ప్రాణం పోసిన టుస్సాడ్స్‌..

Byline :  Amaraiah Akula
Update: 2023-11-30 10:19 GMT
లాస్‌వెగాస్‌

చూపు చుక్కల్లో ఉన్నాకాళ్లు నేల మీదుండాలిగా.. లండన్‌ పోతానో లేదో, పోయినా కారల్‌మార్క్స్‌ సమాధీ, మేడమ్‌ టు స్సాడ్స్‌ మైనపు బొమ్మల మ్యూజియం చూస్తానో లేదో... మబ్బుల్ని చూసి ముంతలో నీళ్లు వొలకబోసుడెందుకు? ఉన్నది చూస్తేపోలా!  అనుకుంటూ లాస్‌వెగాస్‌ టు స్సాడ్స్‌ మ్యూజియం బిల్డింగ్‌ ముందాగా. నామదికనిపెట్టి నమమ్మాయిదీప్తి.. టిక్కెట్‌ చేతిలో పెట్టి ’మీరు చూసిరండి, మేం వేరేప్లేస్‌కి వెళ్లొస్తా మంది’.

జిగేల్‌ రాణి ఈ లాస్‌వెగాస్‌..

లాస్‌వెగాస్‌ ఎలియాస్‌ వెగాస్‌. నెవెడా రాష్ట్రంలో అతి పెద్ద నగరం. అటు కాలిఫోర్నియా ఇటు యూటా.. ఇదెలాంటిదంటే ఆడోళ్లను మగోళ్లుగా, మగోళ్లను ఇడియట్స్‌గా మారుస్తుందట. ఇక్కడ దొరికేవి నోదకేళి భూప్రపంచంలో ఎందెందు వెతికినా దొరకదట. ఇది ప్రపంచ వినోద రాజధాని. (ఎంటర్‌ టైన్‌మెంట్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ది వరల్డ్‌). సమస్త కళల సంగమం. కంటిమీదకు నుకుండదు. విందు వినోదాలకు తెంపుండదు. గల్లీలోనూ తావుండదు. చీకటైతే చిందేస్తది. కొత్త పెళ్లికొడుకులకు నెలవవుతది. పగలైతే ఆవలిస్తది. పొద్దున్నేవానకు తడిసిన గువ్వవుతది. ఈకలుపీకిన కోడవుతది. నిజానికిదో ఎడారి ప్రాంతం. నీళ్లులేని చోట నీళ్లు పుట్టించి ఎందుకూ కొరగాని వనుకున్నఎర్రమన్నుపర్వత శ్రేణుల్ని బంగారపు ముద్దల్లా మార్చిన తీరు అబ్బురపరుస్తుంది.
లండన్‌ తర్వాత వెగాస్‌లోనే...
అటువంటి చోట 1999లో వెలిసిందీ మేడమ్‌ టు స్సాడ్స్‌ వాక్స్‌ మ్యూజియం. యావత్‌ ప్రపంచంలో ఇట్లాంటివి 21 ఉంటే ఇది రెండోది. అమెరికాలో మొదటిది. లండన్‌ తర్వాత లాస్‌వెగాస్‌లోనే! ది గ్రాండ్‌ కానల్‌ ఫాపర్స్‌ మాల్‌ నుంచి బయటికి వస్తూనే దివెనిటియన్‌ బిల్డింగ్‌లో ఉంది. టిక్కెట్‌ ధర 45 డాలర్లు. లోపల ఎలా మసులుకోవాలో, ఏవేవి చూడొచ్చో చెబుతూ టిక్కెట్‌ చేతిలో పెడతారు. క్యూలో పదిమెట్లెక్కి పైఅంతస్తుకి పోవడంతోనే ఓపెద్దాయన ఓచేత్తో వైన్‌గ్లాస్‌తో మరోచేత్తోలోని కిరమ్మన్నట్టుగా స్వాగతం పలుకుతారు. ఆయనెవరంటే.. ఈమ్యూజియంను ప్రారంభించిన నాటి నగరమేయర్‌ ఆస్కార్‌ గుడ్‌మెన్‌. అలా కొంచెంముందుకు పోగానే కౌబోయ్‌ పిల్‌మెగ్రా .. నాతో ఫోటోదిగుతారా! రండి, రండంటాడు. ఆయన పక్కన నిలబెట్టి ఫోటోలు తీసేవాళ్లుంటారు. అలా వద్దనుకుంటే రెడ్‌కార్పెట్‌ ఉండనే ఉంటుంది. కంప్లల్సరీకాదుగా నితీసుకునేవాళ్లు చివర్లో డబ్బు కట్టి ఫోటోలు తీసుకోవచ్చు.
