ట్రంప్ హత్య కుట్ర బట్టబయలు.. ఇద్దరి అరెస్టు..
డొనాల్డ్ ట్రంప్ హత్య కుట్రను FBI బట్టబయలు చేసింది. ఇద్దరు నిందితుల అరెస్టుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు డొనాల్డ్ ట్రంప్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డ విషయం తెలిసిందే. పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో ఆయనపై ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. బుల్లెట్ తగలడంతో ట్రంప్ కుడి చెవికి గాయమైంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను చుట్టుముట్టి అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు.
ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి ఫర్జాద్ షాకేరీ అని, ఇరాన్ పన్నిన కుట్రను ఎఫ్‌బీఐ భగ్నం చేసిందని న్యాయ శాఖ తెలిపింది. ఇరాన్‌లో ఉన్నట్లుగా భావిస్తున్న 51 ఏళ్ల షాకేరీని పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ ఏజెంట్‌గా యూఎస్ న్యాయ శాఖ అభివర్ణించింది. దొంగతనానికి పాల్పడిన నేరానికి గతంలో షాకేరీ 14 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత షాకేరీని 2008లో ఇరాన్‌కు పంపించేశారు. అయితే షాకేరీ ఇద్దరు న్యూయార్క్ నివాసితులు కార్లిస్లే రివెరా, జోనాథన్ లోడ్‌హోల్ట్‌తో టచ్‌లో ఉన్నాడని, తన కుట్రలో వారిని భాగస్వాములు చేసుకున్నాడని న్యాయ శాఖ వెల్లడించింది. వీరిద్దరిని అరెస్ట్‌తో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.