దేశ వ్యతిరేక పోస్టుకు లవ్ ఎమోజీ.. బంగ్లా విద్యార్థిని వక్ర బుద్ది..

ఏ దేశంలో ఉంటే ఆ దేశ చట్టాలు, వ్యవస్థలను గౌరవించాలి. కానీ బంగ్లాదేశ్ కు చెందిన ఓ విద్యార్థిని మాత్రం తన బుద్దిని చూపించడంతో భారత అధికారులు..

Update: 2024-08-27 11:42 GMT

పాముకు పాలు పోసిన.. అది విషమే కక్కుతుందని నానుడి. కొన్ని దేశాలు కూడా ఇంతే.. ఎంత చేసిన వారి దుర్మార్గాపు స్వభావాన్ని విడిచిపెట్టరు. ఇప్పుడు ఇందేందుకంటారా.. బంగ్లాదేశ్ కు చెందిన ఓ విద్యార్థిని మనదేశంలో అసోం రాష్ట్రంలో గల ’నిట్’ లో ఇంజనీరింగ్ చదువుకుంటుంది.

సోమవారం ఫేస్ బుక్ లో మనదేశానికి వ్యతిరేకంగా ఓ పోస్టు రాగానే సదరు విద్యార్థిని దాన్ని లైక్ చేసి, లవ్ ఎమోజీతో రెస్పాండ్ అయింది. ఈ విషయం బయటకు రావడంతో అలర్ట్ అయిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. ఫేస్ బుక్ లో భారత వ్యతిరేకపోస్టు పెట్టిన సదరు వ్యక్తి కూడా కేవలం ఆరు నెలల ముందు మనదేశంలో ఇదే కాలేజ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడని తెలిసింది. దానితో చిర్రెత్తుకొచ్చిన అధికారులు వెంటనే ఆ విద్యార్థిని స్వదేశానికి తిప్పి పంపారు

ఇది "బహిష్కరణ కాదు" కానీ బంగ్లాదేశ్ అధికారులతో సంప్రదింపులు జరిపి వెనక్కి పంపినట్లు కాచర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నుమల్ మహట్టా పేర్కొన్నారు. ఎన్‌ఐటీ సిల్చార్‌లోని ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో నాలుగో సెమిస్టర్ చదువుతున్న మైషా మహాజబిన్ అనే విద్యార్థినిని సోమవారం అస్సాంలోని కరీంనగర్ జిల్లా సుతార్‌కండి వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు (ఐసీపీ) ద్వారా బంగ్లాదేశ్‌కు పంపించినట్లు ఎస్పీ తెలిపారు.
"ఇది బహిష్కరణ కేసు కాదు... ఆరు నెలల క్రితం ఇక్కడే చదివి వెళ్లిన తన సీనియర్, NIT సిల్చార్ పూర్వ విద్యార్థి సహదత్ హుస్సేన్ ఆలీ ఫేస్ బుక్ లో చేసి భారతదేశ వ్యతిరేక పోస్టుకు ప్రేమ చిహ్నంతో స్పందించారు. అతను ఇప్పుడు బంగ్లాదేశ్‌లో నివసిస్తున్నారు, ” అని మహత్తా జాతీయ మీడియాకు చెప్పారు.
ఇలాంటి పోస్ట్‌ను చూసి చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారని, అక్కడ ఆమె 'లవ్' ఎమోజీతో స్పందించిందని ఎస్పీ పేర్కొన్నారు. మహాజబిన్ తన దేశానికి వెళ్లేందుకు అనుమతించాల్సిందిగా NIT సిల్చార్ అధికారులను అభ్యర్థించినట్లు కూడా మహత్త పేర్కొన్నారు.
ఆమె కోర్సు పూర్తి చేయడానికి తిరిగి వస్తారా అని అడిగిన ప్రశ్నకు, SP సమాధానిమిస్తూ.. "ఆమె ఇంకా తన కోర్సు పూర్తి చేయలేదు, ఆమె తన చదువును పూర్తి చేయడానికి తిరిగి వస్తుందో లేదో, దాని గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేము." పేర్కొన్నారు. భారత- బంగ్లాదేశ్ ప్రభుత్వాల అవగాహన ప్రకారం మొత్తం 70 మంది బంగ్లాదేశ్ విద్యార్థులు ప్రస్తుతం NIT సిల్చార్‌లో చదువుతున్నారు.
వీరిలో బంగ్లాదేశ్‌కు చెందిన దాదాపు 40 మంది హిందూ విద్యార్థులు ఎన్‌ఐటీ సిల్చార్‌లో ఉన్నారని మహత్త తెలిపారు. "నేను విద్యార్థులను వ్యక్తిగతంగా కలుసుకున్నాను ఎటువంటి తప్పుడు పని చేయవద్దని లేదా భారతదేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని వారిని కోరినట్లు" అని ఆయన చెప్పారు.
ఇంతలో, హిందూ రాఖీ దళ్ ప్రతినిధి సువాశిష్ చౌదరి ఓ జాతీయ మీడియా తో మాట్లాడుతూ, మాజీ విద్యార్థి భారతీయ వ్యతిరేక పోస్ట్‌ను గమనించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు తెలియజేశామన్నారు.
"మేము బంగ్లాదేశ్‌లోని రాజ్‌షాహి విశ్వవిద్యాలయం నుంచి వస్తున్న కొన్ని భారతీయ వ్యతిరేక పోస్ట్‌లను పోలీసులకు ఫార్వార్డ్ చేసాము. ఆమె (మహాజబిన్) ప్రేమ చిహ్నంతో అటువంటి పోస్ట్‌కు ఆమె మద్దతు ఇచ్చింది," అన్నారాయన.


Tags:    

Similar News