కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా దక్షిణాది రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలు ఏకతాటిపైకి వచ్చాయి. దీనిని ఖండిస్తూ చెన్నై వేదికగా తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన జాయింట్ యాక్షన్ కమిటీ(JAC) సమావేశం నిర్వహించారు. ఇందులో కర్ణాటక, కేరళ, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లోని పార్టీల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. పినరయి విజయన్, రేవంత్ రెడ్డి, కేటీఆర్, భగ్వంత్ మాన్, శిరోమని అకాళిదల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బల్విందర్ సింగ్ , ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కేరళ జనరల్ సెక్రటరీ జీఎంఏ సలామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి హాజరుకావాలని డీఎంకే ఏడు రాష్ట్రాలను సంప్రదించింది. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, పంజాబ్. కాగా ఈ సమావేశానికి దూరంగా ఉండాలని పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ నిశ్చయించుకుంది. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. మార్చి 5న డీఎంకే నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్‌ను ఒక మైలురాయిగా అభివర్ణించారు. ఈ సమావేవంలో తమ మధ్య ఉన్న బేధాలను పక్కనబెట్టి 58 పార్టీలు పాల్గొన్నాయి. సమావేశానికి రావాలన్న పార్టీల ఏకాభిప్రాయం.. ప్రజాస్వామ్యం, న్యాయం పట్ల తమిళనాడుకు ఉన్న అచంచలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుందని స్టాలిన్ పేర్కొన్నారు.