నాలుగు జోన్లుగా మ్యూజియం...
ఈ మ్యూజియం 4 జోన్లుగా ఉంటుంది. టు స్సాడ్స్‌ క్లబ్‌ ప్రముఖులు, క్రీడారంగ దిగ్గజాలు, ప్రఖ్యాత పాప్, ర్యాప్‌ సంగీత నిపుణులు, పేరున్నసినీనటులు. వీటికి అదనంగా లోకల్‌టాలెంట్‌ హంట్, 4డీమువీమార్వెల్‌థియేటర్, హాంగోవర్‌బార్‌. ప్రతిబొమ్మపక్కనా వివరాలున్న బోర్డులున్నాయి. నచ్చిన వాళ్లదగ్గర నిలబడి ఫోటోలు తీసుకోవచ్చు. వీడియోకీ అనుమతి ఉంది. అయితే ముందేచెప్పాలి. చూసే ఉబలాటం ఉంటే ఓరెండు గంటలు పడుతుంది. లేకుంటే ఓఅరగంటో, ముప్పావు గంటలోనో చుట్టేసి రావొచ్చు. భారతీయుల బొమ్మలేవీ కనిపించలేదు. 
మైక్‌ టైసన్‌... మనోడేననుకున్నా!
డీజేమ్యూజి షియన్‌స్టీవ్‌బకీ, మిస్టర్‌ ఫిట్‌హాలీబెర్రీ, జాజ్, పియానో స్పెషలిస్ట్‌ మిసెస్‌ గాగా, రేసర్లు రిచర్డ్‌ హ్యారీ, డేల్‌ ఎర్న్‌హార్డ్‌ జూనియర్, రిచర్డ్‌ పిటీల బొమ్మలు మనకు మొదట్లో కనపడతాయి. వీళ్లందరూ లాస్‌వెగాస్‌ కింగ్‌లే. వీళ్లను దాటి అటు నాలుగడుగులేయంగానే..∙పిడికిలిబిగించి మొహం మీద గుద్దుతానన్నట్టుగా మన మీదికి దూసుకొస్తుంటాడొకాయన. ఈయన్నెక్కడో చూసినట్టుందే అనుకుంటూ ఇదిబొమ్మా, నిజంగానే మనిషా! అని ముట్టుకున్నా. అబ్బురమనిపించింది. మొక్కట్లుఉన్నవున్నట్టుగాఎట్లాచేశారోమరి! అతడేమైక్‌టైసన్‌. బాక్సింగ్‌కింగ్‌. తెలుగుప్రజలకుబాగాతెలిసినవాడు. టైసన్‌కికొంచెంఎడంగా... ’సీతాకోకచిలుకలాఎగురు, తేనెటీగలా కుటు’్ట అని చెప్పే మహమ్మద్‌ ఆలీ. 12 ఏళ్లప్పుడే బాక్సింగ్‌ బాటపట్టి 1960 ఓలంపిక్స్‌లో గోల్డ్‌మెడల్‌ కొట్టిన ఆలీ వరల్డ్‌ హెవీ వెయిట్‌ చాంఫియన్‌. మాల్కమ్‌ ఎక్స్‌ శిష్యుడు.
ఐస్‌టీలో లెమనాయిడ్‌ కలిపితే..!
ఈ మ్యూజియంలో వారందరిదీ తలోక స్పెషాలిటీ. తెలియందిఏదైనా మనకు కొత్తేకదా. ఆర్నాల్డ్‌ పామెర్‌ అని ఓగోల్ఫర్‌ ఉన్నాడు. అతడి ప్రత్యేకత ఏంటంటే ఐస్‌టీలో లెమనాయిడ్, వోడ్కాను కలిపి తాగే డ్రింక్‌ను కనిపెట్టాడట. ఇప్పుడది లాస్‌వెగాస్‌లో పెద్దఫేమస్‌ డ్రింక్‌. ఆగదిలోనే టెన్నిస్‌ దిగ్గజాలు ఆండ్రీ అగస్సీ, బేస్‌బాల్‌ ప్రముఖులమైన పుబొమ్మలున్నాయి. ఓ మూలన జిగేల్‌ జిగేల్‌మనే ఫోటో స్పాట్‌ ఉంది. ఆశల ఊసులు, రెక్కల పల్లకిలో ఎగిరి పోతుండేలా ఫోటోదిగి నా అనుకునేవాళ్లకిచూపవచ్చు. ఆస్పాట్‌ చూసింతర్వాత ఫోటో దిగకుండా ఉండలేకపోయా! అలా కొంచెం పక్కకు వస్తే బాల్‌రూమ్‌డాన్స్‌ ట్రూప్‌ కనిపిస్తుంది. పొడవాటి గొలుసుతో పైకప్పుకు వేలాడదీసుండే పెద్దగుండుపై ఓఅమ్మాయి డాన్స్‌ చేసే చిత్రాన్ని కళ్లతో చూడాల్సిందే. మ్యూజికల్‌ ఇనుస్ట్రు మెంట్స్, మ్యూజిక్‌ హెల్మెట్లు, పాత కాలపు వాద్య పరికరాలు, యమహాపియానోలాంటివున్నాయి.
