కుప్పకూలుతున్న ప్రపంచ స్టాక్ మార్కెట్లు
ట్రంప్ సుంకాల యుద్దంతో ఆర్థిక మాంద్యంలోకి అమెరికా జారుకుంటుందా?;
By : The Federal
Update: 2025-03-11 11:44 GMT
భారత స్టాక్ మార్కెట్ ఈ రోజు ప్రారంభంలోనే తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. అమెరికా స్టాక్ మార్కెట్ లో నెలకొన్న గందరగోళం, దేశీయ స్టాక్ మార్కెట్ లో స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రారంభంలోనే సెన్సెక్స్ 417 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 130 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీలో 50 కంపెనీలు నమోదు చేసుకోగా ఐదు స్టాక్ మాత్రమే లాభాల్లో ఉన్నాయి.
45 స్టాక్ లు తీవ్రంగా నష్టపోయాయి. ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్దం వల్ల గత 50 రోజుల్లోనే అంతర్జాతీయ మార్కెట్లు నష్టపోతున్నాయి.
ట్రంప్ విధించిన సుంకాలు..
స్టాక్ మార్కెట్ నిఫుణుడు అజయ్ బగ్గా మాట్లాడుతూ..ప్రపంచ సరఫరా గొలుసులు, ఆర్థిక వ్యవస్థలు, భౌగోళిక రాజకీయాలు, వాణిజ్యం అన్నింటిపై ట్రంప్ ప్రభావం చూపారు.
అట్లాంటా ఫెడ్ అమెరికా జీడీపీని మొదటి క్వార్టర్ లో అంచనా వేసింది. ఈ సంస్థ ప్రకారం.. యూఎస్ అభివృద్ది -2.4 శాతంగా ఉంది. దీనితో అమెరికా స్టాక్ మార్కెట్ లో అమ్మకాల ఒత్తిడి పెరిగిందన్నారు.
‘‘ట్రంప్ పరిపాలన బాధ్యతలు చేపట్టిన 50 రోజుల్లోనే ఈ గందరగోళం ప్రారంభం అయింది. అమెరికా మార్కెట్లు అంతా అనిశ్చితిలో ఉంది. రాబోయే రెండు నెలల్లో కొంత స్పష్టత వస్తుందని ఆశిస్తున్నాం. అది తప్ప వేరే మార్గం లేదు’’ అని బగ్గా అన్నారు.
వెల్లువెత్తిన అమ్మకాలు..
అమెరికా అధ్యక్షుడు తాను అనుకున్నది సాధించడానిని అమెరికా ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారని వాల్ స్ట్రీట్ ప్రశ్నించింది. మధ్యాహ్నం ట్రేడింగ్ లో ఎస్ అండ్ పీ -500.. 3. 2 శాతం తగ్గింది. డౌ జోన్స్ ఇండస్ట్రీయల్ 2. 4 శాతం నష్టపోయింది. నాస్ డాక్ కాంపోజిట్ కూడా 4.6 శాతం తగ్గిపోయింది.
ట్రంప్ విధిస్తున్న సుంకాల ప్రభావంతో గత ఎనిమిది రోజుల్లో ఏడోసారి అమెరికా స్టాక్ మార్కెట్ లో తరుచుగా ఒకశాతం పెరుగుదల లేదా తగ్గుదల దిశలో ప్రయాణిస్తోంది.
దీనిపర్యవసానంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రత్యక్షంగా దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది. అమెరికా కంపెనీలు, వినియోగదారులు ఇద్దరు ఆర్థిక వ్యవస్తను స్తంభింపజేసే అవకాశం ఉంది.
కుచించుకుపోవచ్చు..
ఆర్థిక వ్యవస్థ ఇంకా బలహీన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్కెట్లో నిరాశావాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఫెడరల్ ఇటీవల సేకరించిన డేటా ప్రకారం.. అమెరికా ఆర్థిక వ్యవస్థ కుచించుకుపోతోందని తెలిపింది.
దేశంలో ఆర్థిక మాంద్యం ఉందని అనుకుంటున్నారా? అని ట్రంప్ ఈ మధ్య ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ..‘‘ నేను వాటిని అంచనా వేయడానికి ఇష్టపడను.
మనం చేస్తున్నది చాలా పెద్దది కాబట్టి పరివర్తన కాలం ఉంది. మనం అమెరికాకు సంపద తిరిగి వస్తున్నాను. అది చాలా పెద్ద విషయం. దీనికి కొంచెం సమయం పడుతుంది’’ అని అన్నారు.
అమెరికాకు తయారీ ఉద్యోగాలను తిరిగి తీసుకురావాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ చెప్పారు. ప్రభుత్వం ఖర్చు చేసే అలవాటు తగ్గించిందని అందుకే ఆర్థిక వ్యవస్థ డిటాక్స్ కాలం గుండా వెళ్లవచ్చని ఆయన ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ అన్నారు. సుంకాలు, ఆయన ఇచ్చిన ఆఫర్ లలతో ఇది సాధ్యమవుతుందని అన్నారు.
