మరో ముగ్గురు బందీలను విడిచిపెట్టిన హమాస్

రెండో విడత చర్చలకు ముందు ట్రంప్ తో భేటీ కాబోతున్న నెతన్యాహూ;

Update: 2025-02-02 07:36 GMT

పశ్చిమాసియాలో హమాస్- ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం లో భాగంగా నాలుగో రౌండ్ లో నలుగురు బందీలను హమాస్ విడుదల చేసింది. దీనికి బదులుగా ఇజ్రాయెల్ 183 మంది ఖైదీలను విడుదల చేసింది.

ఇరుపక్షాల మధ్య కుదిరిన ఆరు వారాల శాంతి ఒప్పందంలో భాగంగా హమాస్ 33 బందీలను హమాస్ విడుదల చేస్తే, 2000 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలని, అలాగే పాలస్తీనియన్లు ఉత్తర గాజాకు తిరిగి రావాలని, విధ్వంసానికి గురైన భూభాగానికి మానవతా సాయం పెంచాలని సంధి కుదిరింది.
మొదటి దశ బందీల విడుదల తరువాత ఇజ్రాయెల్ - హమాస్ మధ్య వచ్చేవారం నుంచి రెండోదశ చర్చలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. లేకపోతే  ఇరుపక్షాల మధ్య యుద్దం మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే హమాస్ మాత్రం కాల్పుల విరమణ కొనసాగించాలని డిమాండ్ చేస్తోంది.
గాజాలోని పాలస్తీనా అధికారులు కూడా ఈజిప్టులోని రఫా సరిహద్దును శనివారం నుంచి తిరిగి తెరిపించడానికి ప్రయత్నిస్తున్నారు. వైద్య సంరక్షణ కోసం వేలాది మంది పాలస్తీనియన్లు ఎదురు చూస్తున్నారు. వారికి సాయం కావాలంటే ఈజిప్టు నుంచి నుంచి ట్రక్కులు రావాల్సిందే.
రేపటి నుంచి రెండో దశ చర్చలు..
ఇజ్రాయెల్- హమాస్ మధ్య రెండో దశ చర్చలు సోమవారం ప్రారంభం కానున్నాయి. పశ్చిమాసియాలో డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారీ స్టీవ్ విట్ కాఫ్ తో శనివారం ఇజ్రాయెల్ ప్రధానితో బెంజమిన్ నెతన్యాహు సమావేశం కాబోతున్నట్లు ఆయన కార్యాలయం తెలిపింది. అయితే రెండో దశ చర్చలు అమెరికా రాజధాని వాషింగ్టన్ లో జరగబోతున్నాయి. వీటి కోసం నెతన్యాహూ అక్కడికి వెళ్లబోతున్నాయి. తరువాత ఆయన ట్రంప్ తో భేటీ అవుతారని తెలుస్తోంది.  ప్రస్తుతం అమెరికా ప్రతినిధులు ఇతర మధ్యవర్తులైన ఖతార్, ఈజిప్టులతో చర్చించబోతున్నారు.
మళ్లీ పోరాటంలోకి..
పది రోజుల క్రితం  దాకా హమాస్ చేతిలో బందీగా ఉండి విడుదలైన డోరన్ స్ట్రేచర్ మాట్లాడుతూ.. హామాస్ చెరలో బందీలు ఉన్న వారు అసలు ఉన్నారో లేరో అని తెలుసుకునేందుకు వీడియోలు ముఖ్యం అన్నారు. తను కోలుకోవడం గురించి ప్రస్తావించారు. తాను ప్రస్తుతం హయిగా ఇంట్లో ఉన్నానని, స్వేచ్చా గాలిని పీలుస్తున్నాని అన్నారు. బందీలందరినీ తిరిగి తీసుకురావడానికి వచ్చే పోరాటంలో తాను పాల్గొంటానని ఆమె ప్రతిజ్ఞ చేశారు.
కొత్త చీఫ్..
ప్రస్తుతం రాజీనామా చేసిన ఇజ్రాయెల్ సైనిక చీఫ్ స్థానంలో కొత్త అధిపతి గా ఇయల్ జమీర్ ను నియమిస్తామని నెతన్యాహు కార్యాలయం తెలిపింది. అక్టోబర్ 7, 2023 నాటి దాడులకు బాధ్యత వహిస్తూ ప్రస్తత నాయకుడు హలేవీ రాజీనామా చేశారు. ఇయాల్ రక్షణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఆయన మంచి సమర్దుడైన నాయకుడిగా పేరుంది. 


Tags:    

Similar News