బ్రాడ్‌పిట్‌ కూడా జర్నలిస్టే..
బుల్లెట్‌ ట్రైన్, బాబిలోన్‌ వంటి సినిమాల హీరో బ్రాడ్‌పిట్‌. పెద్ద విగ్రహం. నింపాది. మంచి అందగాడు. ’సెక్సిస్ట్‌మెన్‌ఎలైవ్‌’ అంటుంటారు. ఆయనా ఓజర్నలిస్టని తెలిసి ఫోటోదిగాలనిపించింది. మిస్సోరీ యూనివర్శిటీలో జర్నలిజం డిగ్రీచేస్తూ నటనపై మోజుతో కాలిఫోర్నియా చేరాడట. తోటి నటి యాంజిలినాజోలిని పెళ్లిచేసుకుని ముగ్గురు పిల్లల్నికన్నాడు. మరో ముగ్గుర్నిదత్తత తీసుకున్నాడు. ఇటీవలి వరకు ఈమ్యూజియంలో యాంజిలినా, బ్రాడ్‌ కలిసున్నబొమ్మనే ఉంచారట. ఇప్పుడు విడిపోవడంతో ఆబొమ్మనూ విడదీశారు.
1996, 97లలో రోమియో జూలెట్‌ సినిమా ఓ ఊపు ఊపింది. కుర్రాళ్లను వెర్రెక్కించింది. ఆసినిమా హీరో లియోనార్డోడికాప్రినో.. అలాంటి వాణ్ణి పట్టుకుని ఓ జర్నలిస్టు ’మీరేమైనా ట్రెండ్‌సెట్టరా?’ అని అడిగితే.. అయ్యో, నేను మామూలు వ్యక్తిని మాత్రమే అన్నాడట. ఆయన బొమ్మనూ తీర్చిదిద్దారిక్కడ. మీరు నన్నుఆడని పిలిచినా మగని పిలిచినా లేదా రిజిస్, క్యాత్లీ అని పిలిచినా పర్లేదు. కానీ పిలుస్తూనే ఉండండి అని చెప్పే అమెరికన్‌ యాక్టర్‌రు పౌల్‌ చిత్రానికి ఈ మ్యూజియంలో పెద్దపీట వేశారు. ఈయన నాలుగైదు సార్లు ఈమ్యూజియం కళాకారులతో భేటీ వేశారట.
బాబ్‌ మార్లేరూటే సెపరేట్‌...
బాబ్‌ మార్లే... జమైకాలో పుట్టి అమెరికాలో గిట్టిన జాతిరత్నం. ఆటా,పాటా, రాత ఆయన సొంతం. జాతి వివక్షపై గళమెత్తిన వాడు. వేయి పూలు వికసించనీ అనేదానికి అద్దం. జమైకాలో ఓవినూత్న ఉద్యమం రెగ్గీని ప్రోత్సహించిన వాడు, గంజాయిని చట్టబద్ధం చేయాలన్నఅమెరికన్లకు మద్దతుగా నిలిచిన వాడు. డోంట్‌గివప్‌.. (వదిలి పెట్టొద్దు) పాటతో ఎంతో మంది మనసు దోచిన కళాకారుని బొమ్మ ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆయనగొంతెత్తి పాడుతున్నట్టు ఉండే బొమ్మకు ఎదురుగా గంజాయితో తయారు చేసిన పెద్ద చుట్టను ఉంచారు. దానిపై అటొకరు ఇటొకరు కూర్చొని ఊగవచ్చు. అటువంటి మార్లే 36 ఏళ్ల వయసులో చనిపోతూ తనకొడుకుతో .. డబ్బుతో జీవితాన్ని కొనలేమురా అయ్యా.. అన్నాడట. ఆ తర్వాత మైకెల్‌ జాక్సన్‌ బొమ్మ ఉంది. ఆయన గురించి ప్రపంచానికి తెలియదేముంది. మైకు పట్టుకుని పాట పాడుతున్నబొమ్మను ఇక్కడుంచారు.