ప్రస్తుతానికి అమెరికా ఉద్యోగ మార్కెట్ స్థిరమైన నియమకాలను చూపుతోంది. గత సంవత్సరం ఆర్థిక వ్యవస్థ ఘన రేటుతో ముగిసింది. కానీ ఆర్థికవేత్తలు మాత్రం ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అని అంచనా వేస్తున్నారు.
టారిఫ్ లతో వెనక్కి తగ్గింది..
గోల్డ్ మన్ సాచ్స్ ఈ సంవత్సరం అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆర్థిక వృద్ది రేట్ అంచనాను 2.2 శాతం నుంచి 1.7 శాతానికి తగ్గించింది. సుంకాలు గతంలో ఉన్నదానికంటే ఎక్కువగా ఉండటమే కారణమని తెలిపింది.
వచ్చే ఏడాది ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఐదుగురిలో ఒకరు భావిస్తున్నారు. ఆర్థిక నష్టాలు దేశ ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తాయని కనిపిస్తే వైట్ హౌజ్ విధాన మార్పులు వెనక్కి తీసుకుందని వారు భావిస్తున్నారు.
మార్కెట్ లో ఎల్లప్పుడూ బహుళా శక్తులు ఉంటాయి. కానీ ప్రస్తుతం దాదాపు అన్నీ దేశాలు సుంకాలు విషయంలో ఆచితూచి స్పందిస్తున్నాయని మోర్గాన్ స్టాన్లీ పెట్టుబడులు మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్ లార్కిన్ అన్నారు.
దెబ్బతిన్న బిగ్ స్టాక్ కంపెనీలు..
వాల్ స్ట్రీట్ లో ఎక్కువ మొత్తంలో నష్టపోయిన వాటిలో అనేక బిగ్ టెక్ కంపెనీలు ఉన్నాయి. సోమవారం నాడు ఎన్వీడియా 5.9 శాతం క్షీణించింది. ఈ సంవత్సరంలో దాని నష్టాలు 21 శాతానికి చేరుకుంది.
ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా షేర్లు ఏకంగా 15.1 శాతం క్షీణించాయి. 2025 నాటికి దాని నష్టాలు ఏకంగా 45 శాతం మేర ఉంది. ట్రంప్ తో ఎలాన్ మస్క్ కు ఉన్న సంబంధం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో సాయపడుతుందనే ఆశలపై తరువాత పోవడంతో స్టాక్ మార్కెట్ లో దాని ధర దారుణంగా పడిపోవడం ప్రారంభం అయింది.
అమెరికా ప్రభుత్వ ఉద్యోగులను తొలగించే ప్రక్రియకను మస్క్ బాధ్యత వహించడంతో చాలామంది టెస్లా డీలర్ షిప్ లను రద్దు చేసుకుంటున్నాయి. అమెరికా అంటేనే దాచుకోకుండా ఖర్చు చేయడం.. కానీ ప్రస్తుతం అమెరికన్లు చాలామేరకు ప్రయాణాలు తగ్గించారు. యూనైటెడ్ ఎయిర్ లైన్స్ 8.4 శాతం, క్రూయిజ్ ఆపరేటర్ కార్నీవాల్ 9.2 శాతం నష్టపోయాయి.
స్టాక్ మార్కెట్ మాత్రమే కాదు..
అన్ని రకాల స్టాక్ లు మాత్రమే కాదు. బిట్ కాయిన్ వంటి కొన్ని రకాల పెట్టుబడుల్లో వెనక్కి తగ్గారు. డిసెంబర్ లో 106000 డాలర్ల కంటే ఎక్కువగా ఉన్న క్రిప్టో కరెన్సీ విలువ ప్రస్తుతం 78000 డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతం పెట్టుబడిదారులు ట్రెజరీ బాండ్లను వేలం వేస్తున్నారు. దీనిఫలితంగా వాటిదిగుబడి తగ్గింది. పది సంవత్సరాల తరువాత ట్రెజరీ దిగుబడి 4.32 శాతం నుంచి 4.21 శాతానికి పడిపోయింది.
పడిపోయిన యూరోపియన్ మార్కెట్లు..
ఆసియాలోని షేర్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలు చూసిన తరువాత యూరోపియన్ సూచీలు భారీగా పడిపోయాయి. 13 నెలల్లో మొదటిసారిగా ఫిబ్రవరిలో వినియోగదారుల ధరలు తగ్గాయని చైనా చెప్పిన తరువాత హాంకాంగ్ లో 1.8 శాతం, షాంఘై లో 0.2 శాతం క్షీణించాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ బలహీనతకు ఇది సంకేతం.