రష్యాపై భారీగా డ్రోన్ లను ప్రయోగించిన ఉక్రెయిన్

రష్యా అధ్యక్ష ఎన్నికల వేళ ఉక్రెయిన్ భారీగా డ్రోన్ దాడులకు పాల్పడింది. దీనిపై అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారికి క్షమాభిక్ష ఉండదని..

Update: 2024-03-17 10:12 GMT

రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న వేళ ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులకు దిగింది. అది కూడా రష్యా రాజధాని మాస్కో పరిసర ప్రాంతాల్లో కావడంతో రష్యా మిలిటరీ అప్రమత్తతో వ్యవహరించి దాదాపు 35 డ్రోన్లను కూల్చి వేసినట్లు ప్రకటించింది. ఆదివారం రష్యా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నయి.

అధ్యక్షుడిగా మరోసారి పుతిన్ పోటీ చేస్తుండడంతో గెలుపు లాంఛనమే కానుంది. దీనితో మరో ఆరు సంవత్సరాలు ఆయనే అధ్యక్షుడిగా ఉండనున్నారు. యుద్దాన్ని తీవ్రతరం చేసేందుకే ఈ దాడులు చేసినట్లు క్రిమ్లిన్ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ తెలిపారు.

రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం, రష్యా రాజధానికి దక్షిణంగా ఉన్న కలుగా ప్రాంతం, మాస్కోకు ఈశాన్యంగా ఉన్న యారోస్లావల్ ప్రాంతంపై మరో రెండు డ్రోన్లు కూల్చివేసినట్లు వెల్లడించింది. ఉక్రెయిన్ సరిహద్దు నుంచి 800 కిమీ (500 మైళ్ళు) దూరంలో ఉన్న యారోస్లావల్ ప్రాంతంపై దాడులు జరిగినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఉక్రెయిన్ కి సరిహద్దుగా ఉన్న బెల్గోరోడ్, కుర్స్క్ రోస్టోవ్ ప్రాంతాలపై కూడా దాడులు జరిగినట్లు వాటిని సైతం కూల్చివేసినట్లు ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇవన్నీ కూడా ఇంతకుముందు జరిగిన డ్రోన్ దాడుల సిగ్నేచర్ ను కలిగి ఉన్నాయని తెలుస్తోంది. డ్రోన్ దాడులపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు.
రష్యన్ ప్రజలను భయపెట్టడానికి ఈ డ్రోన్ దాడులు జరిగినట్లు ఆరోపించారు. రష్యా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఉక్రెయిన్ ప్రయత్నించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శత్రు దాడులు మాపై జరగలేదు కానీ మేము విధించే శిక్ష నుంచి తప్పించుకోలేరు అని పుతిన్ భద్రతా మండలి సమావేశంలో అధ్యక్షుడు పుతిన్ ప్రతిజ్ఞ చేశారు. రష్యా ప్రజలు ఐక్యంగా ఉండి దీనికి తగిన జవాబు చెప్తారని అన్నారు.
రెండు సంవత్సరాల క్రితం మొదలైన రష్యా- ఉక్రెయిన్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓ వైపు బలమైన రష్యా, మరొవైపు నాటో కూటమి అండతో ఉక్రెయిన్ పోరాటాలను కొనసాగిస్తున్నాయి. కీవ్ ప్రతిఘటనతో మాస్కో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. సప్లై చైన్స్ తో దెబ్బతినడంతో రష్యా ఇబ్బంది పడుతోంది. ఇదే అదనుగా రష్యా లోపలి ప్రాంతాల్లో ఉక్రెయిన్ డ్రోన్ దాడులకు దిగుతోంది.
శనివారం నాటి యుద్ధంలో ఉక్రెయిన్ జరిపిన షెల్లింగ్ ఇద్దరు రష్యన్లు ప్రాణాలో కోల్పోయారు. అంతకుముందు కూడా భారీ డ్రోన్ దాడులకు ఉక్రెయిన్ ప్రయత్నించగా ఆర్మీ అడ్డుకున్నట్లు తెలిసింది. రష్యన్ వాలంటీర్ సైనికులు ఉక్రెయిన్ సైన్యానికి చిక్కినట్లు సైతం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొట్టింది. అయితే ఇది ఎంతవరకు నిజమే ఎవరూ ధృవీకరించలేదు. ఈ యుద్ధంతో లక్షలాది మంది ప్రజలు వలస బాట పట్టారు. ఉక్రెయిన్ మరో వందేళ్లు అయినా కోలుకోలేని విధంగా ధ్వంసం అయింది.


Tags:    

Similar News