వందేళ్లు గొర్రెలా బతికే కన్నా... మడోన్నా
వందేళ్లు గొర్రెలా బతికే కన్నా ఏడాది పాటు సింహంలా బతకడం మంచిదన్న అమెరికా నటి, రాక్‌ అండ్‌ రోల్‌ డ్యాన్సర్‌ మడోన్నా గుర్తున్నారుగా.. ఆమె చిత్రం ప్రత్యేకం.
దేశ వాళీనటులు, పాప్‌ సింగర్స్‌ డ్రేక్, ప్రిన్స్, టిమ్‌మ్యాక్‌గ్రా, మిల్లేసైరస్, స్టీవ్‌ వాండరర్‌ లాంటి అనేక సంగీత ప్రముఖుల చిత్రాలు చూసిన తర్వాత డౌన్‌ ఫ్లోర్‌కి వెళ్లే దారిలో మేడమ్‌ టు స్సాడ్స్‌ బొమ్మ ఉంటుంది.
ఎవరీ మేడమ్‌ టు స్సాడ్‌....
విగ్రహాల తయారీలో విప్లవమంటే ఆమెదే. అసలు పేరు మేరీ టు స్సాడ్‌. 1761 డిసెంబర్‌ 1న ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో పుట్టింది. తండ్రి జోసెఫ్‌ గ్రోషోల్ట్‌జ్, తల్లి అనీమేరీవాల్డర్‌. మేరీ పుట్టడానికి రెండునెలల ముందే తండ్రి చనిపోతాడు. దీంతో తల్లి పిల్లతో స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌ చేరింది. అక్కడ ఓ వైద్యుడు ఫిలిప్‌కర్టియస్‌ ఇంట పనికికుదిరింది. కర్టియస్‌ డాక్టర్‌ కమ్‌ ప్రొఫెసర్‌. శరీర నిర్మాణాన్ని చూపేందుకు మైనపు బొమ్మల్ని తయారు చేసి విద్యార్థులకు చెప్పేవాడు. ఇందుకోసం ఆయన ప్యారిస్‌లో ఓ కార్ఖానా పెట్టారు. టుస్సాడ్‌కి ఈ కళను నేర్పించింది ఆయనే. అనంతర కాలంలో ప్యారిస్‌ చేరిన టు స్సాడ్‌ 1777లో తొలిసారి సొంతంగా ఫ్రెంచ్‌ తత్వవేత్త వోలై్టర్‌ బొమ్మను చేసి సత్తాచాటింది. ఇక, ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. వరుసగా జీన్, జాక్వెస్‌రూసో, బెంజమిన్‌ఫ్రాంక్లిన్‌ వంటి ఫ్రెంచ్‌ ప్రముఖుల చిత్రాలతో ఆకట్టుకుంది. ఫ్రెంచ్‌రాజు 15వ లూయిస్‌ సోదరి ఎలిజబెత్‌కూ ఈ కళలో శిక్షణ ఇచ్చిందనీ, అందువల్లే ఫ్రెంచ్‌ విప్లవ సమయంలో రాజకుటుంబఅనుచరురాలిగా అనుమానించి అరెస్ట్‌ చేస్తారని చెబుతారు. 1795లో సివిల్‌ ఇంజనీర్‌ ఫ్రాంకోయిస్‌టు స్సాడ్‌తో పెళ్లైంది. ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమారులు జోసెఫ్, ఫ్రాంకోయిస్‌. కుమార్తె చనిపోతుంది.
లండన్‌ యాత్ర ఇలా...
ఫ్రెంచ్‌ విప్లవానికి ముగింపుగా 1802లో బ్రిటన్, ఫ్రెంచ్‌ రిపబ్లిక్‌ మధ్య అమియన్స్‌ నగరంలో సంధి కుదురుతుంది. ఇరుదేశాల మధ్య రాకపోకలకు మార్గం సుగమమైంది. అప్పుడామె తనభర్త, పెద్ద కొడుకును ప్యారిస్‌లోనే వదిలి మైనపు బొమ్మల ప్రదర్శన కోసం నాలుగేళ్ల కొడుకు జోసెఫ్‌ను చంకనేసుకుని లండన్‌ చేరింది. మరో కళాకారుడు పాల్‌ఫిలిడోర్‌తో కలిసి లైసియంథియేటర్‌లో బొమ్మల్ని ప్రదర్శించింది. పెద్దగా గిట్టుబాటేమీకాలేదు. తిరిగి ఫ్రాన్స్‌ పోలేకపోయింది. 1803లో ఎడిన్‌బర్గ్‌ వెళ్లి తలదాచుకుంది. దాదాపు 20 ఏళ్లతర్వాత పెద్ద కొడుకు ఫ్రాంకోయిస్‌ తల్లిని వెతుక్కుంటూ లండన్‌ వస్తాడు. తల్లిని కలుస్తాడు. కుటుంబ వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉంటాడు. ఆమె భర్త మాత్రం ఫ్రాన్స్‌లోనే ఉండిపోయారు. ఇద్దరూ మళ్లీ ఒకరినొకరు చూసుకోలేదు. బ్రిటన్‌వచ్చిన 33 ఏళ్ల తర్వాత 1835లోలండన్‌ బేకర్‌స్ట్రీట్‌లో తనకంటూ ఓశాశ్వత ప్రదర్శనశాలను ఏర్పాటు చేసుకోగలిగారు. 1842లోఆమె స్వీయ చిత్రపటాన్ని తయారు చేసుకుంది. మ్యూజియం ప్రవేశ ద్వారం వద్ద పెట్టిందదే ఇప్పుడు. ఆమె తన 88వ ఏట 1850 ఏప్రిల్‌16న లండన్‌లో నిద్రలోనే కన్నుమూశారు.
బార్‌సెక్షన్‌లోకి వెళ్లడం మరువకండి..
టు స్సాడ్‌ చిత్రాన్ని చూస్తూ పక్క గదిలోకి పోవడంతోనే ఎందరెందరో ప్రముఖులు కనిపిస్తారు. క్యాసినో మ్యూజిక్‌ హీరోలు, డాన్సర్లు, స్టంట్‌ మాస్టర్లు, ఫేమస్‌ ట్రంపెట్స్, రాబర్ట్‌డినిరోవంటి ట్రింఫనీలు, ఎర్రటి రుమాలతో విన్యాసాలు చేస్తూడాన్స్‌ చేసే మిస్టర్‌ ఎల్విస్, లిక్కర్‌ సీసాలకు నిప్పంటి గాల్లోకి ఎగరేస్తూ వయ్యారంగా గ్లాసుల్లోకి వొంపేవాళ్లవి, బ్రూస్‌ క్యాంప్‌బెల్, వ్యాన్‌ న్యూటన్‌ లాంటి నటులు, బ్లూమెన్‌ గ్రూపు, గ్యాంగ్‌స్టర్‌ బుడ్డీ సీగల్‌ బొమ్మలుంటాయి. అక్కడి నుంచి కిందికి దిగడంతోనే బార్‌ సెక్షన్‌ ఉంటుంది. అమెరికాలో ఏదీ ఉచితంకాదు. డబ్బులిచ్చి కొనుక్కోవాలి. ఐస్‌లెమనాయిడ్‌ లేదా మార్గరేటాను టేస్ట్‌చేయవచ్చు. తాగుడు పైపలువురుచెప్పిన సూక్తులు, రకరకాల టేస్టుల్ని చదువుకోవచ్చు. పక్కనే మైక్‌టైసన్‌ బాత్‌ రూం ఉంది. అందులో పులి బొమ్మ చూపరులను ఆకట్టుకుంటుంది. వెడ్డింగ్‌ ఛాపెల్‌లోకి వెళ్లి కాసేపు ఆనందించవచ్చు. ఆపక్కనే ఉన్నమార్వెల్‌ సెక్షన్‌లో 4డీ థియేటర్‌లో కూర్చుని ఓ 15 నిమిషాల సేపు ఆట చూడొచ్చు. మన పక్కనే స్పైడర్‌మ్యాన్‌ ఉన్నఅనుభూతి నిపొందొచ్చు. అక్కడి నుంచి గిఫ్ట్‌రూంలోకి వచ్చి మీకు నచ్చినవి ఏమైనా ఉంటే కొనుక్కొని బయటకు రావొచ్చు. మీరెప్పుడైనా అటు వెళితే తప్పనిసరిగా ఈ మ్యూజియంను చూసిరండి. 
అమరయ్య ఆకుల, జర్నలిస్ట్, 9347921291


Tags:    

Similar News